Publisher is the useful and powerful WordPress Newspaper , Magazine and Blog theme with great attention to details, incredible features...

అధికార ఎమ్మెల్యేను సిఎం జగన్‍ హెచ్చరించారా..?

అనంతపురం జిల్లాకు చెందిన అధికార ఎమ్మెల్యే నిత్యం ప్రజల్లోనే కనిపిస్తుంటారు. ప్రజాసమస్యలను తెలుసుకుని అక్కడికక్కడే పరిష్కరిస్తారు. ఆ అధికార ఎమ్మెల్యే పలు ప్రాంతాలలో పర్యటించేటప్పుడు స్థానిక అధికారులందరూ హాజరు కావాల్సిందే. కుండ బద్దలు కొట్టినట్లు ఆ అధికార ఎమ్మెల్యే మాట్లాడతారని పేరుంది.

సోషల్‍ మీడియాలో కూడా ఆ అధికార ఎమ్మెల్యే పనితీరు నిత్యం ప్రచారం అవుతూనే ఉంది. ఎవరైనా అవినీతికి పాల్పడినా.. ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులకు అందకుండా అడ్డుపడినా.. ఆ అధికార ఎమ్మెల్యే స్థానిక అధికారులను, ఉద్యోగులను అక్కడిక్కడే నిలదీస్తారు. మొదటి సారి చెబుతారు. రెండో సారి హెచ్చరిస్తారు.. మూడో సారి అలాంటి సంఘటనలు ఎదురైతే అటు అధికారులకు, ఉద్యోగులకు క్లాస్‍ తీసుకుంటారు.

ఇంత వరకు బాగానే ఉంది. ఆ అధికార ఎమ్మెల్యే నిత్యం ప్రజల్లో కనిపించే మాట యదార్ధమే అని ఆయననియోజకవర్గ పరిదిలో పనిచేస్తున్న అధికారులు, ఉద్యోగులు ఆ ఎమ్మెల్యే అంటే హడలి పోతున్నారని స్థానిక ప్రజలు చెబుతుంటారు. అలాంటి లక్షణాలు కలిగిన ఆ అధికార ఎమ్మెల్యే ఏ కారణాలతోనో జిల్లాకలెక్టర్‍ గంధం చంద్రుడు పనితీరుపై విమర్శలు, ఆరోపణలు చేసి సంచలనం రేపారు.

- Advertisement -

కారణాలు ఏమైనప్పటికీ.. అధికార ఎమ్మెల్యే హోదాలో అలాంటి విమర్శలు, ఆరోపణలు చేయకూడదు.. నిందలు కూడా వేయకూడదు. ఎందుకో ఆ ఎమ్మెల్యే తొందర పడి ఉంటారని స్థానిక అధికారులు అంటున్నారు. ఈ విషయం ముఖ్యమంత్రి జగన్‍ దృష్టికి ఎవరు తీసుకెళ్లారో కానీ ఆయన ఆ అధికార ఎమ్మెల్యేను సున్నితంగా మందలించినట్లు తెలిసింది. ముఖ్యమంత్రి మా ఎమ్మెల్యేను మందలించలేదు.. హెచ్చరించలేదు.. ఇది ఒక పధఖం ప్రకారం కావాలని కధనాలు ప్రచారం చేశారని.. ఎమ్మెల్యే సన్నిహితులు అంటున్నారు.

ఇంతకీ ఆ ఎమ్మెల్యే ఎవరంటే అనంతపురం జిల్లా ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డ్డి. వైఎస్‍ కుటుంబానికి ఆ ఎమ్మెల్యే తండ్రి దివంగత ఎమ్మెల్యే సూరిడు అత్యంత సన్నిహితుడు. కేతిరెడ్డి కుటుంబానికి వైఎస్‍ కుటుంబ సభ్యులు ఎంతో ఆదరాభినాలు చూపుతారని అధికారులందరికీ తెలుసు.

ఇలాంటి కుటుంబం నుండి రాజకీయాల్లోకి వచ్చిన ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి తొందరపడ్డారా.. కలెక్టర్‍ గంధం చంద్రుడు ఆయన్ను పరోక్షంగా అవమానించారా వాస్తవాలు ఏమి జరిగింది. ఎందుకు ఎమ్మెల్యే బాహాటంగా విమర్శలు, ఆరోపణలు చేశారు అనే విషయంపై ముఖ్యమంత్రి జగన్‍ రెడ్డి రహస్యంగా నివేదిక తెప్పించుకోబోతున్నట్లు తెలిసింది.

Leave A Reply

Your email address will not be published.