మెగా ఫ్యాన్స్‌కి మెగాస్టార్ ఇచ్చిన దివాళి గిఫ్ట్ ఇదే
మెగాస్టార్ చిరంజీవి.. మెగాభిమానులకు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చారు. ఏంటి కొత్త సినిమా ఏదైనా ప్రకటించారా? అని అంతా అనుకుంటున్నారేమో.. దానికంటే కూడా అద్భుతమైన గిఫ్ట్ ఇచ్చారు. ఏంటది అనుకుంటున్నారా? కదా..!. దీపావళిని పురస్కరించుకుని మెగాస్టార్ చిరంజీవి తన ఇన్‌స్టాగ్రమ్ వేదికగా ఓ ఫొటోని షేర్ చేశారు. ఈ ఫొటోలో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్‌తో మెగాస్టార్ చిరంజీవి సెల్ఫీ తీసుకుంటున్నారు. వెనుక తారాజువ్వలు ఆకాశంలో నుంచి ఆశీర్వదిస్తున్నట్లుగా ఉన్న ఈ ఫొటోలో.. చరణ్‌పై చేయివేసి మెగాస్టార్ సెల్ఫీ తీసుకుంటున్నారు. ఈ ఫొటో చూడడానికి మెగాభిమానులకు రెండు కళ్ళు చాలవంటే నమ్మాలి మరి. దివాళి గిఫ్ట్ లేదేమిటా అని నిరుత్సాహంతో ఉన్న మెగాభిమానులను చిరు ఈ విధంగా సంతోషపెట్టారు. ఇప్పుడీ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.