Publisher is the useful and powerful WordPress Newspaper , Magazine and Blog theme with great attention to details, incredible features...

ఇంటా, బయటా జగన్‍ రెడ్డిపై అసంతృప్తేనా..?

వైఎస్సార్‍ కాంగ్రెస్‍ ప్రభుత్వంలో మంత్రులు, అధికార ప్రజాప్రతినిధులు, అదికార ముఖ్యనేతల.. సూచనలు, సిఫార్సులకు ఎలాంటి విలువ లేదు. అంతా సిఎం జగన్‍ రెడ్డి ఏకపక్షంగా తీసుకుంటున్న నిర్ణయాలే అని అనుభవంతో తెలిసి వచ్చిన అమాత్యులు, అధికార ప్రజాప్రతినిధులకు రోజు రోజుకు అసంతృప్తి పెరిగిపోతుందట. ఎవరెవరు అసంతృప్తిగా ఉన్నా.. ఎవరెవరికి ఇష్టం ఉన్నా లేకున్నా.. సిఎం జగన్‍ రెడ్డి పట్టించుకోరు. ఎవరి సిఫార్సులు, సూచనలను గాలికి వదిలేస్తారు.

తాను నమ్మిన వారిని పిలిచి వారితో చర్చించి నిర్ణయం తీసుకుంటారని… ఇప్పటి వరకు తీసుకున్న నిర్ణయాలను బట్టి స్పష్టమవుతోందని.. అనేక సందర్బాలలో రాజకీయ విశ్లేషకులు అభ్యంతరం వ్యక్తం చేశారు. 2019లో సిఎం జగన్‍ రెడ్డి అధికారంలోకి రావటానికి అనేక పరిస్థితులు కలిసి వచ్చాయి. చంద్రబాబు చేసిన తప్పిదాలు, పొరపాట్లు ఎన్నికలలో టిడిపి నేతలు ప్రత్యర్దులకు పరోక్ష సహకారం చేసిన సందర్భాలుండటం వలనే ఎన్నికలలో విజయం సాధించారనే విషయం జగన్‍ రెడ్డి మరిచిపోయారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

అటు ఇసుక పాలసీ, ఇటు మద్యం పాలసీపై ప్రజలలో వ్యతిరేకత పెరిగినా.. ఎలాంటి నష్టం ఉండదు..ఆప్రభావం ఇప్పుడు కనిపించదు.. ముందు ముందు ఆప్రభావం పనిచేయటం ఖాయమంటున్నారు అధికార పార్టీ నేతలు. మద్య నిషేదం అమలు చేస్తామని.. ఎన్నికల మ్యానిఫెస్టోలో పొందు పరిచిన సిఎం జగన్‍ రెడ్డి చివరకు మద్యంవలన వచ్చే ఆదాయంపైనే ఎక్కువ ఆధారపడుతున్నట్లు స్పష్టం అవుతోందంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

- Advertisement -

అంతే కాకుండా రావాలి జగన్‍.. కావాలి జగన్‍.. అనే నినాదంతో తెర వెనుక ప్రభుత్వ ఉద్యోగులు, అవుట్‍ సోర్సింగ్‍ ఉద్యోగులు, తటస్థ ఓటర్లతో పాటు మెజార్టీ జర్నలిష్టులు తాజాగా వారికి ఎదురవుతున్న సంఘటనలతో ఆగ్రహావేశాలతో ఊగిపోతూ.. చేసేది ఏమీ లేక కక్కలేక మింగలేక సమయం కొరకు ఎదురు చూస్తూ.. తాజాగా మౌనం వహిస్తున్నారు.

జర్నలిష్టులంటే సాక్షి పత్రిక, సాక్షి టివి ఛానెల్‍, ఎన్టీవి, టివి 9, టివి 10 జర్నలిస్టులే అన్న చందంగా ఆయా సంస్థలలో పనిచేసే వారికే ఎక్కువ మందికి అక్రిడిటేషన్‍ కార్డులు ప్రభుత్వం మంజూరు చేసింది. చిన్న పత్రికలతో పాటు వార, పక్ష, మాస పత్రికలలో నిర్వాహకులకు కానీ.. అందులో పనిచేసే జర్నలిష్టులకు కానీ.. ఒక్క అక్రిడిటేషన్‍ కార్డు కూడా ప్రభుత్వం మంజూరు చేయలేదు.

పైన పేర్కొన్న సంస్థలలో పనిచేసేవారిలో మెజార్టీ జర్నలిష్టులు చంద్రబాబు దిగిపోవాలి.. జగన్‍ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని కోరుకున్న వారే. అటు ఉద్యోగస్తులు(అవుట్‍ సోర్సింగ్‍, కాంట్రాక్టు ఉద్యోగులతో కూడా) జీతాలు పెంచలేదు. పర్మినెంటు చేస్తామని హామీ ఇచ్చినా ఇంతవరకు ఆ హామీని అమలు చేయలేదు. దీనిని బట్టి సిఎం జగన్‍ రెడ్డి పనితీరు, వ్యవహారశైలి పైన పేర్కొన్న వర్గాలందరికీ నచ్చటం లేదు. ఎంతో మంది అసంతృప్తిగా ఉన్నారు. సమయం వచ్చినప్పుడు సత్తా చూపుతామని ఆ వర్గ నేతలు చెబుతున్నారంటే.. పరిస్థితి ఎంత దారుణంగా ఉందో స్పష్టం అవుతోందంటున్నారు అధికార నేతలు.

Leave A Reply

Your email address will not be published.