Publisher is the useful and powerful WordPress Newspaper , Magazine and Blog theme with great attention to details, incredible features...

ప్రతీరోజు ఆన్‌లైన్‌లో టీచర్లు, విద్యార్థుల హాజరు

ప్రతీరోజు ఆన్‌లైన్‌లో టీచర్లు, విద్యార్థుల హాజరు

సర్కారు బడుల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్యాబోధన జరిగేలా విద్యాశాఖ చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా ఉపాధ్యాయులు ప్రతిరోజు పాఠశాలకు హాజరయ్యేలా ప్రత్యేకంగా ‘టీ’యాప్‌ను రూపొందించింది. ఈ యాప్‌ ద్వారా విద్యార్థులతో పాటు ఉపాధ్యాయుల హాజరు వివరాలు ప్రతిరోజు ఆన్‌లైన్‌లో పొందుపర్చాల్సి ఉంటుంది. రాష్ట్ర విద్యాశాఖ కార్యాలయంలో అధికారులు ప్రతిరోజు ఉపాధ్యాయులు, విద్యార్థుల హాజరును పర్యవేక్షిస్తారు. ఏ పాఠశాలలో హాజరు తక్కువగా ఉంది. ఉపాధ్యాయుల గైర్హాజరుకు గల కారణాలను అడిగి తెలసుకునే వీలుంటుంది. అయితే ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలల్లో బయోమెట్రిక్‌ హాజరు, సెల్ఫీ విత్‌ టీచర్‌ అనే కార్యక్రమాలు కొనసాగుతున్నాయి

ఇదిలా ఉండగా చాలా పాఠశాలల్లో బయోమెట్రిక్‌ యంత్రాలు పనిచేయకపోవడం, నెట్‌వర్క్‌ సమస్యలు ఉండడంతో సరిగ్గా పనిచేయడంలేదని తెలుస్తోంది. ఉపాధ్యాయులు సమయపాలన పాటిస్తున్నారా.. లేదా అనే విషయాన్ని కూడా ఉన్నతాధికారులు పసిగట్టలేకపోతున్నారు. తప్పించుకునేందుకు కొంతమంది ఉపాధ్యాయులు బయోమెట్రిక్‌ హాజరును ఉపయోగించడం లేదనే విమర్శలు లేకపోలేదు. గతనెల నుంచి విద్యా శాఖ ‘టీ’ యాప్‌ను అమల్లోకి తీసుకొచ్చింది. ఈ యాప్‌ను రాష్ట్ర విద్యా శాఖ కమిషనర్‌తో పాటు జిల్లా విద్య శాఖాధికారులకు అనుసంధానం చేశారు. దీంతో వారు ప్రతిరోజు జిల్లాలో ఎంతమంది ఉపాధ్యాయులు గైర్హాజరయ్యారు. ఎంత మంది విద్యార్థులు పాఠశాలలకు వస్తున్నారనే విషయాలను తెలుసుకునే అవకాశం ఉంది. గైర్హాజరును తగ్గించేందుకు విద్యాశాఖ ఈ విధానాన్ని అమలు చేస్తోంది.

- Advertisement -

పాఠశాలలకు డుమ్మా కొట్టే గురువులపై విద్యా శాఖ ప్రత్యేక దృష్టి సారించింది. ఇప్పటికే బయోమెట్రిక్, సెల్ఫీ విత్‌ టీచర్‌ అమలు చేస్తోంది. అయితే విద్యా శాఖ కమిషనర్‌ ప్రత్యేక చొరవతో ఈ యాప్‌ను రూపొం దించారు. ఆన్‌లైన్‌ ద్వారా అనుసంధానం ఉండడంతో నేరుగా వివరాలు విద్యా శాఖ కమిషనర్‌ కార్యాలయానికి చేరుతాయి. దీంతో ఉపాధ్యాయులు, విద్యార్థుల హాజరు ఇట్టే తెలిసిపోతుంది.

‘టీ’యాప్‌ను గూగుల్‌ ప్లేస్టోర్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవాల్సి ఉంటుంది. ఆండ్రైడ్‌ ఫోన్‌లో మాత్రమే ఈ యాప్‌ పనిచేస్తుంది. యుడైస్‌ ఆధారంగా పాఠశాలకు కేటాయించిన కోడ్‌ను అందులో రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలి. పాఠశాల పేరు, ఉపాధ్యాయులు, విద్యార్థుల వివరాలను పొందుపర్చాలి. పాఠశాల మెయిల్‌ ఐడీ, ప్రధానోపాధ్యాయుడి సెల్‌ నంబర్‌ నమోదు చేయాలి. తర్వాత రిజిస్ట్రేషన్‌ పూర్తవుతుంది. ప్రతిరోజు ఉదయం 10గంటల నుంచి 10.30గంటల వరకు విద్యార్థులు, ఉపాధ్యాయుల హాజరు నమోదు చేయాలి. ఈ వివరాలు రాష్ట్ర విద్యాశాఖ కార్యాలయంతో పాటు జిల్లా విద్యశాఖ అధికారి కార్యాలయానికి చేరుకుంటాయి. దీంతో పాఠశాలల వివరాలను క్షణాల్లో ఉన్నతాధికారులు తెలుసుకునే వీలుంది. ‘టీ’ హాజరులో నమోదు చేసిన వివరాలు సరైనవా.. కావా అనేది తనిఖీ చేసినప్పుడు విద్యాశాఖాధికారులకు తెలిసిపోతుంది. తప్పుడు సమాచారం పొందుపర్చితే సంబంధిత ఉపాధ్యాయులపై శాఖపరమైన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరిస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.