Publisher is the useful and powerful WordPress Newspaper , Magazine and Blog theme with great attention to details, incredible features...

అప్పుల ఊబిలో కూరుకుపోతున్న. ..ఆంధ్ర

రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది.రాష్ట్రాని అప్పులతోనే నడిపించాల్సిన పరిస్థితి ఏర్పడింది.ప్రతి సంవత్సరము గడచిన ఏడాదికి చెందిన అప్పులు, వడ్డీలు చెల్లించాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ఆదాయ అంచనా ఎక్కువగా వేసుకోవడం, కేంద్రం నుంచి గ్రాంట్ల్, నిధులు సమయానికి రాకపోవడం రాష్ట్ర ప్రభుత్వాని ఇబ్బందులకు గురి చేస్తోంది. 2019-20 ఆర్థిక సంవత్సరం రాబడి మరింతగా తగ్గాయి. దీంతో ప్రభుత్వం అప్పులపై ఆధారపడుతోంది.

గడచిన ఐదేళ్లలో చంద్రబాబు ప్రభుత్వం రూ. రెండు లక్షల కోట్ల అప్పు చేశారని జగన్ ప్రభుత్వం చెబుతోంది. కానీ చంద్రబాబు ప్రభుత్వం చేసిన అప్పు రూ. లక్షా పన్నెండు వేల కోట్లు. ఆంధ్ర రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్ర ప్రదేశ్ వాటాగా వచ్చిన అప్పులు రూ. లక్షా నలభై ఎనిమిది వేల కోట్లు. అయితే ఈ ఆర్థిక సంవత్సంలో జగన్ ప్రభుత్వం గత ఐదేళ్లలో చంద్రబాబు ప్రభుత్వం చేసినంత అప్పును చేయడానికి రెడీ అయిపోయింది. ఇప్పటికే బడ్జెటేతర అప్పులను కూడా.. బడ్జెట్ అప్పులతో పాటుగా చేయడమే దీనికి కారణం. ఇప్పటికే రూ. 30వేల కోట్లు అప్పు అంటే.. ఈ ఏడాది.. చేసే అప్పు రూ. అరవై వేల కోట్లు దాటిపోతుందని.. ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. బడ్జెట్‌లో సంక్షేమ పథకాలకు కేటాయింపులు చూస్తే.. ఈ మొత్తం.. ఏడాదిలో రూ. లక్ష కోట్లకు చేరినా ఆశ్చర్యం లేదనే వాదన వారి నుంచి వినిపిస్తోంది.

- Advertisement -

జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన అతి కొద్ది కాలంలోనే జగన్ ప్రభుత్వం రూ. 30వేల కోట్ల అప్పులు చేసినట్లుగా ఆంధ్ర ప్రదేశ్ ఆర్థిక శాఖ వర్గాలు చెబుతున్నాయి. బడ్జెట్ పరిధిలోని అప్పులే రూ. పదహారు వేల కోట్లు తీసుకోగా.. కార్పొరేషన్లు, ఇతర ప్రైవేటు అప్పులు.. రూ. పది వేల కోట్లు దాటిపోయాయని తెలుస్తోంది. ఇప్పటికే పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్‌తో పాటు ఇతర కార్పొరేషన్ల ద్వారా మరో రూ. పదివేల కోట్ల అప్పు ప్రతిపాదనలు వివిధ బ్యాంకులు, ఆర్థిక సంస్థల వద్ద ఉన్నాయి. వీటిలో కొన్ని మంజూరు దశలో ఉన్నాయని తెలుస్తోంది. అతి కొద్ది సమయంలోనే.. ఇంత పెద్ద మొత్తం అప్పులు గతప్రభుత్వం కూడా చేయలేదు.

ఓ వైపు జగన్ ప్రభుత్వం నవరత్నాలకు ఖర్చు పెట్టుకుంటూ పోవడం.. మరో వైపు రాష్ట్ర ఆదాయం పడిపోవడంతో వాటి మధ్య వ్యత్యాసంను అప్పుల ద్వారా భర్తీ చేస్తోంది ప్రభుత్వం. ఎంత వడ్డీ అని చూసుకోకుండా.. అప్పులిచ్చే బ్యాంక్లు,ఇతర ఆర్థిక సంస్థలను విడిచి పెట్టడం లేదు. ఆ రుణాలను మాత్రం రాష్ట్రప్రభుత్వం నవరత్నాలకు వాడేసుకుంటుంది.ఇలాగే కొనసాగితె రాష్ట్ర అభివృద్ధి ఆగిపోతుంది..!

Leave A Reply

Your email address will not be published.