Publisher is the useful and powerful WordPress Newspaper , Magazine and Blog theme with great attention to details, incredible features...

ఐఎఎస్‍ పూనం మెడకు చుట్టుకోబోతున్న కోట్ల రూపాయల కుంభకోణం..!

చంద్రబాబు హయాంలో ప్రభుత్వ ఆసుపత్రిలు, ప్రభుత్వ వైద్యకళాశాలలో వైద్య పరికరాల కొనుగోళ్లు కాంట్రాక్టులో అప్పటి వైద్య ఆరోగ్యశాఖాదిపతి తాజాగా వ్యవసాయ మరియు పశుసంవర్దక శాఖాదిపతిగా బాధ్యతలు నిర్వహిస్తున్న సీనియర్‍ మహిళా ఐఎఎస్‍ అదికారి పూనం మాలకొండయ్య భారీ ఎత్తున అవినీతికి పాల్పడ్డారని.. దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు ముఖ్యమంత్రి జగన్‍ రెడ్డికి లేఖ రాయటం సంచలనం సృష్టించింది.

సుమారు 200 కోట్లురూపాయలు అప్పట్లో చేతులు మారాయని.. సోమువీర్రాజు తన లేఖలో ఆరోపణ చేస్తూ.. సిఐడి విచారణ జరిపించాలని వీర్రాజు డిమాండ్‍ చేశారు. ఇప్పటికే పూనం మాలకొండయ్య మరొక కేసులో దోషిగా ఉన్నారు. విజిలెన్స్ ఏసిబి విచారణలో పూనం మాలకొండయ్య తీసుకున్న నిర్ణయాల వలన కోట్లాది రూపాయల ప్రభుత్వ సొమ్ము అన్యక్రాంతం అయిందని బయటపడింది.

అందుకు సంబందించిన నివేదికను కూడా ఆధారాలతో అధికారులు ప్రభుత్వానికి అందజేసినట్లు తెలిసింది. ప్రభుత్వ ఆసుపత్రులు, వైద్య కళాశాలలలో వైద్య పరికరాల కొనుగోలుకు కార్పోరేషన్‍ టెండర్లను అప్పట్లో పిలవటం జరిదింది. ఒక సంస్థకు టెండరు ఖరారు చేయటంలో భారీ ఎత్తున అవినీతి జరిగిందని.. అప్పట్లో ఒక వ్యక్తి ఆధారాలతో ఫిర్యాదు చేశారు.

- Advertisement -

టెండర్లు దక్కించుకున్న సంస్థ వైద్య పరికరాల విలువలను మార్కెట్‍ ధరల కంటే ఎన్నో రెట్లు పెంచి మోసానికి పాల్పడినా.. అప్పటి వైద్య ఆరోగ్య శాఖాదిపతి పూనం పట్టించుకోకపోవటం వెనుక కోట్లాది రూపాయలు ముడుపుల రూపంలో ఆయనకు అందాయని.. అప్పట్లో ఒక వ్యక్తి చేసిన ఫిర్యాదుపై విచారణ జరిపించాలని.. సోము వీర్రాజు ముఖ్యమంత్రి జగన్‍ రెడ్డికి లేఖ రాశారు. ఇంతకు ముందే సిఐడి పోలీసులు రంగంలోకి దిగారు. విచారణ జరిపి కేసు కూడా నమోదు చేశారు..

రాష్ట్రంలోని కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రాలు, పలు జిల్లాల ఆసుపత్రిలు, బోధన ఆసుపత్రులలో అవసరమైన మౌలిక వసతులు, పరికరాలు ఏర్పాటు చేయటానికి పిలిచిన టెండర్లలో గోల్‍మాల్‍ జరిగిందని.. అప్పట్లో కూడా మీడియా కధనాలు ప్రచురించింది. అంతే కాకుండా వెంటిలేటర్లు, గ్లూకోమీటర్లు, ఎమ్మారై, సిటీ స్కాన్‍ మిషన్లు భారీ ఎత్తున కొనుగోలు చేశారు. ఆ కొనుగోళ్లలో అసలు ధరల కంటే ఎక్కువ ధరలతో బిల్లులు సృష్టించి కోట్లాది రూపాయల ప్రభుత్వ ధనం దుర్వినియోగం అయిందని బయట పడింది.

చంద్రబాబు హయాంలో జరిగిన ఆ కుంభకోణంపై జగన్‍ రెడ్డి ప్రభుత్వం విచారణ జరిపిస్తున్నప్పటికీ.. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఆ కుంభకోణంపై విచారణ జరిపించాలని సిఎం జగన్‍ రెడ్డికి లేఖ రాయటం వెనుక మర్మం ఏమిటి..? దీని వెనుక సూత్రదారులు, పాత్రదారులు ఎవరెవరు ఉన్నారన్న విషయం త్వరలో బయట పడటం ఖాయం. కానీ సీనియర్‍ మహిళా ఐఎఎస్‍ అధికారి పూనం మాలకొండయ్యను టార్గెట్‍గా పెట్టుకున్న కాంట్ట్రార్లు వెనుకుండి నడిపిస్తున్నారని.. వారు పూనం మాలకొండయ్యపై విచారణ జరిపించే విధంగా సిఎం జగన్‍ రెడ్డికి లేఖ రాయించి ఉంటారని.. ఈ విషయంలో సోముపై కూడా పలు అనుమానాలు ఉన్నాయంటున్నారు కొందరు అధికారులు.

ఇతర శాఖలలో వందల కోట్లు అవినీతి జరుగుతున్నా పట్టించుకోని సోము వీర్రాజు అప్పట్లో పూనం మాలకొండయ్య నిర్వహించిన శాఖలో మాత్రమే అవినీతి జరిగిందని.. లేఖ రాయటంలో.. మర్మం ఏమిటి..? వీర్రాజును ఎవరైనా తప్పుదోవ పట్టించారా.. లేదా ఆయన్ను ఎవరైనా సంతృప్తి పరిచారా అనే విషయం త్వరలో బయట పెడతామంటున్నారు కొందరు అధికారులు.

Leave A Reply

Your email address will not be published.