Publisher is the useful and powerful WordPress Newspaper , Magazine and Blog theme with great attention to details, incredible features...

అశోక్‌గజపతిరాజు బిజెపిలో చేరాలనుకుంటున్నారా..?

మాజీ కేంద్ర మంత్రి, మాన్సాస్‌ ట్రస్టు ఛైర్మన్‌ పూసపాటి అశోక్‌గజపతి రాజును రోజు రోజుకు ఇబ్బందులు పెడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ఆయనకు చుక్కలు చూపిస్తున్న నేపధ్యంలో తాను టిడిపిలో కొనసాగటంపైనే.. సిఎం జగన్‌ రెడ్డి కక్ష పెంచుకున్నారు. పార్టీలో కూడా గతంలో వలె చంద్రబాబు తనకు విలువ ఇవ్వటం లేదు. ఒకవైపు ప్రభుత్వ వేదింపులు… మరో వైపు పార్టీ నేత చంద్రబాబు చిన్న చూపు చూడటం వంటి కారణాలతో పార్టీని వీడి బిజెపిలో చేరాలని ఆయన భావిస్తున్నట్లు గత కొద్ది రోజులు సోషల్‌ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది.

అపార రాజకీయ, అధికార అనుభవం ఉన్న అశోక్‌గజపతిరాజు పార్టీ మారే ప్రసక్తే లేదని.. ఆయన గొంతులో ప్రాణం ఉన్నంత కాలం టిడిపిలోనే కొనసాగుతారని.. ఒకవేళ పార్టీని వీడాలనుకుంటే.. క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉంటారే తప్ప పార్టీ మారరంటున్నారు ఆయన అనుచరులు.

నిప్పు లేనిదే పొగరాదు కదా.. ఇంతకు ముందు ఎన్నడూ జరగనిది సోషల్‌ మీడియాలో ప్రచారం జరుగుతోంది. చంద్రబాబు అశోక్‌గజపతిల మధ్య కొంత దూరం పెరిగిన విషయం యదార్ధమే. గత ఎన్నికలలో విజయనగరం జిల్లాలో సింగిల్‌ సీటు కూడా టిడిపికి లభించకపోవటంతో.. మాజీ మంత్రి అశోక్‌గజపతి రాజు వ్యవహారశైలే రాజకీయంగా కొంప ముంచిందని.. చంద్రబాబు భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

- Advertisement -

సోషల్‌ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని మాజీ మంత్రి అశోక్‌గజపతి రాజు కొట్టివేయటం లేదు. ఈ విషయాన్ని ఆయన పట్టించుకోవటం లేదంటున్నారు పార్టీ ముఖ్యనేతలు. అశోక్‌గజపతి రాజు టిడిపిని వీడి బిజెపిలో చేరితే.. భవిష్యత్తులో ఆయనను రాజ్యసభకు ఎంపిక చేసి కేంద్ర మంత్రి పదవి ఇచ్చేందుకు కూడా కేంద్ర బిజెపి పెద్దలు సుముఖుంగాఉన్నారని.. రాష్ట్ర బిజెపి నేతలు తెర వెనుక చెబుతున్నారు.

సిఎం జగన్‌రెడ్డి పెడుతున్న ఇబ్బందులు, సాదింపులు తట్టుకోవాలంటే.. రాజుగారు బిజెపిలో చేరగలిగితే..ఆ వేదింపులు, సాదింపులకు సిఎం జగన్‌ రెడ్డి పులిస్టాప్‌ పెడతారంటున్నారు అధికార పార్టీ నేతలు. ఇంతకీ మాజీ మంత్రి అశోక్‌గజపతిరాజు పార్టీమారాలనుకుంటున్నారా.. చంద్రబాబు తనను ఎక్కువగా పట్టించకోవటం లేదనుకుంటున్నారా.. ఇన్నేళ్ళ రాజకీయ జీవితంలో తాజాగా ఎదుర్కొంటున్న ఇబ్బందులు ఇంతకు ముందు ఎన్నడూ ఎదుర్కోలేదని.. రోజు రోజుకు రాష్ట్ర ప్రభుత్వం ఇబ్బంది పెడుతుందని.. చంద్రబాబు సహకారం కూడా గతంలో వలె లభించటం లేదని.. రాజుగారు భావిస్తున్నట్లు తనకు అత్యంత సన్నిహితులైన అధికారులు అంటున్నారు.

ఇంతకీ రాజుగారి ఆలోచన ఎలా ఉందో బయట పడనప్పటకీ.. ఇప్పటి వరకు అనేక ఇబ్బందులు పడ్డాం.. ఇంత కన్నా జగన్‌ రెడ్డి ఏం చేయగలరు అని సర్దుకుపోతే పరిస్థితి ఒకలా ఉంటుంది. జగన్‌ రెడ్డి వేదింపులు తట్టుకోవాలంటే.. పార్టీ మారితేనే ఆ వేదింపులు సాదింపులు తగ్గుతాయని.. అశోక్‌ నమ్మితే ఆయన బిజెపిలో చేరినా ఆశ్యర్యపడక్కర్లేదంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

Leave A Reply

Your email address will not be published.