Publisher is the useful and powerful WordPress Newspaper , Magazine and Blog theme with great attention to details, incredible features...

బాబు ఓటమికి… కేజ్రీవాల్‌ గెలుపుకు…

కుల, మత అనుకూల ప్రభావాలు… కుల వ్యతిరేక ప్రభావాలతో చంద్రబాబు నాయుడు అధికారం కోల్పోగా.. ఢిల్లీలో ఆ ప్రభావాలు పని చేయలేదు. కుల, మతాలకు అతీతంగా అభివృద్ది, సంక్షేమ పథకాల అమలుపై మధ్యతరగతి ప్రజలు కేజ్రీవాల్‌కు మద్దతిచ్చి మళ్లీ ముఖ్యమంత్రిని చేశారు. రాష్ట్ర విభజన జరిగాక ఆంధ్రప్రదేశ్‌లో సంక్షేమ పథకాలు అమలు అయ్యాయి. ఎంతో అభివృద్ది జరిగింది. ఎంతో కొంత రుణమాఫీ జరిగింది.. అన్న క్యాంటీన్ల ద్వారా బడుగు, బహీన వర్గాల ప్రజలు తృప్తిగా కాలం గడిపారు. అయినప్పటికీ వీటన్నింటినీ పక్కన పెట్టి అప్పట్లో జగన్‌ అండ్‌ కో ఆధ్వర్యంలో జరిగిన కుల వ్యతిరేక ప్రచారాన్ని నమ్మారు. కుల, మత ప్రభావాలు కూడా జగన్‌కు అనుకూలంగా పని చేశాయి.

చంద్రబాబు ఓటు బ్యాంకులో చీలిక రావటంతో జగన్‌ అఖండ మెజార్టీతో అధికారంలోకి వచ్చారన్న విషయం అందరికీ తెలుసు. కానీ ఢిల్లీలో మతాన్ని రెచ్చగొట్టినా.. ఓటర్లు అభివృద్దికే ఓటు వేశారు. సంక్షేమ పథకా అముకు మద్దతు పలికారు. అంతే కాకుండాఢిల్లీలో కుల వ్యతిరేక ప్రభావం పని చేయకపోవటానికి కారణం.. అక్కడ ఒకే కులానికి చెందిన ఓటర్లు లక్షల సంఖ్యలో లేరు. కేజ్రీవాల్‌కు కాలం కలిసి వచ్చింది.. హ్యాట్రిక్‌సాధించారు. మధ్య తరగతి ప్రజల అభిమానాన్ని చూరగొని అధికార పీఠాన్ని మళ్లీ కైవసం చేసుకున్నారు. చంద్రబాబు అమలు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ది కార్యక్రమాలు ,బడుగు, బలహీన మధ్యతరగతి ప్రజలకు అందినప్పటికీ ఎమ్మెల్యేలు, వారి అనుచరులు, గ్రామ స్థాయి నాయకుల అవినీతిని ప్రత్యక్షంగా చూసి అసూయ ద్వేషాలతో నాడు చంద్రబాబుకు వ్యతిరేకంగా ఓటు వేసి ప్రస్తుతం పశ్చాత్తాప పడుతున్నారట.

- Advertisement -

సామాన్య ప్రజలను ఇబ్బంది పెట్టకుండా.. మేము ఏదో వ్యాపారాల ద్వారా, కాంట్రాక్టుల ద్వారా సొమ్ము సంపాదించుకున్నాము.. దానికి కూడా ప్రజలు అసూయ పడితే.. ఎలా.. అని ఓడిన నాయకులు తమను కలిసిన వారితో చెప్పిన విషయం బాగా ప్రచారం అయింది. చంద్రబాబు కన్నా కేజ్రీవాల్‌ సమర్దుడైన నేత కాదు.. చంద్రబాబు అమలు చేసిన సంక్షేమ పధకాలలు, అభివృద్ది కేజ్రీవాల్‌ చేయనప్పటికీ అక్కడ కుల, మత ప్రభావాలు పనిచేయకపోవటమే.. కేజ్రీవాల్‌కు కలిసి వచ్చింది. మన దేశంలో ఆంధ్రప్రదేశ్‌ ఓటర్లు స్వార్ధపరులు, అవకాశవాదులు, నోటుకు ఓటు అమ్ముకుంటారు.. చంద్రబాబు లాంటి అపార రాజకీయ అనుభవం ఉన్న నేతను ఓడించారు అని ఇంతకు ముందే మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ ఒక ఇంటర్యూలో చెప్పటం జరిగింది. ఆయన చేసిన విమర్శలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి.

అప్పట్లో చంద్రబాబును మెజార్టీ ప్రజలు ఓడించి తప్పు చేశారన్నారు. ఆయన స్ఫూర్తితో నేను సంక్షేమ పథకాలు అమలు చేశాను. అభివృద్ది కార్యక్రమాలను నిర్వహించాను అన్నారు. ఏది ఏమైనా కుల, మత వ్యతిరేక, అనుకూల పవనాల ప్రభావం పని చేస్తే చంద్రబాబుకు ఎదురైన పరిస్థితులు ఎదురవుతాయి. అలాంటి ప్రభావాలు పని చేయలేదంటే.. ఢిల్లీలో ఏ కుల,మత మెజార్టీ ఓటర్లు లేరని స్పష్టమవుతోంది. చంద్రబాబును కుల, మతాలు కాటు వేశాయి. కుల వ్యతిరేకత ప్రచారం కొంప ముంచి అధికారం కోల్పోయేటట్లు చేసింది. కేజ్రీవాల్‌కు అలాంటి ప్రభావాలు పని చేయకపోవటంతో.. ఎన్నికలలో హ్యాట్రిక్‌ సాధించారు.

Leave A Reply

Your email address will not be published.