Publisher is the useful and powerful WordPress Newspaper , Magazine and Blog theme with great attention to details, incredible features...

క్యాడర్‌ నిర్ణయం మేరకే నియోజకవర్గాల ఇంఛార్జి నియామకాలు అంటున్న చంద్రన్న..!

నియోజకవర్గ ఇంఛార్జిలను నియమించేటప్పుడు నియోజకవర్గ స్థాయి నాయకులు, కార్యకర్తలు, స్థానిక సంస్థల మాజీ ప్రతినిధులు సూచనలతోనే నిర్ణయం తీసుకోవాల్సి ఉన్నప్పటికీ.. ఇంతకు ముందు ఆ విధానాన్ని చంద్రబాబు పాటించకుండా… అందుకు మూల్యం చెల్లించుకున్నారు.

చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా తాజాగా కొత్త విధానాన్ని ఆయన తెరపైకి తీసుకువచ్చారు. ఒక నియోకవర్గ ఇంఛార్జిని నియమించాలంటే.. రాష్ట్ర స్థాయిలో పరిశీలకుని పంపి.. మెజార్టీ స్థానిక నేతలు ,కార్యకర్తల అభిప్రాయానికి అనుకూలంగానే నిర్ణయం తీసుకోవాలని చంబ్రాబు భావించారు.

- Advertisement -

తాజాగా పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గ ఇంచార్జిగా స్థానిక నేతలు, కార్యకర్తల సూచనల మేరమే నిర్ణయం తీసుకోవాలని ఒక పరిశీలకుని ప్రత్యేకంగా అక్కడికి పంపబోతున్నారు చంద్రబాబు. పార్టీలో నాయకులు, కార్యకర్తలు మాటలకు విలువ ఉంటుంది. మెజార్టీ నాయకులు, కార్యకర్తలు, నాయకుల సూచనల మేంకే నిర్ణయం తీసుకుంటానని.. చంద్రబాబు వ్యవహరించబోతున్న తీరు ముందు ముందు కొంతమంది నాయకులకు షాక్‌ తగిలే అవకాశాలున్నాయి.

ఏ నాయకుడైతే నియోజకవర్గ ఇంఛార్జి పదవిని ఆశిస్తారో.. ఆ నాయకుడు స్థానిక నేతలు, కార్యకర్తల మద్దతు ఉంటేనే ఆ పదవి దక్కుతుందనే సంకేతికాలను చంద్రబాబు పంపబోతున్నారు. గతంలో జరిగిన పొరపాట్లు, తప్పిదాలు పునరావృతం కాకుండా.. కిందిస్థాయి మెజార్టీ సభ్యుల అభిప్రాయంతోనే నిర్ణయం తీసుకుంటాను అని చంద్రబాబు పంపిన సంకేతికాలు మెజార్టీ నాయకులు, కార్యకర్తలు సంతోషం వ్యక్తంచేస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.