Publisher is the useful and powerful WordPress Newspaper , Magazine and Blog theme with great attention to details, incredible features...

పెట్రోల్‍ రేట్ల పెంపుపై.. నిర్మలా సీతారామన్‍ నాడు అలా.. నేడు ఇలా..!

మంత్రి పదవి లేనప్పుడు ఒక విధంగా.. మంత్రి పదవి ఉన్నప్పుడు మరో విధంగా కేంద్ర ఆర్దిక మంత్రి నిర్మలా సీతారామన్‍ చేసిన వ్యాఖ్యలు సోషల్‍ మీడియాలో సంచలనం సృష్టిస్తుంది. నిర్మలా సీతారామన్‍కు మిగతా మంత్రుల కన్నా ఒక విధమైన గుర్తింపు ఉంది. ఇటీవల కాలంలో ఆ ప్రత్యేక గుర్తింపును ఆమె స్వయంగా చేసిన ప్రకటనతో పోగొట్టుకున్నారు.

ప్రధాన మంత్రి మోడీకి అత్యంత నమ్మకస్తురాలిగా పేరున్న నిర్మల ఆంధ్ర రాష్ట్రానికి అదనంగా చేసింది ఏమీ లేదని.. ఆమె పేరుకే తెలుగింటి కోడలు.. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్‍షాల ఆదేశాలనే నిర్మలా సీతారామన్‍ పాటిస్తుంటారని బిజెపి నేతలే అంటుంటారు. ఇదంతా గతం. తాజాగా.. పెట్రో ధరల పెంపుపై కేంద్రం తప్పులేదని.. ఆయిల్‍ కంపెనీలే బాధ్యత వహించాలని.. నిర్మలా సీతారామన్‍ ప్రకటించారు.

- Advertisement -

కానీ 2013లో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అప్పటి యుపిఏ ప్రభుత్వం పెంచిన పెట్రో ధరలపై బిజెపి మహిళా నేతగా ఆమె ఏ విధమైన వ్యాఖ్యలు చేశారంటే.. పెట్రోల్‍ ధరల పెంపుకు కేంద్రమే బాధ్యత వహించాలన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆ విధంగా.. అధికార పక్షంలో ఉన్న ప్పుడు ఈ విధంగా నిర్మలా సీతారామన్‍ ప్రకటించి ఆమెకున్న గుర్తింపును చేజేతులారా పోగొట్టుకున్నారని.. రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. కేంద్ర ఆర్దిక మంత్రిగా అటు పుట్టిన తమిళనాడు రాష్ట్రానికి అదనంగా నిధులిచ్చారు.

ఇటు మెట్టినింటి రాష్ట్రమైన ఏపీకి రిక్త హస్తం చూపించారు. కేంద్ర ఆర్దిక మంత్రిగా ఆమె ప్రధాని మోడీ ఆదేశాలను మాత్రమే పాటించారని.. ఏపికి ఏదో చేయాలని నిర్మలా తపన పడుతున్నా.. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అనుమతి లేనిదే.. ఆమె ఒక్క రూపాయి కూడా నిధులు కేటాయించే పరిస్థితిలో లేరని ఇటీవల పార్లమెంటులో ప్రవేశ పెట్టిన కేంద్ర బడ్జెట్‍తో స్పష్టమయింది.

Leave A Reply

Your email address will not be published.