సొంత తమ్ముడిని గెలిపించుకోలేకపోయిన బుగ్గన
ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితుడిగా పేరున్న ఆర్దిక మంత్రి బుగ్గనరాజేంద్రనాద్ రెడ్డి.. పంచాయితీ ఎన్నికలలో సొంత సోదరుడిని గెలిపించుకోలేకపోయారు. రాష్ట్రానికే ఆర్దిక మంత్రి అయిన బుగ్గన సొంత గ్రామంలో సర్పంచ్ పదవికి ఆయన సోదరుడిని గెలిపించుకోలేక పోయారంటే..ఆయన పై వ్యతిరేకత ఏ స్థాయిలో ఉందో స్పష్టమవుతోందంటున్నారు.
శాసనసభ సమావేశాల సమయంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై పదే పదే విమర్శలు, ఆరోపణలు చేస్తూ.. సిఎం జగన్ రెడ్డిని సంతృప్తి పరిచేందుకు ఆర్దిక మంత్రి బుగ్గన ప్రయత్నించారే తప్ప సొంత గ్రామంలో బలం పెంచుకునే విషయంలో దృష్టి సారించకుండా తేలికగా తీసుకుని అందుకు మూల్యం చెల్లించుకున్నారు. ఆర్దిక మంత్రి బుగ్గన సొంత సోదరుడినే గెలిపించుకో లేకపోయారు.
- Advertisement -
భవిష్యత్తులో జరిగే ఎన్నికలలో రాజేంద్రనాద్ రెడ్డి ఓడిపోయినా ఆశ్చర్యపడక్కర్లేందంటున్నారు స్థానిక అధికార పార్టీ నేతలు. రాష్ట్రఆర్దిక పరిస్థితి చిన్నా భిన్నంగా ఉన్నా.. ఏదో విధంగా నెట్టుకు వస్తున్న ఆర్దిక మంత్రి రాజేంద్రనాద్ రెడ్డి తన సోదరుడిని గెలిపించుకోవటంలో రాజకీయంగా నెట్టుకు రాలేకపోయారని.. సోదరుడి ఓటమిని బట్టి స్పష్టమవుతోంది.
రేపటి నుండి తన ముఖం అటు ముఖ్యమంత్రికి ఇటు సహచర మంత్రులకు ఆర్దిక మంత్రి బుగ్గన ఎలా చూపించగలుగుతారు. చంద్రబాబుపై విమర్శలు, ఆరోపణలు చేయటమే పనిగా పెట్టుకున్న బుగ్గనకు సొంత సోదరుడి ఓటమి మింగడు పడలేదు. కారణాలు ఏమైనప్పటికీ.. సొంత సోదరుడు పంచాయితీ సర్పంచ్‌గా ఓడిపోవటంతో ఆర్దిక మంత్రి బుగ్గన తలదించుకోవాల్సి వచ్చింది. మంత్రి వర్గ సమావేశంలో ఇదే విషయంపై ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఆర్దిక మంత్రిని ప్రశ్నిస్తే.. ఆయన ఏ విధంగా సమాధానం చెబుతారో..?