బాహుబలి తర్వాత రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ చిత్రంపై ఆకాశమంత అంచనాలు ఉన్నాయి.దానికి తోడు అల్లూరి సీతారామరాజు,కొమురం భీమ్ వంటి చారిత్రక పురుషుల నేపథ్యం ఉన్న చిత్రం కావడం..ఎన్టీఆర్,రాంచరణ్ కలయికలో వస్తుండటంతో.. సినిమాపై ఇప్పటినుంచే తెగ క్యురియాసిటీ నెలకొంది. ఆర్ఆర్ఆర్కి సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా జనం ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఆర్ఆర్ఆర్ సినిమాకు సంబంధించి మరో లీక్ బయటకొచ్చింది. టైటిల్‌కి సంబంధించిన ఆ లీక్‌పై ఫిలింనగర్ వర్గాలు ఆసక్తిగా చర్చించుకుంటున్నాయి.
- Advertisement -
రాజమౌళి,రాంచరణ్,ఎన్టీఆర్‌ల కాంబినేషన్లో వస్తుండటంతో ‘ఆర్ఆర్ఆఆర్’ అన్న వర్కింగ్ టైటిల్ ఫిక్స్ చేసిన సంగతి తెలిసిందే.అయితే ఆర్ఆర్ఆర్కి మ్యాచ్ అయ్యేలా ‘రామ రౌద్ర రుషితం’ అనే టైటిల్‌ను రాజమౌళి సీరియస్‌గా పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది.ఇక ఇంగ్లీష్‌తో పాటు మిగతా భాషల్లో ‘రైజ్ రివోల్ట్ రివెంజ్’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్టు సమాచారం. త్వరలోనే దీనిపై అధికారిక స్పష్టత వచ్చే అవకాశం ఉందంటున్నారు. చూడాలి మరి.. ఈ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఊహాగానాలకే పరిమితమవుతుందా..? లేక రాజమౌళి ఇదే టైటిల్‌కి ఫిక్స్ అవుతారా..?