Publisher is the useful and powerful WordPress Newspaper , Magazine and Blog theme with great attention to details, incredible features...

తొలినాళ్లలో ఎన్నోకష్టాలు అనుభవించాను..

తొలినాళ్లలో ఎన్నోకష్టాలు అనుభవించాను..

లేటు వయస్సులో కెరీర్ ప్రారంభించిన విద్యాబాలన్ తొలి నాళ్లలో అడ్వర్టయిజ్ మెంట్స్ లో నటించానని చెప్పుకొచ్చింది. టాలెంట్ ఉన్నప్పటికీ కారణం ఏంటో చెప్పకుండానే తనను పక్కన పెట్టేవారని వాపోయింది. అప్పట్లో 2002లో మాధవన్ హీరోగా తెరకెక్కిన ‘రన్’ సినిమాలో మొదట హీరోయిన్‌గా విద్యాబాలన్‌ను తీసుకున్నారు. ఆ తర్వాత ఏమైందో ఏమో ఆమె ప్లేస్‌లో మీరా జాస్మిన్‌ను హీరోయిన్‌గా తీసుకున్నారు. ఆ తర్వాత కూడా కొన్ని సినిమాల్లో విద్యాబాలన్‌కు అవకాశాలు వచ్చినట్టే వచ్చి చేజారాయి. ఈ రకంగా కెరీర్లో ఎన్నో ఎత్తు పల్లాలు చూశానని చెప్పుకొచ్చింది ఈ సౌత్ సుందరి.

- Advertisement -

విద్యాబాలన్ తన గురించి చెబుతూ..తాను  మామూలు మధ్యతరగతి నుంచి వచ్చానని,  తన కుటుంబంలో ఎవరూ సినిమా బ్యాక్ గ్రౌండ్ కు సంబంధం ఉన్నవాళ్లు లేరని విద్యాబాలన్ తెలిపింది. బాలీవుడ్‌లో ‘పరిణీత’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత ‘డర్డీ పిక్చర్స్’ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ స్టేటస్ అందుకుంది.తెలుగులో ఈ భామ బాలకృష్ణ హీరోగా నటించిన‘ఎన్టీఆర్’ బయోపిక్‌లో నందమూరి బసవతారకం పాత్రలో నటించింది. ఆ తర్వాత అజిత్ హీరోగా నటించిన ‘నేర్కొండ పార్వాయి’ మూవీలో కథానాయికగా మెరిసింది. ప్రస్తుతం ఈ భామ అక్షయ్ కుమార్ హీరోగా నటించిన ‘మిషన్ మంగళ్’ సినిమాలో ముఖ్యపాత్రలో నటించింది. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్ టాక్‌తో దూసుకుపోతుంది.

Leave A Reply

Your email address will not be published.