Publisher is the useful and powerful WordPress Newspaper , Magazine and Blog theme with great attention to details, incredible features...

సిబిఐ తడబడుతుందా..! ఇబ్బంది పడుతోందా..!!

దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్‌కు స్వయాన తమ్ముడు. తాజా ముఖ్యమంత్రి జగన్‌ రెడ్డికి చిన్నాన్న అయిన మాజీ మంత్రి దివంగత మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య చేసిన హంతకులను పట్టుకోవటంలో.. సిబిఐ అధికారులు ఇబ్బంది పడుతున్నారా..? అదే విధంగా సిఎం జగన్‌ రెడ్డి బెయిలురద్దు చేయాలని ఎంపీ రఘురామరాజు సిబిఐ కోర్టులో వేసిన కేసులో సిబిఐ అధికారులు ఇబ్బంది పడుతున్నట్లుగా జరిగిన సంఘటనలు స్పష్టం చేస్తున్నాయి.

సిబిఐ కోర్టులో జగన్‌ రెడ్డికి బెయిలు రద్దు కు సంబందించిన కేసులో పబ్లిక్‌ ప్రాసిక్యూటర్లు ఇద్దరు అనారోగ్యంతో గైర్హాజరయ్యారట. ఇద్దరూ ఒకే రోజు అనారోగ్యంగా రాకపోవటం వెనుక ఏదైనా మతలబు ఉందా..? ఇదే విషయాన్ని ఎంపీ రఘురాజు రెండు విధాలుగా వ్యాఖ్యానించారు.

- Advertisement -

మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో నాలుగు అడుగులు ముందుకు వెళుతున్న సిబిఐ అధికారులు నలబై అడుగులు వెనక్కి వేస్తున్నట్లుగా విమర్శలు వస్తున్నాయి. ఈ రెండు కేసులలో సిబిఐ అధికారులు ఎందుకు తడబడుతున్నారు..? ఎందుకు ఇబ్బంది పడుతున్నారు..? పై నుండి ఒత్తిళ్లు వస్తున్నాయా..? లేదా ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా.?? అని ప్రతిపక్షాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి.

సిబిఐ డైరెక్టరుగా కొత్త అధికారి బాధ్యతలు స్వీకరించినా.. ఈ రెండు కేసులలో ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్లుగా పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎక్కడోఏదో జరుగుతోంది. మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో హంతకులు ఎవరనేది ఇప్పటి వరకు సిబిఐ అధికారులు తెలుసుకోలేకపోవటం వెనుక పలు అనుమానాలు కలుగుతున్నాయంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

అదే విధంగా జగన్‌ రెడ్డి బెయిలు రద్దుకేసులో సిబిఐకోర్టుకు సోమవారం నాడు పబ్లిక్‌ ప్రాసిక్యూటర్లు అనారోగ్యంతో హాజరుకాకపోవటంపై కూడా పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయంటున్నారు. ఏది ఏమైనా ఈ రెండు కేసులలో సిబిఐ అధికారులు తడబడుతున్నారనేది వాస్తవం. ఇబ్బంది పడుతున్నారనేది అంతకన్నా వాస్తవం అన్నట్లుగా పరిస్థితులు కనిపిస్తున్నాయంటున్నారు ప్రతిపక్ష నాయకులు.

Leave A Reply

Your email address will not be published.