Publisher is the useful and powerful WordPress Newspaper , Magazine and Blog theme with great attention to details, incredible features...

ఆదిత్యనాద్‍ సర్వీసు పొడిగింపుకు ఆ అధికారి అడ్డుపడినా..!

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాద్‍ దాస్‍ జూన్‍ మాసాంతానికి రిటైర్డు అవుతారు.. ఆయన సర్వీసు మరో ఆరు నెలలు పొడిగించమని సిఎం జగన్‍ రెడ్డి కేంద్రానికి లేఖ రాశారు. ఆయన సర్వీసు పొడిగింపుకు కేంద్రం నుండి అనుమతి రాకుండా మీరు చూసుకోండి. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పదవి మీకే వచ్చేటట్లు నేను చేస్తాను.. అంతే కాకుండా మీరు రిటైర్డు అయినా మీ సర్వీసును మరో ఆరు నెలలు పొడిగించేటట్టు చేస్తాను.. అని ముఖ్యమంత్రి కార్యాలయ అధికారి ఒకరు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పోస్టు ఆశిస్తున్న సీనియర్‍ ఐఎఎస్‍ అధికారితో రహస్యంగా చెప్పిన విషయం ఇప్పుడిప్పుడే బయట పడుతుంది.

ఈరోజు వరకు కేంద్రం నుండి ఆదిత్యనాద్‍ దాస్‍ సర్వీసు పొడిగింపుకు అనుమతి రాలేదంటే.. ఎక్కడో ఏదో జరుగుతోంది అని ఐఎఎస్‍ అదికారులకు అనుమానం ఉంది. తాజాగా ఆదిత్యనాద్‍ దాస్‍ సర్వీసు పొడిగింపుకు ముఖ్యమంత్రి కార్యాలయ అధికారి సూచనలతో, ఢిల్లీలో ఉన్న అదికారుల పరిచయంతో ఇప్పటి వరకు ఒక సీనియర్‍ అధికారి అడ్డుపడినా.. ఈ వారాంతం లోపు ఆదిత్యనాద్‍ దాస్‍ పొడిగింపుకు కేంద్రం అనుమతి ఇచ్చే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయంటున్నారు సీనియర్‍ ఐఎఎస్‍ అధికారులు.

- Advertisement -

గతంలో ఒక వెలుగు వెలిగిన ఆ సీనియర్‍ ఐఎఎస్‍ అదికారి.. ముఖ్యమంత్రి కార్యాలయ అధికారిని రహస్యంగా కలుస్తూ.. తనకు సిఎస్‍ పోస్టు ఇప్పించగలిగితే.. మీరు చెప్పినట్లు వింటాను. మీ ఆదేశాల ప్రకారం నడుచుకుంటాను అని హామీ ఇచ్చినట్లు కూడా సచివాలయంలో ప్రచారం జరుగుతోంది. అనేక సంవత్సరాలు అధికారిగా అధికారం చెలాయించినా.. తృప్తి పడని ఆ సీనియర్‍ ఐఎఎస్‍ అధికారి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పదవితో సర్వీసు నుండి రిటైర్డు కావాలని కోరుకుంటున్నారట.

మొదట్లో ఆయన కోరిక నేరవేరే అవకాశాలు కనుచూపు మేర కనిపించకపోవటంతో ఆదిత్యనాద్‍ దాస్‍ సర్వీసు పొడిగింపుకు ఇష్టంలేని ముఖ్యమంత్రి కార్యాలయ అధికారిని ఆ సీనియర్‍ ఐఎఎస్‍ అధికారి ఆశ్రయించారు. ఇద్దరు బాగా దగ్గరయ్యారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పోస్టు కోసం ఆ సీనియర్‍ అధికారి.. ఆదిత్యనాద్‍ పొడిగింపు రాకూడదని కోరుకుటున్న సిఎం కార్యాలయ అధికారి విషయం ఇప్పుడిప్పుడే బయట పడుతుంది.

ఎన్ని అడ్డంకులు సృష్టించినా.. ఆదిత్యనాద్‍ సర్వీసు పొడిగింపును ఎవరూ ఆపలేరని.. మహా అయితే ఇప్పటి వరకు జాప్యం జరిగిందని.. మరో మూడు, నాలుగు రోజులలో ఆదిత్యనాద్‍ సర్వీసు పొడిగింపుకు కేంద్రం నుండి తప్పకుండా అనుమతి వస్తుందంటున్నారు రిటైర్డు ఐఎఎస్‍ అధికారులతో పాటు ఇతర శాఖలలో పనిచేస్తున్న అధికారులు.

Leave A Reply

Your email address will not be published.