Publisher is the useful and powerful WordPress Newspaper , Magazine and Blog theme with great attention to details, incredible features...

నమ్మిన ఎమ్మెల్యేను జగన్‍ రెడ్డి నట్టేట ముంచారా..?

ప్రతిపక్షంలో అమలు కానీ హామీలను అమలు చేస్తామని.. ప్రజలకు హామీలు ఇచ్చి అరచేతిలో వైకుంఠం చూపించటం సర్వ సాధారణం అయింది. అధికారంలోకి వచ్చాక ఇచ్చిన హామీలను మరిచి ముఖం చాటేస్తున్న అధికార ప్రతినిధులకు ముందు ముందు వ్యతిరేక పరిస్థితులు ఎదురవటం ఖాయం అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

అనుకున్నది ఒకటి.. అయింది ఒకటి.. బోల్తా పడ్డావులే బుల్‍ బుల్‍ పిట్ట అని ఒక పాత సినిమాలోని గీతం ఇప్పటికి గుర్తు ఉంటుంది. అదే పరిస్థితి అధికార పార్టీ ఎమ్మెల్యే ఒకరికి ఎదరయింది.
ఆనాడు ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఏమీ చేయలేకపోయాను.. మేము అధికారంలోకి వస్తే.. ప్రజలను ఇబ్బంది పెడుతున్న సంఘటనలకు తెర దించుతానని.. ప్రగల్భాలు పలికిన ఆ అధికార ఎమ్మెల్యే తాజాగా ముఖ్యమంత్రి నిర్ణయంతో ఏమీ చేయలేక.. కక్కలేక.. మింగలేక ముఖం చాటేస్తున్నారట.

ప్రతిపక్ష నేతగా ఒక విధంగా.. అధికారంలోకి వచ్చాక అందుకు విరుద్దంగా ముఖ్యమంత్రి జగన్‍ రెడ్డి నిర్ణయాలు తీసుకోవటంతో.. అధికార పార్టీ ఎమ్మెల్యేకు ముందు నుయ్యి.. వెనుక గొయ్యిలా పరిస్థితి ఏర్పడిందంటున్నారు అధికార నేతలు, కార్యకర్తలు. ఎన్నికల ప్రచారంలో తాను పలానా పని చేస్తాను.. పలనా ఫ్యాక్టరీని మూయిస్తాను. పలానా ఫ్యాక్టరీ నుండి వస్తున్న కాలుష్యానికి తెర దింపుతానని పదే పదే చెప్పి ఎన్నికలలో ఎమ్మెల్యేగా విజయం సాదించారు.

- Advertisement -

అధికారం దక్కకపోవటంతో మౌనం వహించిన ఆ ఎమ్మెల్యే 2019లో విజయం సాదించాక.. పార్టీ కూడా అధికారంలోకి రావటంతో తన కోరిక నెరవేరుతుందని సంబర పడ్డారట.పూర్తి వివరాలోకి వెళితే.. తూర్పుగోదావరి జిల్లా తుని నియోజకవర్గ అధికార పార్టీ ఎమ్మెల్యే దాడిశెట్టి రాజాకు తాజాగా ఎదురయిన పరిస్థితి అసలుకే ఎసరు పెట్టబోతుంది. ఇక అసలు విషయానికి వస్తే.. తుని నియోజకవర్గంలో ఇబ్బందిగా మారిన దివీస్‍ లేబరేటరీని ఏర్పాటు చేసినందుకు నిరసనగా.. ఎమ్మెల్యే దాడిశెట్టి ప్రజలతో కలిసి పోరాటం చేశారు. ఎట్టి పరిస్థితుల్లో దివీస్‍ను అనుమతించవద్దని పట్టుబట్టారు. దీంతో రాజాను రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిపించారు.

ఇదే విషయాన్ని ప్రతిపక్ష నేత హోదాలో జగన్‍ కూడా దివీస్‍ కంపెనీ ఏర్పాటుకు వ్యతిరేకించారు. తాను అధికారంలోకి వచ్చాక.. ఎట్టి పరిస్థితుల్లో దివీస్‍కు అనుమతించే ప్రసక్తే లేదన్నారు. . అటు ఎమ్మెల్యే మాట.. ఇటు జగన్‍ రెడ్డ్డి మాట నమ్మిన ప్రజలు అఖండ మెజార్టీతో రాజాను గెలిపించారు. జగన్‍ ముఖ్యమంత్రి అయ్యాక.. దివీస్‍ ప్రాజెక్టుకు పచ్చ జెండా ఊపటమే కాకుండా.. ఆయనే స్వయంగా శంఖుస్తాపనకు హాజరయ్యారు.

దీంతో దాడిశెట్టిపై ప్రజలలో త్వీవ్ర వ్యతిరేకత వ్యక్తం అయింది. అయ్యా.. ఎమ్మెల్యేగారు ఆనాడు మీరు ఆ విధంగా హామీ ఇచ్చారు. ప్రతిపక్ష నేత జగన్‍ కూడా హామీ ఇచ్చారు.. మిమ్ములను నమ్మి ఎన్నికలలో గెలిపించాం.. కానీ మీ హామీలు నిలబెట్టుకోకుండా.. దివీస్‍ ఏర్పాటుకు జగన్‍ రెడ్డి ఎలా వస్తారు అని రాజాను ప్రజలు నిలదీయగా.. అటు ముఖ్యమంత్రిని తప్పుపట్టలేరు.. ఇటు ప్రజలకు ఏమి చెప్పాలో ఎమ్మెల్యేకు తెలియటం లేదంటున్నారు అధికార పార్టీ స్థానిక నేతలు

Leave A Reply

Your email address will not be published.