Publisher is the useful and powerful WordPress Newspaper , Magazine and Blog theme with great attention to details, incredible features...

సిఎం జగన్‍ రెడ్డి ఆదాయం లక్ష కోట్లా..?

మాజీ మంత్రి జేసీ.దివాకర్‍ రెడ్డి ఎవరెవరిపై విమర్శలు చేసినా.. అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినా.. వ్యగ్యంగా మాట్లాడినా.. ఏదో ఒక సంచలనం సృష్టిస్తుంది.ఆయన ముఖ్యమంత్రి జగన్‍ రెడ్డిపై విమర్శలు, ఆరోపణలు చేస్తూనే ఉంటారు.ఇటు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై కూడా ఏదో విధంగా వ్యగ్యంగా మాట్లాడిన సంఘటనలు ఉన్నాయి.

దీనిని బట్టి జేసీ.దివాకర్‍ రెడ్డి ఎవరినీ వదలరని.. తన హాస్యపు మాటలతో ఇటు స్వపక్షీయులను,అటు విపక్షీయులను ఏకి పారేస్తుంటారు.. జేసీ.దివాకర్‍ రెడ్డి. మా వాడు అంటే.. జగన్‍ రెడ్డి సిఎం అయితే.. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై కన్నా… మా కుటుంబ సభ్యులపైనే ఎక్కువ కక్ష తీర్చుకుంటారని.. 2019 ఎన్నికలకు ముందే జేసీ.దివాకర్‍ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. ఆ తరువాత జేసీ అన్నట్లే చంద్రబాబును ఇబ్బంది పెట్టాలని ప్రయత్నించినా అది ఫలించలేదు.

జేసీ.కుటుంబసభ్యులను రాజకీయంగా ఇబ్బందులు పెట్టారు. వ్యాపార పరంగా ఆర్దిక దెబ్బ కొట్టడమే కాకుండా.. మాజీ ఎమ్మెల్యే జేసీ.ప్రభాకర్‍ రెడ్డిని జైలుకు కూడా పంపారు. గతంలో జేసీ.దివాకర్‍ రెడ్డి చెప్పినట్లే సిఎం జగన్‍ రెడ్డి పాలన సాగిస్తున్నారని జరిగిన సంఘటనలను బట్టి స్పష్టమవుతోంది. తాజాగా సిఎం జగన్‍ రెడ్డిపై మాజీ మంత్రి జేసీ.దివాకర్‍ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

- Advertisement -

ముఖ్యమంత్రి జగన్‍ రెడ్డి రోజు వారీ ఆదాయం 300కోట్లు అని.. జేసీ వ్యాఖ్యానించటం సంచలనం రేపింది. రోజుకు 300 కోట్లు అంటే నెలకు 9000కోట్లు, సంవత్సరానికి ఒక లక్షా 8 కోట్లని స్పష్టం అవుతోంది. జేసీ ఆ విధమైన ఆరోపణలు ఏ ఆధారాలతో చేశారనే విషయం బయట పడనప్పటికీ.. ఆయనే ఏ విధంగా బయట పడ్డారంటే.. రోజుకు 300 కోట్లు సంపాదన ఎంత వరకు నిజమో తెలియదు.. కానీ ప్రజలలో ప్రచారం జరుగుతుందని వ్యాఖ్యానించటం విశేషం.

పంచాయితీ ఎని్న కలలో డబ్బుతోనే అధికార పార్టీ సానుభూతిపరులు విజయం సాధించారని జేసీ అన్నారు.అంతే కాకుండా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గాన్ని బ్రహ్మాండంగా అమలు చేశారు. అక్కడ అధికార పార్టీ సానుభూతిపరులైన సర్పంచ్‍లు ఖర్చు పెట్టిన సొమ్మును.. టిడిపి సానుభూతిపరులు ఖర్చుపెట్టలేకపోయారు.

అంతే కాకుండా స్థానిక పోలీసులు కూడా టిడిపి సానుభూతిపరులను భయభ్రాంతులకు గురి చేశారు.. అభివృద్ది చూసి మాకు ఓటు వేశారని.. ముఖ్యమంత్రితో పాటు మంత్రులు, అధికార ప్రజా ప్రతినిధులు అంటున్నారు. అదంతా అబద్దం.. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఎలాంటి వారో… తాజా ముఖ్యమంత్రి జగన్‍ ఎలాంటి వారో ప్రజలందరికీ తెలుసునన్నారు మాజీ మంత్రి జేసీ.దివాకర్‍ రెడ్డి.

Leave A Reply

Your email address will not be published.