Publisher is the useful and powerful WordPress Newspaper , Magazine and Blog theme with great attention to details, incredible features...

పరిటాల శ్రీరామ్‍ బయటకు వస్తే.. అక్రమ కేసులా..?

దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్‍ నటించిన ఒక పాత సినిమాలో యముడు పాత్ర పోషించినప్పుడు ఆయన పాడిన పద్యాలు గుర్తుకు వస్తున్నాయి. ఆ పద్యంలో ఎలాంటి అర్దాలుంటాయంటే.. కాలు కదిపిన చాలు.. కస్సుమని కోసుకునే పదునురాళ్లు.. అడుగు పెట్టిన చాలు బుస్సు అని పైబడు పాపరేణులు.. పులులు, సింహాలు పోవ పోవ కటిక చీకటి కనరాదు.. కాలి దోవ.. మాట వినవేల.. పోవేల.. మరలవేల.

ఆ సందర్భం ఏమిటంటే.. తన భర్త ప్రాణాన్ని తీసుకుపోతున్న యమధర్మరాజు వెంట వస్తున్న సావిత్రి గురించి యమధర్మరాజు వాడిన పదాలు.

ఇక అసలు విషయం ఏమిటంటే.. పరిటాల కుటుంబ రాజకీయ వారసుడైన పరిటాల శ్రీరామ్‍ అడుగు బయట పెడితే చాలు.. అధికార నేతలు అక్రమ కేసులు బనాయిస్తున్నారు. గత ఎన్నికలలో చంద్రబాబు ప్రభుత్వ వ్యతిరేకతతో పరిటాల శ్రీరామ్‍ ఓడిపోయారే తప్ప పరిటాల కుటుంబంపై వ్యతిరేకతతో కాదని.. అధికార నేతలకు తెలుసు. ఇలాంటి పరిస్థితులున్న నేపధ్యంలో పరిటాల శ్రీరామ్‍ మరింత చురుకుగా బయటకు వస్తున్నారు.

- Advertisement -

అలా పరిటాల శ్రీరామ్‍ బయటకు వస్తే.. ముందు ముందు ప్రమాదం పొంచి ఉంటుందని అధికార నేతలకు తెలుసు. అందుకే గుక్క తిప్పుకోకుండా.. అడుగు బయట పెట్టకుండా.. రాజకీయ పర్యటనలు చేయకుండా.. తప్పుడు అక్రమ కేసులను అధికార నేతలు బనాయింప చేస్తున్నారని.. ఆయనపై నమోదు అయిన కేసులను బట్టి స్పష్టమవుతోందంటున్నారు టిడిపి నేతలు.

2019 ఎన్నికలలో ఎమ్మెల్యేగా ఓడిపోయాక.. కొంత కాలం మౌనం వహించిన దివంగత పరిటాల రవీంద్ర రాజకీయ వారసుడు మాజీ మంత్రి పరిటాల సునీత కుమారుడు పరిటాల శ్రీరామ్‍ ఆ బాధ నుండి కోలుకుని ఇప్పుడిప్పుడే మళ్లీ క్రియాశీలక రాజకీయాల్లోకి అడుగు పెడుతున్న నేపధ్యంలో ఆయనను రాజకీయంగా దెబ్బకొట్టేందుకు పదే పదే కేసులు నమోదు చేస్తూ.. రాజకీయంగా శ్రీరామ్‍ను భయపెట్టేందుకు జగన్‍ రెడ్డి ఆదేశాలతో స్థానిక నాయకులు పధకం ప్రకారం వ్యహరిస్తున్నారని టిడిపి నేతలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఇదే అభిప్రాయాన్ని రాజకీయ విశ్లేషకులు కూడా అనేక సందర్భాలలో వ్యక్తం చేశారు. దివంగత పరిటాల రవీంద్రలా చురుకైన నేత పరిటాల శ్రీరామ్‍ కాకపోయినా..ఆ కుటుంబానికి ఓటర్లలో ఉన్న అభిమానాన్ని ఎక్కడ ముందు ముందు ముందు పరిటాల శ్రీరామ్‍ అనుకూలంగా మలుచుకుంటారేమో అన్న ఆలోచనతో మొక్కగానే ఉన్నప్పుడే వంచితే బాగుంటుందన్న చందంగా పరిటాల శ్రీరామ్‍ రాజకీయంగా ఎదగకుండా అధికార నేతలు, అధికార ప్రజాప్రతినిధులు పదే పదే పరిటాల శ్రీరామ్‍పై కేసులు నమోదు చేయిస్తున్నారు.

ఈ విధంగానైనా శ్రీరామ్‍ బయటపడి క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉంటారని అధికార ప్రజాప్రతినిధుల నమ్మకం. తనపై ఎన్ని అక్రమ కేసులు నమోదు చేసినా బెదిరిపోనని రాజకీయ పోరాట కుటుంబ వారసుడిగా తాను రాజకీయాల్లోకి వచ్చానని.. వెనకడుగు వేసే ప్రసక్తే లేదంటున్నారు శ్రీరామ్‍. అంతే కాకుండా పార్టీనేతలలో కొందరు అధికార పార్టీ కోవర్టులుగా పనిచేస్తున్నారన్న విషయం పరిటాల కుటుంబ అబిమానులకు అనుమానం ఉంది. అక్రమ కేసులు ఎన్ని బనాయించిన శ్రీరామ్‍ వెనకడుగు వేయరని.. తండ్రి దివంగత పరిటాల రవీంద్ర స్ఫూర్తితో ధైర్యంగా ముందుకు వెళతారని పరిటాల కుటుంబ అభిమానులు అంటున్నారు.

Leave A Reply

Your email address will not be published.