Publisher is the useful and powerful WordPress Newspaper , Magazine and Blog theme with great attention to details, incredible features...

వివేకా హత్య కేసులో సిబిఐ అధికారికి పదికోట్లు ఆఫర్‍ ఇచ్చిన ఎంపీ ఎవరు..?

మాజీ మంత్రి వైఎస్‍.వివేకానందరెడ్డి హత్య కేసును విచారిస్తున్న సిబిఐ అధికారికి ఎంపీ ఒకరు పది కోట్ల రూపాయలు లంచం ఇవ్వచూపారని సంచలన ఆరోపణలు చేశారు అధికార పార్టీ నరసాపూర్‍ ఎంపీ రఘురాంకృష్ణంరాజు.ఆయన చేసిన ఆరోపణలు రాష్ట్రంలో సంచలనాలు రేపాయి. అధికార నేతలలో అలజడి సృష్టించింది. ముఖ్యమంత్రి జగన్‍ రెడ్డితో పాటు ఆయన బందువులు, అమాత్యులు, అధికార ప్రజాప్రతినిధులు, ముఖ్యంగా కడప జిల్లాకు చెందిన జగన్‍ రెడ్డి బందువులు వణికిపోతున్నారట.

ఇంతకీ సిబిఐ అధికారికి పది కోట్లు లంచం ఇవ్వచూపిన ఎంపీ ఎవరు..? ఆయన పేరు కూడా రాజుగారు బయట పెడితే బాగుండేదని వైఎస్‍.కుటుంబ అభిమానులు అంటున్నారు. సిబిఐ విచారణ నత్త నడక నడుస్తున్న నేపధ్యంలో ఎంపీ ఆర్‍ఆర్‍ఆర్‍ చేసిన విమర్శలు, ఆరోపణల ప్రభావం ప్రజల్లోకి చొచ్చుకుని పోయింది. లంచం ఇస్తానన్న ఎంపీ ఎవరు..? ఆ సిబిఐ అధికారి పేరు ఏమిటిని వివరాలు త్వరలో ఆర్‍ఆర్‍ఆర్‍ బయట పెట్టనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.

ఇక అసలు విషయానికి వస్లే గతంలో జరిగిన విషయం రాజకీయ పార్టీల నేతలకు, కార్యకర్తలకు, మీడియా ప్రచారం చేసిన కధనాలను బట్టి మెజార్టీ ప్రజలకు కూడా తెలుసు. దివంగత మాజీ ముఖ్యమంత్రికి స్వయాన సోదరుడు.. తాజా ముఖ్యమంత్రికి స్వయాన చిన్నాన్న, మాజీ మంత్రి వైఎస్‍.వివేకానందరెడ్డి హత్య జరిగి రెండేళ్లు పైగా గడిచింది.

- Advertisement -

మా చిన్నాన్న హత్య వెనుక చంద్రబాబు హస్తం ఉందని.. అప్పట్లో ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్‍ రెడ్డి ఆరోపణలు చేశారు. అంతే కాకుండా సిబిఐ విచారణ కూడా జరపాలని కోర్టులో కేసు వేశారు. ఆ తరువాత ఏం జరిగిందో కానీ.. సిబిఐ విచారణకు కోర్టులో వేసిన కేసును సిఎం జగన్‍ రెడ్డి వెనక్కి తీసుకున్నారు. చిన్నాన్నను ఎవరు హత్య చేశారు అనే విషయం ముఖ్యమంత్రి అయ్యాక కూడా ఇంత వరకు జగన్‍ రెడ్డి బయట పెట్టలేకపోయారు.

చివరకు జగన్‍ రెడ్డి చిన్నాన్న వైఎస్‍.వివేకానందరెడ్డి కుమార్తె స్వయంగా న్యాయస్థానాన్ని ఆశ్రయించి సిబిఐ విచారణ జరిపించాలని కోరారు. న్యాయస్థానం కూడా అందుకు అంగీకరించి సిబిఐ విచారణకు ఆదేశించింది. సిబిఐ విచారణు ముప్పై అడుగులు ముందుకు వెళితే.. 300 అడుగులు వెనిక్కి నడుస్తుందని విమర్శలు వస్తున్నాయి. హత్య కావింపబడిన వివేకా కూతురు ఢిల్లీకి వెళ్లి సిబిఐ అధికారులను స్వయంగా కలిస్తే.. కడప, కర్నూలు జిల్లాలలో ఇలాంటి హత్యలు సాధారణమే అని ఆ అధికారి తేలికగా తీసుకున్నారట.

అంతకు ముందు కేరళ రాష్ట్రానికి చెందిన ఒక వ్యక్తిని కలిసి తన తండ్రి హత్యను బయట పెట్టాలని ఆమె స్వయంగా కోరగా.. ఆవ్యక్తి ఆవేశంతో ఊగిపోయి.. మీరే ఏమీ కంగారు పడద్దు.. ఆరు నెలల్లో మీ నాన్న హత్య చేసిన వారి విషయం బయట పెడతానన్నారట. ఆ అధికారి ఇంత వరకు ఆ ఊసే ఎత్తడం లేదు. సిబిఐ విచారణ ఎప్పుడు పూర్తవుతోందో తె•లియదు. హంతకులను సిబిఐ అధికారులు కనిపెట్టగలరా..? ఇదంతా అధికార వ్యవస్థలో జరుగుతున్న లోపాలను బట్ట బయలు చేస్తుంది.

Leave A Reply

Your email address will not be published.