Publisher is the useful and powerful WordPress Newspaper , Magazine and Blog theme with great attention to details, incredible features...

నరేంద్ర మోడీ పోస్టుకే జగన్‍ రెడ్డి ఎసరు పెట్టాలనుకుంటున్నారా..?

ముఖ్యమంత్రి జగన్‍ రెడ్డికి అటు చంద్రబాబు అన్నా.. ఇటు విపక్షాల ముఖ్య నేతలు అన్నా.. భయం ఉండదు.. వారికి కనీస మర్యాద ఇవ్వరు. నోటికి వచ్చినట్లు ఇష్టారాజ్యంగా మాట్లాడుతుంటారు. కులపరమైన నిందలు వేస్తుంటారు. చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్‍లు చేయని పనులు కూడా వారే చేశారని..ప్రజలను నమ్మించేందుకు సిఎం జగన్‍ రెడ్డి చేసిన ప్రయత్నాలు ఫలించినా.. ఆయనకు రాజకీయంగా, అధికారంగా చుక్కలు చూపిస్తున్నారు ఆర్‍ఆర్‍ఆర్‍.

నిత్యం మీడియా ముందుకు వచ్చి ధైర్యంగా ప్రభుత్వ తీరును దుయ్యబడుతున్నారు. సిఎం జగన్‍ రెడ్డి తీరును తప్పుబడుతూ ఆయన కంటికి కునుకు లేకుండా ఆర్‍ఆర్‍ఆర్‍ చేస్తున్నారు. బుధవారం నాడు ఆర్‍ఆర్‍ఆర్‍ మాట్లాడుతూ సిఎం జగన్‍ రెడ్డి మనసులో ఉన్న కోరికను తెరపైకి తీసుకు వచ్చారు.

- Advertisement -

ముఖ్యమంత్రి జగన్‍ రెడ్డి ప్రధాన మంత్రి కావాలని ఆశపడుతున్నారని.. ప్రజల ప్రాణాలను పణంగా పెట్టి కూడబెట్టిన కోట్లతో ఆయన కోరిక తీరదని.. అటు పైనున్న దేవతలు కానీ… ఇటు సిఎం జగన్‍రెడ్డి నమ్మే ఏసుక్రీస్తు కూడా సహకరించరని.. నరసాపూర్‍ ఎంపీ రఘురాంకృష్ణం రాజు అంటున్నారు. మాముఖ్యమంత్రి జగన్‍ రెడ్డి త్వరలో ప్రధాన మంత్రి కావటం ఖాయమని.. గతంలో శాసనసభలో ఒక మంత్రి చేసిన వ్యాఖ్యలు రాజకీయ విశ్లేషకులకు గుర్తుకు వస్తున్నాయి.

తాజాగా రాజుగారు ఏ ఉద్దేశంతో సిఎం జగన్‍ రెడ్డిపై ఆ వ్యాఖ్యలు చేశారనే విషయంపై త్వరలో ఆయనే బయట పెట్టడం ఖాయం అంటున్నారు విపక్షాల నేతలు. కరోనా బాధితులకు రాష్ట్రంలో అన్యాయం జరుగుతున్నా సిఎం జగన్‍ రెడ్డి పట్టించుకోవటం లేదని.. ఆసుపత్రులలో జరుగుతున్న అన్యాయాలను పట్టించుకోకపోవటంతో 46మంది చనిపోయారని.. దీనికి ముఖ్యమంత్రి జగన్‍ రెడ్డి నిర్లక్ష్యమే కారణమని ఆర్‍ఆర్‍ఆర్‍ ఆరోపించారు.

ప్రశ్నించే వారిపై కేసులు పదే పదే పెడుతున్నారని.. విపక్షాల నేతలు, కార్యకర్తలు కూడా సిఎం జగన్‍ రెడ్డిపై కేసులు పెట్టాలని ఆర్‍ఆర్‍ఆర్‍ పిలుపునిచ్చారు. కరోనా మృతుల సంఖ్య పెరిగిపోతుంటే.. ప్రభుత్వం దొంగ లెక్కలు చెబుతుందని.. మండిపడ్డారు. రాష్ట్రంలో లాక్‍డౌన్‍ పెట్టకుండా. కర్ఫ్యూ పెట్టడం ఏమిటని.. ఆర్‍ఆర్‍ఆర్‍ తీవ్ర స్థాయిలో మండి పడ్డారు. ప్రజల ప్రాణాలు, శవాలతో వ్యాపారం చేయటం సరికాదని.. సిఎం జగన్‍ రెడ్డికి ఆర్‍ఆర్‍ఆర్‍ హితవు పలికారు.

Leave A Reply

Your email address will not be published.