Publisher is the useful and powerful WordPress Newspaper , Magazine and Blog theme with great attention to details, incredible features...

అంటరాని తనం పాటిస్తుంది ఎవరు…?

50ఏళ్ల కిందట అంటరాని తనాన్ని ఎవరెవరు పాటించారు. ఎవరెవరు బలయ్యారు అనే విషయం పక్కన పెడితే.. తాజాగా అంటరాని తనాన్ని హిందువులు పాటిస్తున్నారా..? క్రైస్తవులు, ముస్లింలు పాటిస్తున్నారా.. అనే విషయంపై  గ్రామ స్థాయి నుండి విచారణ జరిపించగలిగితే.. వెలుగులోకి రాని వాస్తవాలు బయట పడతాయి. ఇటీవల కాలంలో దళిత ముసుగులో క్రైస్తవ మతానికి చెందిన అధికారులు, ఉద్యోగులు, ఇతరులు హిందూ మతం పట్ల అంటరాని తనం పాటిస్తున్నారని.. విమర్శలు వస్తున్నాయి. హిందూమతస్థులమని దళిత సామాజికవర్గానికి చెందిన వారమని.. క్రైస్తవ మతానికి చెందిన వారు సర్టిఫికెట్లు తీసుకుంటూ విద్యార్ధి స్థాయి నుండి ఉద్యోగ స్థాయి వరకు రిజర్వేషన్లు పొందుతున్నారని.. ఆధారాలతో జిల్లాల కలెక్టర్లకు, పాలకులకు పదే పదే ఫిర్యాదులు అందుతున్నాయి. చివరకు దేవాదాయ ధర్మాదాయ శాఖలో కూడా దళిత ముసుగులో క్రైస్తవ మతానికి చెందిన అధికారులు, ఉద్యోగులు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. టిటిడి ప్రసాదాలు లేదా ఇతర దేవాలయాల ప్రసాదాలు పెట్టినప్పుడు ముస్లిం వర్గాలు ఆప్రసాదాలు తీసకుంటున్నాయి. కానీ క్రైస్తవ మతానికి చెందిన వారు ఆప్రసాదాలను అంటరానివిగా చూస్తున్నాయి. ఒకవేళ ఆ ప్రసాదాలను తీసుకోవాల్సిన పరిస్థితులు ఎదురయితే..ఆ ప్రసాదాలను తీసుకుని పక్కన పడవేస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. అటు సచివాలయంలో, ఇటు హెచ్‍వోడీలలో, ఇతర ప్రభుత్వ కార్యాలయాలలో వేలాది మంది క్రైస్తవ మతానికి చెందిన ఉద్యోగులు దళిత ముసుగులో పనిచేస్తున్నారు. దళిత సామాజికవర్గం పేరుతో ఉద్యోగాలు పొందుతూ క్రైస్తవ  మతాన్ని స్వీకరించిన వారు ఆయా ప్రభుత్వ కార్యాలయాలలో కనిపిస్తుంటారు. ముఖ్యంగా మహిళా అధికారులు, ఉద్యోగులు బొట్టు పెట్టుకోకుండా కనిపిస్తుంటారు. అదేమిటి అని అడిగితే.. మేము క్రైస్తవులం అందుకే బొట్టు పెట్టుకోవటం లేదంటారు. కానీ హిందూ మతస్థులు అయినా.. దళిత సామాజికవర్గానికి చెందిన వారం అని సర్టిఫి•కెట్లు తీసుకుని ఎందుకు రిజర్వేషన్‍ పొందుతున్నారని అడిగితే.. ఏ ఒక్కరూ మాట్లాడరు. హిందూ మతం అంటే గౌరవాభినాలు లేవు. ప్రసాదం పెడితే తినకుండా పక్కన పడేస్తారు. కానీ హిందూ మతం ముసుగులో సర్టిఫికెట్లు తెచ్చుకుని నిజమైన హిందూమతస్థుల్లో దళితులకు దక్కాల్సిన కాలేజీ సీట్లను క్రైస్తవ మతం వారే ఎక్కువగా పొందుతున్నారనేది వాస్తవం.మరో విషయం ఏమిటంటే.. ప్రమోషన్లలో రిజర్వేషన్లు కూడా నిజమైన దళితుల కన్నా.. క్రైస్తవ మతం స్వీకరించిన దళితులే ఎక్కువగా పొందుతున్నారని విమర్శలు వస్తున్నాయి. ఈ ఇరవై ఏళ్లలో ఎంతమంది అధికారులు, ఉద్యోగులు దళిత ముసుగులో క్రైస్తవ మతానికి చెందిన వారు ఎక్కడెక్కడ ఉద్యోగాలు చేస్తున్నారు అని విచారణ జరిపించగలిగితే… 80 నుండి 90 శాతం మంది క్రైస్తవ మతానికి చెందిన దళితులే కనిపిస్తుంటారని.. అధికారులు, ఉద్యోగులు చెబుతున్నారు.

Leave A Reply

Your email address will not be published.