Publisher is the useful and powerful WordPress Newspaper , Magazine and Blog theme with great attention to details, incredible features...

అఫైర్ల గురించి ఓపెన్ అయిన శ్రుతి

అఫైర్ల గురించి ఓపెన్ అయిన శ్రుతి

శ్రుతి హాస‌న్ వేర్వేరు కాలాల్లో కొంద‌రు వ్య‌క్తుల‌తో ఎఫైర్లు న‌డిపిన‌ట్లుగా వార్త‌లొచ్చాయి. గ‌తంలో ఆమె బాయ్ ఫ్రెండ్స్‌గా క్రికెట‌ర్ సురేష్ రైనాతో పాటు న‌టులు సిద్దార్థ్, విక్రాంత్ మాసేల పేర్లు వినిపించాయి. వీటి సంగ‌తేమో కానీ మైకేల్ అనే బ్రిటిష్ వ్య‌క్తితో శ్రుతి రిలేష‌న్‌షిప్‌లో ఉన్న సంగ‌తి మాత్రం వాస్త‌వం. ఐతే ఇటీవ‌లే అత‌డి నుంచి శ్రుతి విడిపోయింది. ఈ నేప‌థ్యంలో ఒక ఇంట‌ర్వ్యూలో భాగంగా త‌న జీవితంలో వేర్వేరు కాలాల్లో ఇద్ద‌రితో ప్రేమ‌లో ఉన్న‌ట్లు శ్రుతి వెల్ల‌డించి.వాటి నుంచి ఎందుకు బ‌య‌టికి వ‌చ్చేశానో వివ‌రించింది.

- Advertisement -

నేను తొలిసారి ఓ రిలేషన్‌షిప్‌లో ఉన్నప్పుడు ఆ విషయం బయటకు చెప్పడానికి భయపడ్డాను. ఎవరైనా ఏమైనా తప్పుగా అనుకుంటారేమో అనిపించింది. ఆ రిలేష‌న్‌షిప్‌ వర్కవుట్‌ కాలేదు. ఆ తర్వాత కొన్నేళ్లకు మళ్లీ ఓ బంధం ఏర్పడింది. ఈసారి ఎందుకు బయటకు చెప్పకూడదు అనిపించింది. నేనో ప్ర‌త్యేక‌మైన బంధంలో ఉన్నాన‌ని బయటకు చెప్పేశాను. నేనలా ఓపెన్‌గా చెప్పడాన్ని చాలామంది మెచ్చుకున్నారు.

జీవితాంతం కొనసాగించాలనే ఏ బంధాన్నయినా మొదలుపెడతాం. ఈ బంధం అలాగే మొద‌లైంది. అది కుదరనప్పుడు ఏం చేయగలం? అందుకే దాన్ని తెంచుకున్నాను. ఆ బంధం మొదలైనందుకు హ్యాపీ ఫీలయ్యాను. ముగిసిపోయనప్పుడూ ఆనందపడ్డాను’’ అని శ్రుతి చెప్పింది. ప్ర‌స్తుతానికి తాను సింగిల్ అని ప్రేమ‌, పెళ్లి గురించి ఆలోచించ‌కుండా సినిమాలు, కెరీర్ మీద దృష్టిపెట్టాన‌ని శ్రుతి తెలిపింది.

Leave A Reply

Your email address will not be published.