Publisher is the useful and powerful WordPress Newspaper , Magazine and Blog theme with great attention to details, incredible features...

జగన్‍ రెడ్డికి ఆనం షాకిస్తారా..? మౌనం వహిస్తారా..?

38 ఏళ్ల రాజకీయ అనుభవంతో పాటు ప్రజాప్రతినిధిగా మాజీ మంత్రిగా అనుభవం ఉన్న మాజీ మంత్రి ఆనం రామానారాయణ రెడ్డికి నెల్లూరు జిల్లాలో అడుగడుగునా అవమానాలు జరుగుతున్నాయి. తన ముందు పిలిచే అర్హతలేని ఎమ్మెల్యేలు మంత్రులయ్యారు. తన రాజకీయ అనుభవం ముందు పిల్లలైన వారికి సిఎం జగన్‍ రెడ్డి మంత్రి పదవులిచ్చారు. సీనియార్టీకి సరైన గౌరవం ఇవ్వటం లేదు. గుర్తించటం లేదు. పట్టించుకోవటం లేదు. ఇలాంటి పరిస్థితులు స్పష్టంగా ఎదురవుతున్న నేపధ్యంలో మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డ్డి రాజకీయంగా ఏ విధంగా ముందుకు వెళ్లబోతున్నారన్న విషయం బయట పడటం లేదు.

తిరుపతి లోక్‍సభ నియోజకవర్గ పరిదిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలలో ఒకటైన వెంకటగిరి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యే మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డిని ముఖ్యమంత్రి జగన్‍ రెడ్డితోపాటు నెల్లూరు జిల్లాకు చెందిన మంత్రులు పరోక్షంగా, ప్రత్యక్షంగా అవమానిస్తున్నప్పటికీ.. .. ఓపిక పట్టినంత కాలం పట్టారు. ఆ తరువాత ముఖ్యమంత్రి జగన్‍ రెడ్డి ఆనంను పిలిపించి ఏమి మాట్లాడారో కానీ కొంత కాలం మౌనం వహించారు.

- Advertisement -

స్థానిక సంస్థల ఎన్నికలలో టిడిపిని తిరిగి కోలుకోలేనంతగా దెబ్బ కొట్టిన ఆనంను జగన్‍ రెడ్డి గుర్తించకపోవటంతో సమయం కోసం ఎదురు చూసిన తిరుపతి లోక్‍సభ ఉప ఎన్నిక నియోజకవర్గానికి ఉప ఎన్నిక రావటంతో మౌనం వహించి ఇంటికే పరిమితం అవ్వాలా.. పరోక్షంగా అధికార పార్టీకి దెబ్బ కొట్టి టిడిపికి మద్దతివ్వాలా అనే విషయంపై మాజీ మంత్రి ఆనం కొట్టుమిట్టాడుతున్నారని విశ్వసనీయవర్గాల సమాచారం.

1983లోనే ఎమ్మెల్యేగా విజయం సాధించిన అనుభవం ఉన్న ఆనం రామానారాయణ రెడ్డి ముఖ్యమంత్రి జగన్‍ రెడ్డి పట్టించుకోకపోవటం.. నెల్లూరు జిల్లాకు చెందిన మంత్రులు ఆయన సీనియార్టీని గుర్తించకుండా పరోక్షంగా అవమానించిన సంఘటనలు కూడా జరిగాయి. కాంగ్రెస్‍ ప్రభుత్వ హయాంలో పదేళ్ల పాటు నెల్లూరు జిల్లాను శాసించిన ఆనం రామానారాయణ రెడ్డి సోదరుడు ఆనం వివేకానందరెడ్డి మరణించటంతో ఒంటరి అయ్యారు. తోడుగా ఏ ఒక్క ఎమ్మెల్యే వచ్చేందుకు ఇష్టపడటం లేదు.

జిల్లాను అధికారంగా శాసించి తాను ఎమ్మెల్యేగా వెంకటగిరికే పరిమితం కావటం.. ఆనంకు మింగుడు పడటం లేదు. తన సీనియార్టీని ముఖ్యమంత్రి జగన్‍ రెడ్డి గుర్తించటం లేదు. భవిష్యత్తులో మంత్రి పదవి ఇస్తారన్న నమ్మకం లేదు. పార్టీలో అడుగడుగునా అవమానాలే జరుగుతున్నాయి. ఇలాంటి పరిస్థితులు స్పష్టంగా ఎదురవుతున్న నేపధ్యంలో తిరుపతి లోక్‍సభ ఉప ఎన్నిక సందర్భంగా మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఏ నిర్ణయం తీసుకోబోతున్నారన్న విషయం బయట పడటం లేదని అధికార ప్రజాప్రతినిధులే తెర వెనుక చెబుతున్నారు.

Leave A Reply

Your email address will not be published.