Publisher is the useful and powerful WordPress Newspaper , Magazine and Blog theme with great attention to details, incredible features...

తిరుపతి మెజార్టీపై జగన్‍ రెడ్డికి అనుమానం వచ్చిందా..?

తిరుపతి లోక్‍సభ ఉప ఎన్నికలో ప్రచారం చేయకూడదని.. సిఎం జగన్‍ రెడ్డి నిర్ణయం తీసుకున్నప్పటికీ.. తాజాగా మారిన పరిణామాలను ఇంటిలిజెన్స్ వర్గాల నివేదిక ద్వారా తెలుసుకున్న ముఖ్యమంత్రి ప్రభుత్వ లోక్‍సభ ఉప ఎన్నికల పరిదిలోని అన్ని శాసనసభ నియోజకవర్గాలలో ప్రచారం చేయాలని ఆయన నిర్ణయం తీసుకున్నట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. ఒకవైపు జనసేనాదిపది పవన్‍ కళ్యాణ్‍ ప్రచారంతో దూసుకువెళ్లారు.

మరో వైపు మాజీ మంత్రి నారా లోకేష్‍ టిడిపి అభ్యర్ధికి మద్దతుగా తన ప్రచార దూకుడును పెంచారు. నిన్న మొన్నటి వరకు ఇళ్లకే పరిమితం అయిన కొందరు టిడిపి ముఖ్య నేతలు ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నారు. కేసులకు బయపడి నిన్న మొన్నటి వరకు మౌనం వహించిన కార్యకర్తలు కూడా బాహాటంగా ఎన్నికల ప్రచారంలో కనిపిస్తున్నారు.

అధికార పార్టీ నేతల ప్రచారం చప్పగా సాగుతుంది. అధికార ప్రజాప్రతినిధులు పూర్తిగా ప్రచారంలోకి దిగలేదని సిఎం జగన్‍ రెడ్డి తెలుసుకున్నారు. ఎందుకైనా మంచిది.. ముందు జాగ్రత్త తీసుకోకపోతే.. ఏదో విధంగా నష్టం జరుగుతోందని తెలుసుకున్న సిఎం జగన్‍ రెడ్డి ఎన్నికల ప్రచారంలో తాను స్వయంగా పాల్గొనాలని భావిస్తున్నట్లు అధికార వర్గాల సమాచారం. 2019 ఎన్నికలలో అధికార పార్టీ 2లక్షల 28వేల మెజార్టీతో గెలిచారు.

- Advertisement -

ఈ సారి 3 లక్షల నుండి 5లక్షల మెజార్టీతో అభ్యర్ధి విజయం సాధించాలని.. ఏడు అసెంబ్లీ నియోజవర్గాల ఎమ్మెల్యేలకు, మంత్రులకు జగన్‍ రెడ్డి టార్గెట్‍ విధించినట్లు ప్రచారం జరుగుతోంది. అంతే కాకుండా అభ్యర్ధి గెలుపుకు ఎన్నికల ఖర్చు కూడా ఎమ్మెల్యేలు, మంత్రులే భరించాలి అని ముఖ్యమంత్రి ఆదేశించినట్లు కూడా ప్రచారం జరుగుతోంది.

తాజా పరిస్థితులకు అణుగుణంగా తాను సొంతంగా ఎన్నికల ప్రచారంలో దిగకుంటే.. మెజార్టీ తగ్గినా పరువు పోతుంది. ఒకవేళ ఫలితాలు మరో విధంగా వచ్చినా.. రాజకీయంగా ఎదురు దెబ్బ తగులుతుంది. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుని తాను స్వయంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటే పరిస్థితి మెరుగుపడుతుందని.. లేకుంటే పరిస్థితి మరోలా ఉంటుందని భావిస్తున్న జగన్‍ రెడ్డి ఎన్నికల ప్రచారానికి వెళ్లబోతున్నట్లు ఆ పార్టీ నేతలకు, అమాత్యులకు అధికారులు అనుకుంటున్నట్లు తెలిసింది.

త్వరలో చంద్రబాబు కూడా ఎన్నికల ప్రచారంలో దిగబోతున్న నేపధ్యంలో ఆయనకు ధీటుగా జగన్‍ రెడ్డి కూడా ఎన్నికల ప్రచారం చేస్తారని.. అధికార నేతలు చెప్పుకుంటున్నారు.

Leave A Reply

Your email address will not be published.