Publisher is the useful and powerful WordPress Newspaper , Magazine and Blog theme with great attention to details, incredible features...

జగన్‍ రెడ్డికి జైకొట్టిన చీరాల టిడిపి నాయకులు

రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో జరగని చిత్ర విచిత్ర సంఘటనలు, ఆదిపత్యపోరులు ప్రకాశం జిల్లా చీరాల నియోజకవర్గంలో జరుగుతున్నాయి. ఈ నియోజకవర్గ టిడిపి ఇంఛార్జిగా బాధ్యతలు నిర్వహించిన వారందరూ అధికార పార్టీలో చేరిపోయారు. ప్రస్తుత ఇంఛార్జి కూడా అధికార పార్టీలో చేరబోతున్నారని ప్రచారం జరుగుతోంది.

అందుకు కారణం ఏమిటంటే.. గతంలో ఆ ఇంఛార్జి జగన్‍ పార్టీలో ఉండటమే కారణం. తాజాగా చీరాల నియోజకవర్గంలో అధికార పార్టీలో ఉన్న ముఖ్య నేతలందరూ గతంలో తెలుగుదేశం పార్టీలో ఉండేవారు. ఎన్నికలలో పోటీ చేసే అవకాశం ఇవ్వలేదని ఒకరు.. అధికారం కోసం మరో ఇద్దరు.. చంద్రబాబు అన్యాయం చేశారనే కోపంతో మరో మాజీ మంత్రి.. ఈ విధంగా చీరాల నియోజకవర్గంలో అధికార పార్టీలో కనిపిస్తున్న ప్రముఖులంతా… ఒకప్పుడు తెలుగుదేశంలో ఉండేవారు.

- Advertisement -

పూర్తి వివరాల్లోకి వెళితే.. తెలుగుదేశం పార్టీ అభ్యర్ధిగా ఎన్నికలలో ఓడిపోయి ఎమ్మెల్సీగా ఎన్నికయిన పోతుల సునీత 2019 ఎన్నికలలో టిడిపి అభ్యర్ధిగా విజయం సాధించిన కరణం బలరాం, 2014లో ఇండిపెండెంట్‍గా విజయం సాదించి తెలుగుదేశం పార్టీలో చేరిన ఆమంచి కృష్ణమోహన్‍ 2019 ఎన్నికలకు ముందు జగన్‍ పార్టీలో చేరి ఆ పార్టీ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. 1994, 99లలో టిడిపి ఎమ్మెల్యేగా విజయం సాదించిన మాజీ మంత్రి పాలేటి రామారావు కూడా అధికార పార్టీలో చేరిపోయారు.

దీనిని బట్టి రాజకీయ, అధికార లబ్ది కోసం మాజీ మంత్రి పాలేటి రామారావు మినహా కరణం బలరాం, ఆమంచి కృష్ణమోహన్‍, పోతుల సునీతలు అధికార పార్టీలో చేరిపోయారు. చీరాల నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలపై సిఎం జగన్‍ రెడ్డి అసహనం వ్యక్తం చేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.

మరో విశేషం ఏమిటంటే.. టిడిపి ఎమ్మెల్యే కరణం బలరాం అధికార పార్టీలో చేరాక.. 2014 ఎన్నికలలో ఇండిపెండెంట్‍గా పోటీ చేసిన ఆమంచి కృష్ణమోహన్‍పై ఓడిపోయిన.. జగన్‍ పార్టీ అభ్యర్ధి..  టిడిపిలో చేరటంతో ఆయనను చీరాల నియోజకవర్గ ఇంఛార్జిగా చంద్రబాబు నియమించారు. తాజాగా ఆయన కూడా అధికార పార్టీలో చేరేందుకు ముఖ్యనేతలతో మంతనాలు జరుపుతున్నారని ప్రచారం జరుగుతోంది

Leave A Reply

Your email address will not be published.