Publisher is the useful and powerful WordPress Newspaper , Magazine and Blog theme with great attention to details, incredible features...

ఆర్దిక మంత్రి బుగ్గన, సిఎంవో అధికారి అధికారాలకు కత్తెర వేసిన జగన్‍ రెడ్డి..!

బకాయిలు చెల్లించాల్సి వారికి ఆర్దిక శాఖ అధికారుల సిఫార్సులతో.. ఆర్దిక మంత్రి ఆమోదంతో ఇంతకు ముందు బకాయిలు చెల్లించే విధానం ఉండేది. అమాత్యులు, అధికార ఎమ్మెల్యేలు, అధికార ముఖ్యనేతల సిఫార్సులు, సూచనలకు ఆర్దిక మంత్రి బుగ్గన రాజేంద్రకుమార్‍ రెడ్డి తలొగ్గేవారు.

ఎవరెవరికి ఎంతెంత బిల్లులు చెల్లించాలని సిఫార్సులు వచ్చేవో.. వాటిని బుగ్గన ఆమోదించే విధానం గతంలో ఉండేది. కానీ ఆ విధానంలో చాలా అవకతవకలు జరుగుతున్నాయని.. భారీ ఎత్తున కమీషన్లు చేతులు మారుతున్నాయని.. ఇందులో ఎవరెవరికి ఎంతెంత కమీషన్లు అందుతున్నాయనే విషయం పక్కన పెడితే.. ఆర్దిక మంత్రి బుగ్గనకు అధికారం ఉండటం వలనే కదా.. ఈ కమీషన్లు చేతులు మారుతున్నాయని.. గ్రహించిన సిఎం జగన్‍ రెడ్డి.. ఆర్దిక మంత్రి రాజేంద్ర నాద్‍ రెడ్డి అధికారాన్ని కుదించి అధికారులకే ఆ బాధ్యతలను అప్పజెబుతూ ముఖ్యమంత్రి కార్యాలయ అధికారి ధనుంజయరెడ్డి చేసే సూచనలు, సిఫార్సులు మాత్రమే ఆమోదించాలని..జగన్‍ రెడ్డి ఆర్దిక శాఖ అధికారులను ఆదేశించారు.

బిల్లులు చెల్లింపు విషయంలో ఆర్దిక శాఖ మంత్రి బుగ్గనకు అధికారాలుండవు. ఆర్దిక శాఖను పర్యవేక్షిస్తున్న ముఖ్యమంత్రి కార్యాలయ అదికారి ప్రవీణ్‍ ప్రకాష్‍కు కూడా బిల్లులు చెల్లింపు విషయంలో కలుగజేసుకోకూడదని.. సిఎం జగన్‍ రెడ్డి ఆదేశించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.

- Advertisement -

ఆర్దిక శాఖలో ఇతర నిర్ణయాలు తీసుకోవచ్చు.ఒక వేళ ఆ నిర్ణయాలను సిఎంకు పంపాలనుకుంటే.. ప్రవీణ్‍ ప్రకాష్‍కు పంపే ఫైళ్ల విధానం అమలు అవుతున్నా… ఒక్క ఆర్దిక శాఖ బిల్లులు మాత్రం అటు మంత్రికి, ఇటు ప్రవీణ్‍ ప్రకాష్‍కు సంబందం లేకుండా. ధనుంజయరెడ్డి సిఫార్సులతో ఆర్దిక శాఖ అధికారులు బిల్లులు చెల్లిస్తున్నట్లు తెలిసింది.

దీనిని బట్టి ఇతరుల బిల్లులు చెల్లింపుకు వారందరూ సిఫార్సు చేసినా.. గతంలో వలె అమలు జరగవు. ధనుంజయరెడ్డి చేసిన సిఫార్సులు మాత్రమే అమలు జరుగుతున్నాయన్న విషయం అందరికీ తెలిసిపోయింది. ముఖ్యమంత్రి జగన్‍ రెడ్డి చెప్పిందే చేస్తానని.. తాను ఏమీ చేయనని.. మీ బిల్లులు ఏదైనా పెండింగ్‍లో ఉంటే స్వయంగా సిఎం జగన్‍ రెడ్డిని కలవండి.. ఆయన ఆమోదిస్తే.. బిల్లుల చెల్లింపులకు సిఫార్సు చేస్తానని ధనుంజయరెడ్డి చెబుత్నుట్లు అధికార నేతలు అంటున్నారు.

కానీ ఈ బిల్లుల చెల్లింపులో స్వామి కార్యాలతో పాటు స్వకార్యాలను కూడా ధనుంజయరెడ్డి అమలు చేయిస్తున్నారని ప్రచారం జరుగుతున్నా.. అందుకు ఎక్కడా ఆధారాలు బయట పడటం లేదు. ధనుంజయరెడ్డి కార్యాలయ అధికారి ఒకరిని పట్టుకుంటే.. బిల్లులు చెల్లింపులు జరుగుతున్న ప్రచారంలో కూడా ఆధారాలు బయట పడటం లేదు.

దీంతో మంత్రులు, అధికార ప్రజాప్రతినిధులు, అధికార పార్టీ నేతలు, ఇతర శాఖాధిపతులు, ఇతర ముఖ్యులు చేస్తున్న సిఫార్సులను ఆర్దిక శాఖాదిపతి అంతంత మాత్రంగానే ఆమోదిస్తున్నారని.. ధనుంజయరెడ్డి చెప్పిందే ఆర్దిక శాఖాదిపతి అమలు చేస్తున్నారని.. గత రెండేళ్లు, మూడేళ్లు నుండి ఆర్దిక శాఖ కార్యాలయం చుట్టూ కాళ్లు అరిగేలా తిరిగేవారు చెబుతున్నారు.

Leave A Reply

Your email address will not be published.