Publisher is the useful and powerful WordPress Newspaper , Magazine and Blog theme with great attention to details, incredible features...

పాలకుల నిర్ణయాలకు బలవుతున్న ఐఎఎస్‌లు..?

ముఖ్యమంత్రి, మంత్రులు నిర్ణయాలు తీసుకుంటారు. ఆ నిర్ణయాలన్నీ ఐఎఎస్‌ అధికారుల పేరుతో ఉత్తర్వులు జారీ అవుతుంటాయి. క్రింది స్థాయి నుండి పై స్థాయి వరకు ఎవరెవరు ఏఏ నిర్ణయాలు తీసుకున్నారనే వివరాలు ఆ ఉత్తర్వులలో ఉండవు. విధాన పరమైన నిర్ణయాలు, ఆర్దికపరమైన నిర్ణయాలు, అధికారులు, ఉద్యోగులపై సస్పెన్షన్లు ఈ నిర్ణయాలన్నీ అటు ముఖ్యమంత్రి కానీ.. ఇటు మంత్రులు మాత్రమే తీసుకున్నాక.. సంబందిత శాఖాదిపతుల పేరుతో ఉత్తర్వులు జారీ అవుతుంటాయి.

అంతే కాకుండా కోర్టు దిక్కరణ కేసులు, నష్టపరిహారం కేసులతో పాటు ఇతర విషయాలకు సంబందించిన నిర్ణయాలన్నీ ముఖ్యమంత్రి, మంత్రులతో పాటు మంత్రి వర్గం తీసుకోవాల్సి ఉంటుంది. కానీ క్రింది స్థాయి అధికారులు ఫైళ్లపై ఏ విధమైన అభిప్రాయం వెల్లబుచ్చారు. ఆ అభిప్రాయాలకు విరుద్దంగా మంత్రి, ముఖ్యమంత్రి విరుద్దంగా నిర్ణయం తీసుకున్నాక.. వారు తీసుకున్న నిర్ణయాలతోనే ఉత్తర్వులు జారీ అవుతాయి.

- Advertisement -

ఈ విషయాలను న్యాయస్థానం దృష్టికి ఐఎఎస్‌ అధికారులు తీసుకెళ్లరు. తీసుకువెళితే.. మంత్రులు, ముఖ్యమంత్రితో తంటా. తీసుకెళ్లనందుకు న్యాయస్థానం వేసే మొట్టికాయలను నోరు మూసుకుని భరించాల్సి ఉంటుంది. సంబందిత ఫైలులో తాము ఒక నిర్ణయం తీసుకున్నాం. మంత్రి, ముఖ్యమంత్రి ఆనిర్ణయం తీసుకోలేదు. అందుకే ఆ ఫైలు పెండిరగ్‌లో ఉందని.. న్యాయస్థానానికి చెప్పలేరు.

నిర్ణయాలు తీసుకునేది మంత్రి, ముఖ్యమంత్రి అయినప్పటికీ.. కొన్ని నిర్ణయాల వలన ఐఎఎస్‌ అధికారులే బలి పశువులు అవుతున్నారని.. కింది స్థాయి అధికారులు అంటున్నారు. ఇటీవల కాలంలో కోర్టు దిక్కరణ కేసుకింద జరిమానాతో పాటు జైలు శిక్షను కూడా న్యాయస్థానం విధించింది.

న్యాయస్థానం ఇచ్చిన తీర్పులను అమలు చేయాలని.. పదే పదే న్యాయమూర్తులు హెచ్చరించినా.. అటు ముఖ్యమంత్రి, ఇటు మంత్రులు సకాలంలో నిర్ణయం తీసుకోకపోవటంతో.. అందుకు ఐఎఎస్‌ అధికారులే బాధ్యత వహించి మూల్యం చెల్లించుకుంటున్నారు. కావాలని ఏ ఐఎఎస్‌ అధికారి న్యాయస్థానం తీర్పును అమలు చేయకుండా ఉండరు. అమలు చేయాలని భావిస్తారే తప్ప కాలయాపన చేయరని.. కానీ పరిస్థితుల వలన వారు బలవుతున్నారని.. గతంలో కూడా తాము బలయ్యామని రిటైర్డు అధికారులు అంటున్నారు.

Leave A Reply

Your email address will not be published.