ఆమధ్య పవన్‌కళ్యాణ్ విషయంలో అభిమానులకి కోపం వచ్చేలా మాట్లాడిన అల్లు అర్జున్ ఆ తర్వాత కొన్నాళ్లకి మామూలైపోయాడు. అయితే మళ్లీ చిరంజీవి కుటుంబంతో అల్లు అర్జున్ దూరంగా వుంటోన్న భావన కలుగుతోంది. తమ కుటుంబం నుంచే వస్తోన్న అతి పెద్ద చిత్రం సైరా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి అల్లు అర్జున్ రాకపోవడం అందరినీ ఆశ్చర్యపరచింది. విదేశాల్లో షూటింగ్ చేస్తున్నట్టయితే రాలేదని అనుకోవచ్చు.
- Advertisement -
హైదరాబాద్‌లోనే షూటింగ్ జరుగుతున్నా కానీ బన్నీ రాలేదు. అంతే కాదు సైరా ట్రెయిలర్ గురించి ఇంతవరకు ఒక్క ట్వీట్ కూడా వేయలేదు. సైరా టీజర్ వచ్చినపుడు కూడా ట్వీట్ చేయకుండా, రెండు రోజుల తర్వాత చిరంజీవి బర్త్‌డేకి విష్ చేస్తూ ఆ టీజర్ లింక్ మాత్రం షేర్ చేసాడు. సినిమా ఎలా అనిపిస్తోందనే దానిపై తన మాట కూడా ఇంతవరకు చెప్పలేదు. ఇదిలావుంటే సైరా ఈవెంట్లో అల్లు అరవింద్ మాట్లాడుతుంటే అభిమానులు చేతులు అడ్డంగా ఊపుతూ మాట్లాడవద్దని నిరసన తెలిపారు. విషయం అర్థమయినా కానీ పెద్ద మనిషి కనుక ఒక నిమిషం పాటు మాట్లాడి ముగించారు.
అల్లు లేదా గీతా టీమ్‌కి సంబంధించిన అందరినీ చరణ్ చాలా కాలంగా దూరం పెడుతున్నాడు. తనకంటూ సెపరేట్ పీఆర్ టీమ్‌ని పెట్టుకుని, కొణిదెల ప్రొడక్షన్స్ వ్యవహారాలలో అల్లు అరవింద్‌ని ఎక్కడా ఇన్వాల్వ్ చేయడం లేదు. మిగతా వారి సంగతి ఎలా వున్నా చిరంజీవి విషయంలో చాలా ఎమోషనల్ ఎటాచ్మెంట్ వున్న అల్లు అర్జున్ ‘సైరా’ విషయంలో ఇలా ప్రవర్తిస్తూ వుండడం మెగా ఫ్యామిలీకి క్లోజ్ అయిన వారిని కూడా విస్మయానికి గురి చేస్తోంది.