‘వార్’ సినిమా కోసం మూడేళ్లా?
వాణి కపూర్ యష్‌రాజ్ ఫిలింస్‌లో పరిచయం అయి ఇన్నేళ్లుగా అక్కడే వుండిపోయింది. బేఫిక్రే తర్వాత ‘వార్’ సినిమా కోసం మూడేళ్ల పాటు యష్రాజ్లోనే వుండిపోయిన వాణికి కనీసం అందులో హీరోయిన్ పాత్ర కూడా దక్కలేదు. హృతిక్‌తో ఒక పాటలో డాన్స్ చేసి, బికినీలో కనిపించి మురిపించిన వాణికి కేవలం పదిహేను నిమిషాల పాటు మాత్రం కనిపించే సీన్ ఇచ్చారు. గెస్ట్ రోల్ లాంటి ఈ పాత్ర కోసం ఆమె మూడేళ్ల పాటు అదే బ్యానర్‌కి అంటిపెట్టుకోవడం చూసి అంతా ఆశ్చర్యపోతున్నారు.
- Advertisement -
హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ నటించిన ఈ చిత్రంలో హీరోయిన్లకి చోటివ్వలేదు. టైగర్‌కి అయితే కనీసం ఒక హీరోయిన్‌తో డాన్స్ చేసే ఛాన్స్ కూడా ఇవ్వలేదు. హృతిక్‌కి ఒక సాంగ్ పెట్టినా కానీ అతనికీ వాణి జోడీ కాదు. పూర్తిగా మగాళ్లని మాత్రమే హైలైట్ చేస్తూ చేసిన ఈ చిత్రంలో చిన్న పాత్రలో కనిపించిన వాణి ఇందుకోసం మూడేళ్లు వేచి చూసి కెరియర్ వేస్ట్ చేసుకుంటుందా అని కూడా కామెంట్స్ పడుతున్నాయి. ఇప్పటికే ఆమె వయసులో ముప్పయ్ దాటిపోయింది. కాకపోతే ఇదే బ్యానర్లో రణ్‌భీర్ కపూర్ హీరోగా రూపొందుతోన్న సంషేరా చిత్రంలో వాణి ఒక్కతే హీరోయిన్. కనీసం అందులో అయినా నటిగా గుర్తింపు దక్కే పాత్రని ఇచ్చారో లేదో చూడాలి.