Publisher is the useful and powerful WordPress Newspaper , Magazine and Blog theme with great attention to details, incredible features...

ఐఎఎస్‍ అధికారులకు జైలు శిక్ష విధించిన హైకోర్టు

న్యాయస్థానం ఇచ్చిన తీర్పును అమలు చేయకపోతే దాని ఫలితం ఎలా ఉంటుందో అనుభవంతో కానీ అధికారులకు తెలిసిరావటం లేదు. తప్పు ఎవరిదైనా శిక్ష అనుభవించేది అధికారులే. న్యాయస్థానం ఇచ్చిన తీర్పులను అమలు చేయకుంటే.. ముఖ్యమంత్రి, మంత్రులకు ఏమీ కాదు. న్యాయస్థానానికి జవాబు దారీ ఐఎఎస్‍ అధికారులే. మేము నిజాయితీగా, పారదర్శకంగా వ్యవహరించాం.

మంత్రులు, ముఖ్యమంత్రి ఆమోదించకపోవటం వలన న్యాయస్థానం తీర్పును అమలు చేయలేకపోయాం అని ఐఎఎస్‍ అదికారులు మొత్తుకున్నా.. న్యాయస్థానం క్షమించదు..ఏదో ఒక శిక్ష వేస్తుందన్న విషయం ఇంతకు ముందు ఐఎఎస్‍ అధికారులకు అనుభవంతో కానీ తెలిసిరాలేదు.

తాజాగా ఒక ఐఎఎస్‍ అధికారి, ఒక ఐఎఫ్‍ఎస్‍ అధికారికి న్యాయస్థానం వారం రోజులు జైలు శిక్ష విధించింది. 36 మంది ఉద్యోగులను రెగ్యులరైజ్‍ చేయాలని ఏప్రిల్‍ మాసంలో న్యాయస్థానం ఇచ్చిన తీర్పును అమలు చేయకపోవంతో న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. వారం రాజులు జైలు శిక్ష విధించారు.

- Advertisement -

తీర్పును అమలు చేయాలని పలు దఫాలు న్యాయమూర్తులు హెచ్చరించిన్పటికీ.. వారు బేఖాతరు చేయటంతో వారికి వారం రోజులు జైలు శిక్ష విధించారు. సీనియర్‍ ఐఎఎస్‍ అధికారి గిరిజాశంకర్‍ (పంచాయితీరాజ్‍ మరియు గ్రామీణాభివృద్ది శాఖ కమీషనర్‍) మరో ఐఎఫ్‍ఎస్‍ అధికారి చిరంజీవి చౌదరికి న్యాయస్థాణం జైలు శిక్ష విధించింది.

ఆ ఇద్దరు అధికారులు కూడా విచారణకు హాజరయ్యారు. న్యాయమూర్తి వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. తీర్పులను పెడ చెవినపెట్టినందుకు జైలు విక్ష విధిస్తామన్నారు. దీనిని బట్టి న్యాయస్థానం తీర్పును దిక్కరించినా, అమలు చేయకపోయినా.. న్యాయమూర్తుల ఆగ్రహానికి గురి కావాల్సి ఉంటుందని.. ఐఎఎస్‍ అధికారి గిరిజాశంకర్‍కు, ఐఎఫ్‍ఎస్‍ అధికారి చిరంజీవి చౌదరికి అనుభంతో కానీ తెలిసిరాలేదు.

తప్పు జరిగిందని.. క్షమించాలని ఆ అధికారులు న్యాయమూర్తికి విన్నవించుకోవటంతో వారిద్దరికి విధించిన శిక్షను న్యాయస్థానం నిలిపివేసింది.

Leave A Reply

Your email address will not be published.