Publisher is the useful and powerful WordPress Newspaper , Magazine and Blog theme with great attention to details, incredible features...

జగన్‍ పార్టీ అభ్యర్ధిని మార్చబోతున్నారా..?

టిడిపి అభ్యర్ధి వెనక్కి తగ్గబోతున్నారా..?

తిరుపతి లోక్‍సభ ఉప ఎన్నిక పార్టీ అభ్యర్ధిగా మాజీ మంత్రి పనబాక లక్ష్మీని ఎప్పుడో చంద్రబాబు ప్రకటించిన నేపధ్యంలో ఆమె కొన్ని రోజులు బయటకు రాలేదు. మరి కొన్ని రోజులు మొక్కుబడిగా కనిపించారు. ఆ తరువాత కొంత హడావిడి చేసినా.. తాజాగా ఎన్నికల బరి నుండి తప్పుకోవాలనుకుంటున్నారని.. ఎన్నికలలో పోటీ చేసేందుకు ఆసక్తి కనపర్చటంలేదని.. ప్రచారం జరుగుతున్న నేపధ్యంలో ఒకవేళ పనబాక లక్ష్మీ ఎన్నికల బరి నుండి తప్పుకోవాలనుకుంటే మరో అభ్యర్ధిని ఎంపిక చేస్తారని టిడిపి నేతలు అంటున్నారు. అధికార పార్టీ అభ్యర్ధిగా డాక్టర్‍ గురుమూర్తి పేరును పరోక్షంగా పార్టీ నాయకులకు, మంత్రులకు సిఎం జగన్‍ రెడ్డి చెప్పినట్లుగా బయటకు పొక్కింది. బాహాటంగా అభ్యర్ధి పేరును పార్టీ నేతలు ఎవరూ ప్రకటించకపోయినా.. గురుమూర్తే మా అభ్యర్ధి అని అధికార ఎమ్మెల్యేలు అంటున్నారు.

ఆ తరువాత ఏం జరిగిందో ఏమో కానీ ఆయనను తప్పించి మరొకరిని ఎన్నికల బరిలోకి దించే అవకాశాలున్నాయని.. అధికార పార్టీ నేతలు అంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. తెలుగుదేశం పార్టీ అభ్యర్ధిఏమో ఎన్నికలలో పోటీ చేసేందుకు భయపడుతున్నారని ప్రచారం జరుగుతోంది. ఓడిపోయే సీటు కదా.. ఎందుకు పోటీ చేయాలని పనబాక లక్ష్మీ వెనక్కి తగ్గే అవకాశాలున్నాయని.. ఆమె సన్నిహితుల ద్వారా బయటకు పొక్కింది. జనసేన అభ్యర్ధి తిరుపతి ఉప ఎన్నిక బరిలో ఉంటారని.. జనసేనాదిపతి పవన్‍ కళ్యాణ్‍ పార్టీ నేతలకు చెబుతున్నారు. బిజెపి అభ్యర్ధినే రంగంలోకి దించాలనుకుంటున్నామని.. సోము వీర్రాజు కూడా బాహాటంగా ప్రకటించినా.. తాజాగా జనసేన అభ్యర్ధే రంగంలో ఉండే అవకాశాలున్నాయి..ఆ పార్టీ అభ్యర్ధికే మద్దతిస్తాం అని సోము వీర్రాజు తనను కలుస్తున్న బిజెపి నేతలతో అంటున్నట్లు తెలిసింది.

- Advertisement -

అధికార పార్టీ అభ్యర్ధి ఎంపికలో గందరగోళం. టిడిపి అభ్యర్ధి ఎంపికలో గందరగోళం లేనప్పటికీ..ఆ పార్టీ అభ్యర్ధి పనబాక లక్ష్మీ ఎన్నికల బరి నుండి తప్పుకోవాలనుకుంటున్నారు. ఓడిపోతానన్న అనుమానాలు పనబాకలో కనిపిస్తున్నాయంటున్నారు స్థానిక టిడిపి నేతలు. 2019 ఎన్నికలలో 2 లక్షల 25వేల ఓట్ల మెజార్టీతో జగన్‍ పార్టీ అభ్యర్ధి విజయం సాధించగా.. రెండో స్థానంలో టిడిపి అభ్యర్ధి, 3, 4 స్థానాల్లో బిజెపి, జనసేన అభ్యర్ధులకు ఓట్లు వచ్చినప్పటికీ.. ఆరెండు పార్టీ అభ్యర్ధులకు డిపాజిట్లు కూడా దక్కలేదు. జనసేన అభ్యర్ధి రంగంలో ఉంటే చంద్రబాబు ఆ పార్టీ అభ్యర్ధికి బాహాటంగా మద్దతిస్తే.. పరిస్థితి ఒక విధంగా ఉంటుందని.. అదే విధంగా టిడిపి అభ్యర్ధి రంగంలో ఉంటే జనసేనాదిపతి పవన్‍ కళ్యాణ్‍ టిడిపి అభ్యర్ధికి మద్దతిస్తే.. పరిస్థితి మరోలా ఉంటుందంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

పనబాక లక్ష్మీ తప్పకుండా ఎన్నికలలో పోటీ చేస్తారు. ఆమె పోటీ నుండి తప్పుకోవాలనుకుంటున్నారని.. పధకం ప్రకారం అధికార నేతలే దుష్ప్రచారం చేస్తున్నారంటున్నారు టిడిపి నేతలు. చిత్తూరు జిల్లాకు చెందిన గురుమూర్తిని తప్పించి నెల్లూరు జిల్లాకు చెందిన వారిని అధికార పార్టీ అభ్యర్ధిగా ఎంపిక చేయాలని నెల్లూరు జిల్లాకు చెందిన మంత్రులు,అధికార పార్టీ ప్రతినిధులు ఒత్తిడి తెస్తున్నట్లుగా ఆ పార్టీ నేతలే అంటున్నారు. ఇంతకీ ఎవరెవరు ఏ పార్టీ అభ్యర్ధిగా రంగంలో ఉంటారు. వెల్లడించిన పేర్లలో మార్పులు, చేర్పులు ఉంటాయా..? జనసేన అభ్యర్ధికి చంద్రబాబు మద్దతిచ్చేందుకు అంగీకరించవచ్చు.

కానీ టిడిపి అభ్యర్ధికి జనసేన అధినేత పవన్‍ కళ్యాణ్‍ మద్దతిచ్చి కేంద్ర బిజెపి నేతలతో వైరం పెట్టుకోగలరా.? బిజెపితో ఉన్న పొత్తును తెగ తెంపులు చేసుకోగలరా..? చంద్రబాబును తీవ్రంగా వ్యతిరేకిస్తున్న మోడీ, అమిత్‍షాలను పవన్‍ దూరం చేసుకుంటారా.?సోము వీర్రాజు చంద్రబాబుకు బద్ద వ్యతిరేకి అయినా.. పవన్‍ ఆయనను ఖాతరు చేయరు. చంద్రబాబు, పవన్‍ కళ్యాణ్‍ కలిసి పోటీ చేస్తే.. అభ్యర్ధి తప్పకుండా విజయం సాధిస్తారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఒకవేళ తిరుపతిలో త్రిముఖ పోటీ జరిగితే.. ప్రధమ స్థానంలో అధికార పార్టీ, రెండో స్థానంలో టిడిపి ఉంటుందని.. జనసేన లేదా బిజెపి అభ్యర్ధి రంగంలో ఉంటే కనీసం డిపాజిట్‍ అయినా దక్కుతుందా అన్న అనుమానాన్ని రాజకీయ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు.

2019 ఎన్నికలలో జగన్‍ పార్టీ అభ్యర్ధికి వచ్చిన మెజార్టీ మళ్లీ ఆ పార్టీ అభ్యర్ధికి లభించే అవకాశాలు లేవని.. ఒకవేళ జగన్‍ రెడ్డి ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అయినా.. అమరావతి రాజధాని విశాఖ తరలింపుపై వ్యతిరేకత ఓటర్లలో వ్యక్తం అయితే..ఆ పార్టీ అభ్యర్ధి ఘోరంగా ఓడిపోయి టిడిపి అభ్యర్ధి విజయం సాధించే అవకాశాలుంటాయి. ఇంతకీ తిరుపతి లోక్‍సభ పరిదిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల ఓటర్ల ప్రభావం ఏ విధంగా పనిచేస్తుందో వేచి చూడాల్సిందే

Leave A Reply

Your email address will not be published.