Publisher is the useful and powerful WordPress Newspaper , Magazine and Blog theme with great attention to details, incredible features...

నాడు మోడీని వద్దనుకున్న చంద్రబాబుకు.. నేడు ముద్దయ్యారా..?

రాష్ట్ర విభజన హామీలను అమలు పరచలేదు. రాష్ట్రానికి ప్రత్యేక హోదాను తిరుమల వెంకన్న సాక్షిగా కొనసాగిస్తామని చెప్పిన నరేంద్ర మోడీ సంవత్సరాలు గడిచినా ఆ ఊసే ఎత్తలేదు. ప్రత్యేక హోదా ఇవ్వలేం.. ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని ఆశ చూపి చంద్రబాబును ఒప్పించిన నరేంద్రమోడీ అండ్‍ కో చివరకు ఆ ప్యాకేజీని కూడా అమలు చేయలేదు. దీంతో ఆగ్రహం చెందిన చంద్రబాబు రాష్ట్రానికి అన్యాయం చేసిన మోడీపై బాహాటంగా యుద్దం ప్రకటించారు.

రాహుల్‍ గాంధీతో కలిసి మోడీతో పోరాటానికి దిగారు. అనేక ప్రాంతాలలో నిరసన దీక్షలు చేశారు. చివరకు ఢిల్లీలో కూడా నిరసన దీక్ష చేసినా మోడీ దిగిరాలేదు. తనపై చంద్రబాబు రాజకీయ యుద్దం చేస్తారా.. అని భావించిన నరేంద్ర మోడీ గత ఎన్నికలలో జగన్‍ రెడ్డికి పరోక్షంగా సహకరించి.. ఆర్దిక లబ్ది కూడా చేకూర్చి చంద్రబాబు ఓటమికి నరేంద్ర మోడీ అండ్‍ కో కృషి చేసిన విషయం అటు చంద్రబాబుతో పాటు మిగతా రాజకీయ పార్టీల నేతలందరీకి తెలుసు. చంద్రబాబుకు దురదృష్టం ఎదురయింది.

ఎన్నికలలో ఘోర పరాభవం చంద్రబాబు చవి చూశారు. ఎక్కడ తనను మోడీ ఇబ్బంది పెడతారో అన్న అనుమానంతో రాష్ట్రానికి ఇంత అన్యాయం జరుగుతున్నా చంద్రబాబు ప్రశ్నించలేకపోయారు.. నిలదీయలేకపోయారు. ఇదంతా గతం. జాతీయ స్థాయిలో నరేంద్రమోడీ ప్రతిష్ట క్రమక్రమంగా మసకబారుతుంది. తీవ్ర వ్యతిరేకత మోడీపై వ్యక్తం అవుతోందని.. అందరికీ తెలుసు.

- Advertisement -

చంద్రబాబుకు కూడా తెలుసు. అయినా మహానాడు సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి సందర్భాన్ని బట్టి మద్దతివ్వాలని యనమల తీర్మానం చేయటం.. ఆ ఆమోదాన్ని ఏకగ్రీవంగా చంద్రబాబుతో సహా తీర్మానించటం జరిగింది. ఒకవైపు క్రమ క్రమంగా మోడీ పలుకుబడి మసకబారుతుంటే.. ఏం ఆశించి కేంద్రానికి మద్దతివ్వాలో అంతు బట్టడం లేదంటున్నారు సిపిఐ రామకృష్ణ.

రాష్ట్ర అభివృద్ది ఇంత ఘోరంగా ఉండటానికి నరేంద్ర మోడీ ఎంత కారణమో.. జగన్‍ కూడా అంతే కారణమని మెజార్టీ ప్రజలు (గతంలో వీరిలో చాలా మంది జగన్‍ పార్టీకి ఓటు వేసిన వారే) నరేంద్ర మోడీని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కేసుల నుండి తప్పించుకునేందుకు సిఎం జగన్‍రెడ్డి నరేంద్ర మోడీకి మద్దతివ్వచ్చు. కానీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నరేంద్ర మోడికి మద్దతివ్వాలనుకోవటంలో మర్మం ఏమిటి..? ఒకవేళ బిజెపితో పొత్తు పెట్టుకుని మళ్లీ ఎన్నికలలో పోటీ చేస్తే.. మెజార్టీ ప్రజలు చంద్రబాబును కూడా తిరస్కరించే అవకాశాలున్నాయి.

అలాంటి పరిస్థితులు స్పష్టంగా బయట పడుతున్న నేపధ్యంలో చంద్రబాబు కేంద్ర ప్రభుత్వానికి అంచెలంచెలుగా ఎందుకు మద్దతివ్వాలని కోరకుంటున్నారు. సిఎం జగన్‍ రెడ్డి వేదింపులకు, సాదింపులకు తట్టుకోలేక మా నేత చంద్రబాబు ఆ నిర్ణయం తీసుకుని ఉంటారని.. టిడిపి నేతలు తెర వెనుక అభిప్రాయపడుతున్నారు. జగన్‍ రెడ్డి ముఖ్యమంత్రి అయి రెండేళ్లు గడిచింది.

గత ఎని్న కలలో జగన్‍ పార్టీకి ఓటు వేసిన కొన్ని సామాజికవర్గాలతో పాటు తటస్థ ఓటర్లు తాజాగా జగన్‍ రెడ్డిని వ్యతిరేకిస్తున్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీపై ప్రజలు తీవ్ర ఆగహ్రావేశాలు వ్యక్తం చేస్తున్నట్లు చంద్రబాబుకు కూడా తెలుసు. మోడికి మద్దతిస్తే.. జగన్‍ రెడ్డి వేదింపులు, సాదింపులకు పాల్పడరనే ఆలోచనతోనే చంద్రబాబు ఆ నిర్ణయం తీసుకుని ఉంటారని టిడిపి మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు తెర వెనుక అంటున్నారు.

Leave A Reply

Your email address will not be published.