Publisher is the useful and powerful WordPress Newspaper , Magazine and Blog theme with great attention to details, incredible features...

జగన్‍ రెడ్డికి షాక్‍ ఇచ్చిన హైకోర్టు..!

తెలుగుదేశం పార్టీ ఎంపిటీసి, జడ్పీటిసి ఎన్నికలను బహిష్కరించటం ఖాయమని తెలుసుకున్న జగన్‍ రెడ్డి స్థానిక సంస్థల ఎన్నికల కమీషనర్‍ నీలం సహానితో హడావిడిగా పరిషత్‍ నోటిఫికేషన్‍ జారీ చేయించారు. అటు ఎంపీటిసి, ఇటు జడ్పీటిసి ఎన్నికలు ఏకపక్షంగా ఫలితాలు రాబట్టే విధంగా సిఎం జగన్‍ రెడ్డి అండ్‍ కో చేసిన ప్రయత్నాలకు న్యాయ స్థానం బ్రేక్‍ వేసింది.

- Advertisement -

ఎంపీటిసి, జడ్పీటిసి ఎన్నికలను పది రోజుల్లోనే పూర్తి చేయాలని భావించి ఏప్రిల్‍ 1వ తేదీన (అందరూ ఏప్రిల్‍ ఫూల్‍గా పిలవబడే రోజు) స్థానిక సంస్థల ఎన్నికల కమీషనర్‍గా బాధ్యతలు స్వీకరించిన నీలం సహానిపై ఒత్తిడి తెచ్చి రాత్రి 8.30గం.లకు ఎంపీటిసి, జడ్పీటిసి ఎన్నికల నోటిఫికేషన్‍ జారీ చేయించటంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ పలు రాజకీయ పార్టీలు న్యాయస్థానాన్ని ఆశ్రయించటంతో అటు సిఎం జగన్‍ రెడ్డి స్పీడుకు.. ఇటు నీలం సహాని నిబందనలకు విరుద్దంగా వ్యవహరించినందుకు వారిద్దరికి షాక్‍ ఇస్తూ.. ఎన్నికల నోటిఫికేషన్‍కు న్యాయస్థానం ఎన్నికలను నిలిపి వేస్తూ బ్రేక్‍ వేసింది.

సుప్రీంకోర్టు ఆదేశాలను నీలం సహాని పాటించలేదని.. నీలంసహాని విడుదల చేసిన నోటిఫికేషన్‍లో తదనంతర చర్యలు నిలిపివేయాలని న్యాయస్థానం ఆదేశించింది. గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను స్థానిక సంస్థల ఎన్నికల కమీషనర్‍ నీలం సహాని పట్టించుకోలేదని.. ఎన్నికల నోటిఫికేషన్‍కు, ఎన్నికల పోలింగ్‍కు నాలుగు వారాల సమయం తప్పనిసరిగా ఉండాలనే విషయాన్ని ఈ సందర్భంగా హైకోర్టు ధర్మాసనం గుర్తు చేసింది.

Leave A Reply

Your email address will not be published.