ఆచార్య.. మెగా అప్డేట్ వచ్చేసింది!
`ఆచార్య` టీజర్ కోసం ఎదురుచూస్తున్న మెగా అభిమానులకు గుడ్ న్యూస్. అభిమానులకు `ఆచార్య` టీమ్ తాజాగా అదిరిపోయే అప్డేట్ అందించింది. ఈ నెల 29 (శుక్రవారం) సాయంత్రం 4:05 గంటలకు టీజర్ విడుదల చేయబోతున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు ఓ ప్రత్యేక వీడియోను తయారు చేసి విడుదల చేసింది.
- Advertisement -
మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా స్టార్ డైరెక్టర్ కొరటాల శివ రూపొందిస్తున్న చిత్రం `ఆచార్య`. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఈ సినిమాలో చెర్రీ `సిద్ధ` పాత్రలో కనిపించనున్నాడు. కాజల్ అగర్వాల్ ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది. వేసవిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.