Publisher is the useful and powerful WordPress Newspaper , Magazine and Blog theme with great attention to details, incredible features...

నిమ్మగడ్డపై విమర్శలు గుప్పిస్తున్న బిజెపి..!

పంచాయితీ ఎన్నికలు పూర్తయ్యాయి.. మునిసిపల్‍ ఎన్నికలు జరగబోతున్నాయి. ఎంపీటీసీ, జడ్పీటీసి ఎన్నికలు కోర్టు నిర్ణయాన్ని బట్టి జరుపుతామంటున్నారు స్థానిక సంస్థల ఎన్నికల కమీషనర్‍ నిమ్మగడ్డ రమేష్‍కుమార్‍. దీనిని బట్టి మునిసిపల్‍ ఎన్నికలు మాత్రమే జరుగుతాయి. ఎంపీటీసి, జడ్పీటీసి ఎన్నికలు తన హయాంలో జరగవన్నట్లుగా నిమ్మగడ్డ పరోక్షంగా మీడియా సమావేశంలో తెలిపారు. మార్చి 31వ తేదీ వరకు పదవిలో ఉండే నిమ్మగడ్డ తన హయాంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలని భావించినప్పటికీ.. ఇటీవల జరిగిన పరిణామాలతో విపక్షాల నేతలు నిమ్మగడ్డ పనితీరుపై విమర్శలు చేశారు.

రమేష్‍ కుమార్‍ వ్యవహారశైలిని తప్పుబట్టారు. ముఖ్యంగా మునిసిపల్‍ ఎన్నికల షెడ్యూల్‍ ప్రకటించినప్పటి నుండి తెలుగుదేశం నేతలు అప్పుడప్పుడు రమేష్‍ కుమార్‍ను విమర్శించారే తప్ప బిజెపి నేతలు ఇప్పటికీ.. రమేష్‍ కుమార్‍ పనితీరును, వ్యవహారశైలిని తప్పుబడుతున్నారు. పలు చర్చా కార్యాక్రమాలలో పాల్గొంటున్న ఇతర రాజకీయ పార్టీల నేతల కన్నా బిజెపి నేతలు నిమ్మగడ్డ వ్యవహారశైలిని తప్పుబట్టడంలో ముందు ఉంటున్నారు.

పంచాయితీ ఎన్నికలు నిర్వహించే ముందు అన్ని పార్టీ నేతలతో సమావేశమై పంచాయితీ ఎన్నికల షెడ్యూల్‍ను ప్రకటించిన నిమ్మగడ్డ.. మునిసిపల్‍ ఎన్నికల రీ షెడ్యూల్‍ను నిర్వహించే ముందు రాజకీయ పార్టీలతో సమావేశం కాకుండా.. ఏకపక్షంగా నిమ్మగడ్డ నిర్ణయాలు తీసుకున్నారని.. బిజెపి నేతలు దుయ్యబడుతున్నారు.

- Advertisement -

ఎప్పుడో సంవత్సరం కిందట మునిసిపల్‍ ఎన్నికల షెడ్యూల్‍ జారీ అయింది. రీ షెడ్యూల్‍ పేరుతో అదే ఎన్నికల షెడ్యూల్‍ను రమేష్‍ కుమార్‍ జారీ చేశారని.. విజయవాడ నుండి జారీ చేయాల్సిన మునిసిపల్‍ ఎన్నికల రీ షెడ్యూల్‍ను తిరుపతిలో ఉన్నప్పుడు జారీ చేయటంలో మర్మం ఏమిటి..?

అంత హడావిడిగా తిరుపతి నుండి మునిసిపల్‍ ఎన్నికల రీ షెడ్యూల్‍ను ఎందుకు జారీ చేవారు. అప్పట్లో మునిసిపల్‍ ఎన్నికల నామినేషన్‍ సమయంలో జరిగిన హింసాకాండ, బెదిరింపులు, విపక్షాల కార్యకర్తలను నామినేషన్‍ వేయకుండా పోలీసులతో బెదిరించటం వంటి సంఘటనలు జరిగిన తీరు పలు టివి ఛానెల్స్ ప్రచారం చేసిన సంఘటలు కూడా నిమ్మగడ్డకు తెలుసు.

అలాంటి పరిస్థితులు స్పష్టంగా కనిపించిన నేపధ్యంలో కొత్తగా మునిసిపల్‍ ఎన్నికల రీ షెడ్యూల్‍ జారీ చేయకుండా.. కొత్తగా షెడ్యూల్‍ ను జారీ చేస్తే.. రాజకీయ పార్టీ నేతలు విమర్శలు, ఆరోపణలు చేసేవారు కాదు. స్వయంకృతాపరాధాలతో నిమ్మగడ్డ తీసుకున్న నిర్ణయాలు అప్పటి వరకు ఆయన సంపాదించుకున్న పేరు ప్రతిష్టలు మంట గలిశాయంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

మునిసిపల్‍ ఎన్నికల రీ షెడ్యూల్‍ జారీ చేయటం తన సొంత నిర్ణయమే తప్ప ఎలాంటి ఒత్తిళ్లు లేవని.. నిమ్మగడ్డ అధికారులకు తెలిపినట్లు ప్రచారం జరుగుతున్నా… ఎక్కడో ఏదో జరిగింది. పంచాయితీ ఎన్నికల షెడ్యూల్‍ జారీ చేసినప్పుడు కనిపించిన నిమ్మగడ్డ ధైర్య సాహసాలు మునిసిపల్‍ ఎన్నికల రీ షెడ్యూల్‍ జారీ చేసేటప్పుడు కనిపించటం లేదంటున్నారు విపక్షాల నేతలు, ముఖ్యంగా బిజెపి నేతలు.

Leave A Reply

Your email address will not be published.