Publisher is the useful and powerful WordPress Newspaper , Magazine and Blog theme with great attention to details, incredible features...

‘వాల్మీకి’లో హీరో పేరేంటో తెలుసా..!?

‘వాల్మీకి’లో హీరో పేరేంటో తెలుసా..!?

మెగా హీరో వ‌రుణ్ తేజ్, పూజా హెగ్దే నటీనటులుగా హరీశ్ శంకర్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘వాల్మీకి’. ఇప్పటికే సినిమా షూటింగ్ దాదాపు పూర్తి చేసుకుంది. ఇక తదుపరి వర్క్ మాత్రమే మిగిలుంది. మొదట ఈ సినిమాను సెప్టెంబ‌ర్ 13న రిలీజ్‌కు సిద్ధం రంగం చేసుకున్నప్పటికీ ఆ తర్వాత మళ్లీ 20న విడుద‌ల చేయాల‌ని దర్శకనిర్మాతలు నిర్ణయించుకున్నారు. అయితే ఈ క్రమంలో సినిమాకు సంబంధించిన చాలా ఇంట్రెస్టింగ్ న్యూస్ వెలుగులోకి వస్తున్నాయి.తన కెరియర్‌ను మొదలుపెట్టిన దగ్గర నుంచి విభిన్నమైన కథలకు.. విలక్షణమైన పాత్రలకు ప్రాధాన్యతనిచ్చే వరుణ్ ‘వాల్మీకి’లో డిఫరెంట్ లుక్‌లో కనిపించనున్నాడు. వాల్మికీ సినిమా మెగాభిమానులు, సినీ ప్రియుల్లో ఎంతో ఆసక్తిని పెంచుతోంది. వరుణ్ పాత్ర ఎలా ఉండబోతోంది..? సినిమాలో వరుణ్ పేరేంటి..? సినిమా కథ ఎలా ఉండబోతోంది..? అని ఇలా పలు విషయాలపై క్లారిటీ కోసం మెగాభిమానులు వేయికళ్లతో వేచి చూస్తున్నారు.అయితే తాజాగా.. మెగాభిమానులకు వరుణ్ చిన్నపాటి శుభవార్తను అందజేశాడు వరుణ్. తన పాత్ర పేరు ‘గద్దలకొండ గణేశ్’ అనే విషయాన్ని వరుణ్ చెప్పుకొచ్చాడు. అంతటితో ఆగని ఆయన.. ఈ పాత్ర ప్రేక్షకులకు చాలా బాగా కనెక్టవుతుందని స్పష్టం చేశాడు. అయితే ఈ డిఫరెంట్ పాత్రతో సినీ ప్రియులను వరుణ్ ఏ మాత్రం మెప్పిస్తాడో తెలియాలంటే మరో పదిరోజులు వేచి చూడాల్సిందే మరి.

Leave A Reply

Your email address will not be published.