Publisher is the useful and powerful WordPress Newspaper , Magazine and Blog theme with great attention to details, incredible features...

ఎన్నికల నోటిఫికేషన్‍ ముందే గుంటూరు, చిత్తూరు కలెక్టర్ల బదిలీలు..!

పంచాయితీ ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల నోటిఫికేషన్‍ వెలువడ్డాక గుంటూరు జిల్లా కలెక్టర్‍ శామ్యూల్‍ ఆనంద్‍కుమార్‍, చిత్తూరు జిల్లా కలెక్టర్‍ భరత్‍ నారాయణ గుప్తాలను తప్పనిసరిగా బదిలీ చేయటం ఖాయం. గతంలోఆ ఇద్దరు కలెక్టర్లను బదిలీ చేయాలని ఎన్నికల కమీసనర్‍ నిమ్మగడ్డ ప్రభుత్వానికి సూచించటం జరిగింది. స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా పడిన నేపధ్యంలో శామ్యూల్‍ ఆనందకుమార్‍, భరత్‍ నారాయణ గుప్తాలను ప్రభుత్వం బదిలీ చేయలేదు. పంచాయితీ ఎన్నికలు ఫిబ్రవరిలో జరిగితే.. అంతుకు ముందే ఆ ఇద్దరి కలెక్టర్లను ప్రభుత్వం బదిలీ చేయాల్సి ఉంటుంది. పంచాయితీ ఎన్నికలను ఫిబ్రవరిలో జరపకుండా తాత్కాలికంగా నిలిపివేయాలని ప్రభుత్వం కోర్టును కోరినప్పటికీ.. అందుకు న్యాయస్థానం తిరస్కరించింది. ఈ నేపధ్యంలో పంచాయితీ ఎన్నికలు జరగటం ఖాయమనే పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

- Advertisement -

ఎన్నికల నోటిఫికేషన్‍ ఎప్పుడు జారీ చేసినా నాలుగు వారాలకు ముందే గుంటూరు, చిత్తూరు కలెక్టర్లు అయిన శామ్యూల్‍ ఆనందకుమార్‍, భరత్‍ నారాయణ గుప్తాలను బదిలీ చేయాల్సి ఉంటుంది. ఈ ఇద్దరి కలెక్టర్‍ బదిలీలు పంచాయితీ ఎన్నికలు జరిగితేనే… జరుగుతాయి. ఏ కారణంతోనైనా పంచాయితీ ఎన్నికలు నిలిచిపోతే ఆ ఇద్దరు కలెక్టర్లుగా యధావిధంగా కొనసాగుతారు. కానీ అటు నిమ్మగడ్డ రమేష్‍కుమార్‍ ఇటు కోర్టు వ్యాఖ్యలను బట్టి పంచాయితీ ఎన్నికలు ఫిబ్రవరిలో జరగటం ఖాయం. ఆ ఇద్దరి కలెక్టర్లను బదిలీ చేయటం అంత కన్నా ఖాయమన్న పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. గుంటూరు జిల్లా కలెక్టర్‍ శామ్యూల్‍ ఆనందకుమార్‍ మే మాసాంతానికి రిటైర్డు కాబోతున్నారు. ఫిబ్రవరిలో పంచాయితీ ఎన్నికలు జరగవని.. తాను గుంటూరు జిల్లా కలెక్టర్‍గానే రిటైర్డు అవుతానని శామ్యూల్‍ ఆనందకుమార్‍ అంటున్నారట. ఏది ఏమైనా న్యాయస్ధానం కూడా ఫిబ్రవరిలో పంచాయితీ ఎన్నికలు జరిపించాలని భావిస్తున్న కమీషనర్‍ నిమ్మగడ్డకు మద్దతిచ్చే అవకాశాలున్నాయి. ఒకవేళ హైకోర్టు అభిప్రాయానికి వ్యతిరేకంగా ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లినా.. ఎట్టి పరిస్థితుల్లో కోర్టుస్టే ఇవ్వదని.. న్యాయవాదులు అంటున్నారు

Leave A Reply

Your email address will not be published.