Publisher is the useful and powerful WordPress Newspaper , Magazine and Blog theme with great attention to details, incredible features...

జగన్‍ రెడ్డితో అమీ తుమీ తేల్చుకోనున్న మాగుంట..?

2019 ఎన్నికలకు ముందు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‍తో ఆయనను బెదిరించేటట్లు చేసి.. తెలుగుదేశం పార్టీని వీడి తన పార్టీలో చేర్చుకుని ఎన్నికలలో పోటీ చేసే అవకాశం ఇచ్చారు సిఎం జగన్‍ రెడ్డి. తన వ్యాపారాల కోసం, అంతకు ముందు రావాల్సిన వందల కోట్లు బకాయిల కోసం తలొగ్గారు. ఎక్కడ తెలంగాణలో తన వ్యాపారం దెబ్బ తింటుందో అన్న భయాందోళనతో వైసిపిలో చేరి విజయం సాధించారు.

ఈ రెండేళ్లలో తనకు ఇవ్వాల్సిన కనీస మర్యాద ఇవ్వటం లేదు. తనను మంత్రులు, ప్రజాప్రతినిధులు ఎవరూ ఎంపీగా గుర్తించటం లేదు. ప్రత్యక్షంగా, పరోక్షంగా అవమానానికి గురి చేస్తున్నారు. అయినా భరించాను.. రావాల్సిన కోట్లాది రూపాయల బకాయిలను అదిగో చెల్లిస్తాం.. ఇదిగో చెల్లిస్తాం అని అరచేతిలో స్వర్గం చూపిస్తున్నారు. ఇప్పట్లో బకాయిలు చెల్లించరని అనుభవంతో తెలిసి వచ్చింది.

- Advertisement -

వ్యాపార పరంగా నష్టపోయాను.. రాజకీయపరంగా అప్రతిష్ట పాలయ్యాను. ఎంతో గౌరవ, మర్యాదలు ఇచ్చిన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు అన్యాయం చేశాను. అందుకు మూల్యం చెల్లించుకుంటున్నానని.. ఆయన నమ్ముతున్నారు. ఇక అసలు విషయానికి వస్తే.. ఆయన పేరు మాగుంట శ్రీనివాసులు రెడ్డి. ఒంగోలు అధికార పార్టీ లోక్‍సభ సభ్యుడు . ఈ రెండేళ్లలో ఆయన ఎంపీ అనే విషయం మంత్రులు, ఎమ్మెల్యేలు మరిచిపోయారు.

ఎలాంటి కార్యక్రమాలకు, ప్రారంభోత్సవాలకు ఎంపీ మాగుంటను ఏ ఒక్కరూ పిలవటం లేదు. దీంతో కడుపు మండిన ఎంపీ మాగుంట తన కుమారుడిని ప్రత్యక్ష రాజకీయాల్లోకి దించారు. తన తరుపున కుమారుడిని అన్ని చోట్లకు ఎంపీ పంపుతున్నారు. ఇది మంత్రులకు, ప్రజాప్రతినిధులకు నచ్చటం లేదు. ఎంపీ రఘురామరాజు దారిలోనే మాగుంట నడవబోతున్నారని ప్రచారం జరిగింది.

ముందుగా తన రాజకీయ వారసుడిగా కుమారుడుని తెరపైకి తీసుకు వచ్చిన మాగుంట జగన్‍ రెడ్డితో అమీ తుమీ తేల్చుకోబోతున్నారు. ఇప్పటి వరకు వ్యాపార పరంగా ఎంతో నష్టపోయాను. ఇవ్వాల్సిన బకాయిలు చెల్లించటం లేదు. కొత్తగా వ్యాపారం కూడా ఇవ్వటం లేదు. టిడిపిని వీడి వైసిపిలో చేరి కోట్లాది రూపాయలను ఖర్చు పెట్టి విజయం సాధించినా.. చివరకు సాధించింది ఏమిటని.. మాగుంట భావిస్తున్నట్లు తెలిసింది.. అందుకే తన రాజకీయ వారసుడిగా తన కుమారుడిని రంగంలోకి దించారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాలలో జరుగుతున్న ప్రభుత్వ కార్యక్రమాలకు తన తరపున తన కుమారుడిని పంపుతున్నారని అధికార నేతలే అంటున్నారు. దీనిని బట్టి సిఎం జగన్‍ రెడ్డి, మంత్రులు, అధికార ప్రతినిధులతో అమీతుమీకి మాగుంట సిద్దమైనట్లు స్పష్టమవుతోంందంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

Leave A Reply

Your email address will not be published.