Publisher is the useful and powerful WordPress Newspaper , Magazine and Blog theme with great attention to details, incredible features...

ఆదిత్యనాద్‍ సర్వీసు పొడిగింపుకు సిఎంవో అధికారి అడ్డుపడుతున్నారా..?

జూన్‍ మాసాంతానికి రిటైర్డు కాబోతున్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాద్‍ సర్వీసును మరో మూడు నెలలు పొడిగించాలని.. కేంద్రానికి ముఖ్యమంత్రి సిఫార్సు చేయగా.. ఆదిత్యనాద్‍ దాస్‍ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా కొనసాగటం ఇష్టం లేని ముఖ్యమంత్రి కార్యాలయ ముఖ్య అధికారి ఒకరు.. ఢిల్లీలో తనకున్న అధికార పరిచయాలతో ఆదిత్యనాద్‍దాస్‍ సర్వీసు పొడిగింపుకు అడ్డు పడుతున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం.

ముఖ్యమంత్రి జగన్‍ రెడ్డి కూడా ఆదిత్యనాద్‍దాస్‍కు అత్యంత సన్నిహితుడు కావటంతో ముఖ్యమంత్రి కార్యాలయ కార్యదర్శి చెప్పు చేతల్లో ఆయన ఉండకుండా.. స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోవటం సిఎంవో ముఖ్యఅధికారికి మింగుడు పడటం లేదు. గతంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్న నీలంసహాని పొడిగింపుకు కేంద్రానికి ముఖ్యమంత్రితో సిఫార్సు చేయించిన సిఎంవో ముఖ్య అధికారి ఆదిత్యనాద్‍ దాస్‍ సర్వీసును పొడిగించాలని సిఎం జగన్‍ రెడ్డి నిర్ణయం తీసుకున్నప్పటికీ.. కేంద్రానికి సిఫార్సు చేయటంతో నెల రోజులు జాప్యం చేయటం వెనుక ముఖ్యమంత్రి కార్యాలయ ముఖ్య అధికారి హస్తం ఉందని కూడా సచివాలయంలో ప్రచారం జరిగింది.

- Advertisement -

మరో 20 రోజుల్లో రిటైర్డు కాబోతున్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాద్‍ దాస్‍ సర్వీసు పొడిగింపును ఆమోదించకపోవటానికి.. ఢిల్లీలో కేంద్రమంత్రి కార్యాలయ అధికారులలో కొందరిపై ముఖ్యమంత్రి కార్యాలయ ముఖ్య అధికారి ఒకరు ఒత్తిడి తెస్తున్నట్లు తమకు తెలిసిందని అధికారులు అంటున్నారు. అపార అనుభవంతో పాటు అన్ని వర్గాల అధికారులు, ఉద్యోగులు, రాజకీయ వర్గాల అభిమానం చూరగొన్న ఆదిత్యనాద్‍ దాస్‍ అంటే సిఎంవో ముఖ్య అధికారి ఒకరు అసూయ, ద్వేషాలతో, ఈర్ష్యతో రగిలిపోతుంటారట.

తాజాగా ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటనకు వెళ్లిన నేపధ్యంలో ఆయనతో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కూడా ఉన్న నేపధ్యంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని జగన్‍ రెడ్డి కలిస్తే.. ఆదిత్యనాద్‍ సర్వీసు పొడిగింపుకు తాను సిఫార్సు చేసిన విషయాన్ని గుర్తు చేయవచ్చు. మరో మూడు నెలలు సర్వీసు పొడిగింపు ఇచ్చినా.. పరవాలేదు. ఇవ్వపోయినా బాధపడను.. అని ఆదిత్యనాద్‍ దాస్‍ కొందరితో తెర వెనుక చెబుతున్నట్లు బయటకు పొక్కింది.

వైఎస్‍ కుటుంబానికి అత్యంత విధేయుడైన ఆదిత్యనాద్‍ దాస్‍ను ఏదో విధంగా ఇబ్బంది పెట్టాలని సిఎంవో ముఖ్య అధికారి చేసిన ప్రయత్నాలు విఫలం కావటంతో.. ఆయన సర్వీసును పొడిగించకుండా.. ఏదో విధంగా అడ్డుపడితే.. భవిష్యత్తులో ఏ అధికారి సిఎస్‍గా వచ్చినా.. తన ఆదేశాలు పాటిస్తారని.. ముఖ్యమంత్రి కార్యాలయ ముఖ్య అధికారి నమ్మకం. ఆదిత్యనాద్‍ దాస్‍ సర్వీసును మరో మూడు నెలలు పెంచటం ఖాయమని.. మరో వారంలో కేంద్రం నుండి అనుమతి వస్తుందంటున్నారు సీనియర్‍ ఐఎఎస్‍ అధికారులు.

Leave A Reply

Your email address will not be published.