Publisher is the useful and powerful WordPress Newspaper , Magazine and Blog theme with great attention to details, incredible features...

చంద్రబాబును విభేదిస్తున్న అశోక్‍గజపతి..!

ఎంపీటీసి, జడ్పీటీసి ఎన్నికల బహిష్కరణకు చంద్రబాబు ఏ కారణాలతో పిలుపునిచ్చారో అనే విషయం పక్కన పెడితే.. ఆయన ఇచ్చిన పిలుపు అపార రాజకీయ, అధికార అనుభవం ఉన్న ఒక మాజీ మంత్రికి మింగుడు పడలేదట. ఆ కారణంతోనే పార్టీ పొలిట్‍ బ్యూరో సమావేశానికి హాజరు కాలేదట.

ఇందులో నిజం ఉందో లేదో కానీ.. సిఎం జగన్‍ రెడ్డికి బాకా ఊదే ఒక టివి ఛానెల్‍ కధనం ప్రచారం చేసింది. నిజంగా ఆ మాజీ మంత్రి అసంతృప్తిగా ఉన్నారా..? చంద్రబాబు ఎన్నికల బహిష్కరణ పిలుపుపై ఆ మాజీ మంత్రి ఎందుకు అయిష్టత వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఆయన సాధించింది.. ఏమిటి..? గతంలో తీవ్ర వ్యతిరేకత ఉన్న ఆ మాజీ మంత్రి ఇంకా తాను గొప్ప నాయకుడునని భావిస్తున్నారేమో..?

- Advertisement -

నిన్న కాక మొన్న జరిగిన మునిసిపల్‍ ఎన్నికలలో 50 డివిజన్లలో కేవలం ఒక డివిజన్లో విజయం సాధించగలిగారంటే..ఆ మాజీ మంత్రికి ఎంత ప్రజాభిమానం ఉందో స్పష్టం అవుతోంది. ఇక అసలు విషయానికి వస్తే.. ఆ మాజీ మంత్రి పేరు పూసపాటి అశోక్‍గజపతి రాజు. 40ఏళ్లు పైగా రాజకీయ అనుభవం ఉంది.

కానీ ఆయన క్రియాశీలక రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఓటర్ల మనస్తత్వం వేరు.. తాజా ఓటర్ల మనస్తత్వం వేరని ఇప్పటికీ.. ఆ మాజీ మంత్రి తె లుసుకోలేకపోతున్నారు. అప్పట్లో అభివృద్దికి ఓటు వేసిన ఓటర్లు.. తాజాగా ఓటుకు ఎర్ర నోటును బాహాటంగానే డిమాండ్‍ చేస్తున్న విషయం అశోక్‍గజపతి రాజుకు తెలిసినా.. చంద్రబాబు ఇచ్చిన ఎన్నికల బహిష్కరణ పిలుపు ఏ కారణాలతో అశోక్‍గజపతికి మింగుడుపడలేదో.

Leave A Reply

Your email address will not be published.