Publisher is the useful and powerful WordPress Newspaper , Magazine and Blog theme with great attention to details, incredible features...

ధర్మారెడ్డికి కేంద్రం షాక్‍ ఇచ్చిందా..?

టిటిడి అదనపు ఈవో ఏవి.ధర్మారెడ్డి సర్వీసును వెంటనే ఉపసంహరించుకుంటూ.. ఆయనను బాధ్యతల నుండి తప్పించి కేంద్రానికి పంపించాలని.. రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం నుండి తాఖీదు వచ్చిందని.. విశ్వసనీయ వర్గాల సమాచారం.

ధర్మారెడ్డి సర్వీసును కేంద్రం వెనక్కి తీసుకుంటుందని.. నిన్నటి వరకు జరిగిన ప్రచారం నిజమైందంటున్నారు అధికారులు. ధర్మారెడ్డి డిప్యూటేషన్‍ సర్వీసును ఉపసంహరించుకున్నాం.. ఆయన్ను వెంటనే కేంద్రానికి పంపండి అని ప్రభుత్వానికి లిఖిత పూర్వకంగా తాఖీదు అందినట్లు ప్రచారం జరుగుతోంది. టిటిడి అదనపు ఈవోగా ప్రశాంతంగా బాధ్యతలు నిర్వహించకుండా.. లేని పోని విషయాల్లో తలదూర్చి ఎన్నో ఏళ్ల నుండి సంపాదించుకున్న కీర్తి, ప్రతిష్టలను స్వయంకృతాపరాధాలతో తాను కూర్చున్న కొమ్మను తానే నరుక్కున్నట్లుగా.. ఆయన బలి కాబోతున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం

- Advertisement -

.టిటిడి ఈవో పోస్టు కోసం ఆశపడ్డ ధర్మారెడ్డి ఆయన తీసుకున్న గోతిలో ఆయనే పడ్డారని అధికారులు అంటున్నారు. కులాభిమానంతో, పోస్టుల కొరకో ఆశపడితే పరిస్థితి ఇలానే ఉంటుందని.. అనుభవంతో కానీ ధర్మారెడ్డికి ముందు ముందు తెలిసి వస్తుందని.. రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ధర్మారెడ్డి సర్వీసులను వెంటనే ఉపసంహరించుకుంటూ.. కేంద్రం పంపిన తాఖీదుకు ముఖ్యమంత్రి జగన్‍ రెడ్డి వెంటనే స్పందించకుంటే.. అది ఆయనకే నష్టం అంటున్నారు అదికారులు.

ఇంతకీ ధర్మారెడ్డి సర్వీసును ఉపసంహరించుకున్నట్లు రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం తెలియజేసిన విషయం నిజమైతే పైన పేర్కొన్న పరిస్థితి నిజమవటం ఖాయం అంటున్నారు.

Leave A Reply

Your email address will not be published.