Publisher is the useful and powerful WordPress Newspaper , Magazine and Blog theme with great attention to details, incredible features...

జగన్‍ రెడ్డి విష్ణువు అవతారం అయితే… భారతి లక్ష్మీదేవా..?

తనను తిరుమల శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకుడిగా నియమించేందుకు ముఖ్య కారుకులైన సిఎం జగన్‍ రెడ్డిని విష్ణుమూర్తితో రమణ దీక్షితులు పోల్చటంపై అధికార పార్టీ నేతలు మినహా మిగతా రాజకీయ పార్టీ నేతలందరూ ఆయనను దుమ్మెత్తి పోస్తున్నారు. సిఎం జగన్‍ రెడ్డి విష్ణుమూర్తి అయితే.. తిరుమలలో జగన్‍ రెడ్డి విగ్రహాన్ని ప్రతిష్టించి ప్రధాన అర్చకుడి హోదాలో రమణ దీక్షితులు పూజలు చేస్తే సరిపోతుందికదా..!

మనిషి రూపంలో ఉన్న జగన్‍ రెడ్డి నిజమైన విష్ణుమూర్తి అయితే.. తిరుమల దేవాలయంలో విష్ణుమూర్తి విగ్రహానికి రమణ దీక్షితులు ఎందుకు పూజలు చేస్తున్నారు. తిరుమల హుండీలో కానుకలు వేయద్దు.. అని పిలుపునిచ్చిన రమణదీక్షితులును మళ్లీ ప్రధాన అర్చకుడిగా నియమించటం ఏమిటి..? ఎప్పుడో కోర్టు తీర్పునిచ్చిందని.. తాజాగా ఆ తీర్పును అమలు చేయటం ఏమిటి..? సిఎం జగన్‍ రెడ్డి విష్ణుమూర్తి అవతారం అయితే.. తిరుమల వెంకన్న పాదాల దగ్గర రమణ దీక్షితులకు పని ఏమిటి..?

తాడేపల్లి జగన్‍ రెడ్డి నివాసానికి వచ్చి రమణ దీక్షితులు పూజలు చేయవచ్చు కదా..ఒక వేళ సిఎం జగన్‍ రెడ్డి విష్ణుమూర్తి అవతారమే అయితే.. లక్ష్మీదేవిని ఎందుకు తిరుమలకు తీసుకు రావటం లేదు. 33కేసులలో ముద్దాయిగా ఉన్న జగన్‍ రెడ్డి విష్ణుమూర్తి అవతారం ఎలా అవుతారు అని రమణ దీక్షితులును ఎవరైనా అడిగి నిలదీస్తే ఆయన ఏం సమాధానం చెబుతారో..?

- Advertisement -

తిరుమల శ్రీవారి దేవాలయంలో నలుగురు ప్రధాన అర్చకులు బాధ్యతలు నిర్వహిస్తుండగా..ఆ నలుగురిలో ముగ్గురు తమకు అప్పగించిన బాధ్యతలు నిర్వహిస్తూ.. తమ పని తాము చేసుకుంటుంటే.. నాలుగో ప్రధాన అర్చకుడైన రమణ దీక్షితులు మాత్రమే రాజకీయంగా తెరపైకి వస్తున్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‍.రాజశేఖర్‍ రెడ్డి పుట్టుకతో క్రైస్తవుడు కాదని.. ఆ తరువాత ఆ మతాన్ని స్వీకరించారని.. కానీ జగన్‍ రెడ్డి పుట్టుకతోనే క్రైస్తవుడని రమణ దీక్షితులకు కూడా తెలుసు.

తిరుమలలో బ్రహ్మోత్సవం సందర్భంగా సతీ సమేతంగా శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించే సంప్రదాయాన్ని పక్కన పెట్టి అప్పట్లో దివంగత వైఎస్‍.రాజశేఖర్‍ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక జగన్‍ రెడ్డి సతీసమేతంగా శ్రీవారికి పట్టు వస్త్రాలు ఇచ్చిన సందర్భాలు లేవు. వైఎస్‍.విజయలక్ష్మీ చేతిలో ఎప్పుడూ బైబిల్‍ ఉంటుందనే విషయం అందరికీ తెలుసు.

జగన్‍ భార్య వైఎస్‍.భారతి రెడ్డి క్రైస్తవ మతాన్ని ఆచరిస్తున్నారా.. హిందూ మతాన్ని ఆచరిస్తున్నారన్న విషయం బయట పడకపోయినా..ఆమె ఏనాడు హిందూ దేవాలయాలకు కానీ.. ముఖ్యంగా తిరుమల దేవాలయానికి వచ్చిన దాఖలాలులేవు. భర్త విష్ణుమూర్తి అవతారం అయితే.. భార్య కూడా లక్ష్మీదేవి అవతారమే కదా.. కానీ ఆమె ఎందుకు ఇంత వరకు తిరుమల శ్రీవారి దర్శనం చేసుకోలేదు.

అయినా బిజెపి సోము వీర్రాజు కానీ.. జివిఎల్‍.నరసింహారావు కానీ.. బిజెపి పెద్దలు కానీ.. హిందూ విశ్వపరిషత్‍ నేతలుకానీ.. ఇతర స్వామీజీలు కానీ ఇంత వరకు ఏ ఒక్కరూ జగన్‍ రెడ్డిని రమణ దీక్షితులు విష్ణుమూర్తితో పోల్చటంపై బాహాటంగా తప్పుపట్టలేదు.

Leave A Reply

Your email address will not be published.