Publisher is the useful and powerful WordPress Newspaper , Magazine and Blog theme with great attention to details, incredible features...

ముఖ్య అధికారి బాటలో మరో ఐఎఎస్‌ ..!

ఐఎఎస్‌ హోదాలో ‘రాజు’లా అధికారం చెలాయిస్తున్నారు ఆ అధికారి. ఆయన మాట్లాడితే.. ముత్యాలు రాలతాయంటారు కొందరు. ఆ అధికారి క్రింస్థాయి నుండి పైకి వచ్చారు. చాలా మంచివారు.. కానీ ఇటీవలె బందువుల ఒత్తిళ్లకు తలొగ్గుతున్నారని విమర్శలు వచ్చాయి. వాటిని ఎవరూ నమ్మకపోయినా..ఆ అధికారిపై సోషల్‌ మీడియాలో రకరకాలుగా ప్రచారం జరిగింది.

ఇక అసలు విషయానికి వస్తే..ముఖ్యమంత్రి కార్యాలయ ముఖ్య అధికారి ఒకరు చేసిన హడావిడి, సీనియర్‌ అధికారుల పెత్తనంతో పాటు అనేక ఇతర కారణాలు పనిచేయటంతో.. ముఖ్యమంత్రి జగన్‌ రెడ్డి ఆయనను దూరం పెట్టిన నేపధ్యంలో గతంలో ఆ అధికారి పోషించిన పాత్రను.. తాజాగా మరో సిఎంవో అధికారి పోషిస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది.

- Advertisement -

అప్పట్లో ఆ అధికారి ఏ విధంగా అధికారులను శాసించి పనులు చేయించేవారో.. అదే విధంగా ఈ సిఎంవో అధికారి కూడా ఆయనబాటలోనే నడుస్తూ.. అధికారులను ఇబ్బందులు పెడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అతిగా వ్యవహరించిన ఆ అధికారి అప్రతిష్టపాలయ్యారు. అధికార ఉద్యోగ వర్గాలలో ఆ అదికారిపై తీవ్ర వ్యతిరేకత పెరిగింది.. అని తెలిసి కూడా ఆ సిఎంవో అధికారి దారిలోనే వెళ్లాలనుకోవటంలో మర్మం ఏమిటి?..

కలెక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తూ.. ప్రజాభిమానాన్ని పొందిన సిఎంవో అధికారి ఎందుకు దూకుడుగా వెళ్లాలనుకుంటున్నారో కావటంలేదు. ఆ ముఖ్యమంత్రి కార్యాలయ అధికారికి తగిన శాస్తి జరిగిందని.. రేపో మాపో ముఖ్యమంత్రి కార్యాలయం నుండి తనను తప్పించటం ఖాయం అని అధికారులు అంటున్నారు.

తనను జగన్‌ రెడ్డి తప్పించక ముందు… ఆ అధికారి కేంద్ర సర్వీసుకు వెళుతున్నారని ప్రచారం జరిగింది. ఈ విషయాలన్నీ ఆయనకు తెలిసినా కూడా ఆ అధికారినే ఎందుకు ఆదర్శంగా తీసుకుంటున్నారో.. అర్దం కావటం లేదంటున్నారు అధికారులు. గతంలో నిదానమే ప్రదానంగా భావించే ఆ ఐఐఎస్‌ అధికారి.. తాజాగా ఎందుకు దూకుడుగా వ్యవహరిస్తున్నారో అర్ధం కావటం లేదంటున్నారు అధికారులు.

Leave A Reply

Your email address will not be published.