Publisher is the useful and powerful WordPress Newspaper , Magazine and Blog theme with great attention to details, incredible features...

రఘురాంకృష్ణం రాజు ఢిల్లీ వెళ్లారా.. కేంద్ర పెద్దలు రప్పించారా..!

సికింద్రాబాద్‍ ఆర్మీ ఆసుపత్రి నుండి ఎంపీ రఘురాంకృష్ణంరాజు డిశ్చార్జి అయి మెరుగైన వైద్యం కోసం ఢిల్లీ వెళ్లారని.. ప్రచారం జరుగుతోంది. ఎంపీ ఆర్‍ఆర్‍ఆర్‍ను కేంద్ర పెద్దలే ఢిల్లీ రప్పించారని కూడా ప్రచారం జరుగుతోంది. ఇంతకీ ఆర్‍ఆర్‍ఆర్‍ మెరుగైన వైద్యం కోసం ఢిల్లీ వెళ్లారా.. ఆయనకు మెరుగైన వైద్యం చేయించేందుకు కేంద్ర పెద్దలు ఢిల్లీ రప్పించారా అనే విషయంపై అసలు విషయం బయట పడటం లేదు.

- Advertisement -

ఈ విషయంలో ఎంపీ కానీ.. ఆయన కుటుంబ సభ్యులు కానీ.. ఇతర ముఖ్యలు కానీ ఏ విషయాన్ని బయట పెట్టడం లేదని తెలుస్తోంది. ఢిల్లీలో ఎయిమ్స్లో ఎంపీ రఘురాంను చేర్పించి.. ఆయనకు మెరుగైన వైద్యం చేయించి ఆయన త్వరగా కోలుకునేలా చేయాలని కేంద్ర పెద్దలు భావించారని.. అందుకే ఆర్‍ఆర్‍ఆర్‍ను ఢిల్లీ రప్పించారని.. తెర వెనుక కొంతమంది ఆర్‍ఆర్‍ఆర్‍ సన్నిహితులు అంటున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో సికింద్రాబాద్‍ ఆర్మీ ఆసుపత్రిలో రఘురాంకు వైద్యం జరిగింది.

న్యాయస్థానం కూడా బెయిలు మంజూరు చేసింది. బుదధవారం నాడు ఆర్‍ఆర్‍ఆర్‍ డిశ్చార్జి అయి ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్లినట్లు విశ్వసనీయ వర్గ్గాల సమాచారం. తండ్రి తరపున సుప్రీంకోర్టులో కేసు దాఖలు చేసిన తనయుడు భరత్‍ కూడా ఆర్‍ఆర్‍ఆర్‍ ఢిల్లీ వెళ్లే విషయంపై బయట పడటం లేదు. ఎవరికీ అందుబాటులోకి రావటం లేదట. ఇంతకీ ఆర్‍ఆర్‍ఆర్‍ మెరుగైన వైద్యంకోసం ఢిల్లీ వెళ్లారా.. కేంద్ర పెద్దలు రప్పించారా అనే విషయం నేడో రేపో బయట పడటం ఖాయమంటున్నారు రాజకీయ విశ్లేషకులు

Leave A Reply

Your email address will not be published.