Publisher is the useful and powerful WordPress Newspaper , Magazine and Blog theme with great attention to details, incredible features...

ఆ దమ్ము అధికార ఎంపీలకు ఉందా..?

సిఎం జగన్‍ రెడ్డి అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్త్తయింది. గత ఎన్నికలలో 22 మంది లోక్‍సభ సభ్యులు విజయం సాధించగా.. (వారిలో ఒకరైన నరసాపురం ఎంపీ రఘురాంకృష్ణంరాజు జగన్‍ రెడ్డ్డికి ఎదురు తిరిగారు) పార్ట్టీ లోక్‍సభ నాయకుడు, కానీ ఇతర ఎంపీలు కానీ నోరు తెరవరు. రాజ్యసభలో ఆరుగురు ఎంపీలున్నా.. కేంద్ర ప్రభుత్వాన్ని ఎక్కడా ఏ ఒక్కరూ నిలదీసిన దాఖలాలు లేవు.

రాష్ట్ర విభజన హామీలు అమలు జరగకున్నా.. ఇస్తానన్న ప్పాకేజిని ఇవ్వకపోయినా.. ఎంపీలలో ఏ ఒక్కరూ ఇంత వరకు నోరు మెదపలేదు. మా ముఖ్యమంత్రి జగన్‍ రెడ్డి ఆదేశాలతోనే మేము మౌనం వహిస్తున్నాం.. రాష్ట్రానికి అన్యాయం జరుగుతుందని తెలుసు. ఏపీ అంటే నరేంద్ర మోడీకి, అమిత్‍షాకు వెంట్రుక ముక్కతో సమానం.

ఇంత మంది ఎంపీలున్నా కూడా కేంద్రాన్ని నిలదీయలేకపోతున్నారంటే.. మా ముఖ్యమంత్రి జగన్‍ రెడ్డి మా చేతులు కట్టేశారని.. తెర వెనుక కొందరు ఎంపీలంటున్నారు. ఇదే విషయాన్ని తాజాగా తన ట్విట్టర్‍ ద్వారా టిడిపి ఎంపీ రామ్మోహన్‍ నాయుడు అటు అధికార ఎంపీల తీరును ముఖ్యంగా విజయసాయిరెడ్డి పని తీరును ఎండగట్టారు.

- Advertisement -

22 మంది లోక్‍సభ సభ్యులలో ఒకరైన ఎంపీ ఆర్‍ఆర్‍ఆర్‍ సిఎం జగన్‍ రెడ్డిపై తిరుబాటు ఎగురవేశారు. ఆరుగురు రాజ్యసభ సభ్యులు జగన్‍ పార్టీకి ఉన్నారు. వారు లోక్‍సభలో కానీ, రాజ్యసభలో కానీ కేంద్ర ప్రభుత్వాన్ని పల్లెత్తి మాట అనరన్న విషయం ఈ రెండేళ్లలో రాజకీయ పరిజ్ఞానం తెలిసిన వారందరికీ తెలుసు.

విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ అమ్మకానికి వ్యతిరేకంగా అటు లోక్‍సభలో కానీ, ఇటు రాజ్యసభలో కానీ తీర్మానం పెట్టే దమ్ము వైసిపి ఎంపీలకు ఉందా అని టిడిపి ఎంపీ రామ్మోహన్‍ నాయుడు సవాల్‍ విసిరారు. ఢిల్లీ మెడలు వంచుతానని శపదాలు చేసి అక్కడికి వెళ్లి కాళ్లు మొక్కింది ఎవరో.. ఎందుకో.. అందరికీ తెలుసు అని రామ్మోహన్‍ నాయుడు తన ట్విట్టర్‍లో విజయసాయిరెడ్డిపై తీవ్ర విమర్శలు గుప్పించారు.

ముగ్గురు ఎంపీలున్న టిడిపి రాష్ట్రాభివృద్దికోసం కేంద్రాన్ని నిలదీస్తుంటే.. 28 మంది ఎంపీలున్న జగన్‍ పార్టీ నేతలు కేంద్రానికి కాళ్లు మొక్కుతున్నారు. వంగి వంగి దండాలు పెడుతున్నారు. జగన్‍ రెడ్డిపై ఉన్న కేసులు ఏ విధంగా మాఫీ చేయించుకోవాలా అనే విషయంపై మోడీని, అమిత్‍షాని పదే పదే కలుస్తున్నారని.. ఇంతకు ముందు అధికార నేతలు తెర వెనుక చెప్పేవారు. ఈ 22 మంది ఎంపీలో ఒక్కరు కూడా గొంతెత్తి ప్రశ్నింటచం లేదని ఎంపీ రామ్మోహన్‍ నాయుడు దుయ్యబట్టారు. సమావేశాలలో ఏమీ మాట్లాడకుండా.. దద్దమ్మ కబుర్లు చెబితే.. మీ వెర్రి తనం చూసి జనాలు నవ్విపోతున్నారని.. ట్విట్టర్‍లో రామ్మోహన్‍ నాయుడు వాతలు పెట్టారు.

Leave A Reply

Your email address will not be published.