Publisher is the useful and powerful WordPress Newspaper , Magazine and Blog theme with great attention to details, incredible features...

సిఎం కార్యాలయ అధికారులపై ఐవైఆర్‍ సంచలన వ్యాఖ్యలు..!

ఆ రిటైర్డు ఐఎఎస్‍ అధికారికి చంద్రబాబుకు తీవ్ర వ్యతిరేక వాదిగా.. సిఎం జగన్‍ రెడ్డికి అనుకూలవాదిగా పేరుంది. సర్వీసు నుండి రిటైర్డు అయ్యాక బిజెపిలో చేరిన ఆ ఐఎఎస్‍ అధికారి గత ఎన్నికలలో చంద్రబాబుకు వ్యతిరేకంగా జగన్‍ రెడ్డికి అనుకూలంగా ప్రచారం చేశారు.తన సామాజికవర్గ ఓటర్లలో చంద్రబాబుపై వ్యతిరేకతను లౌక్యంగా పెంచారు.

ఎన్నికలకు ముందు రిటైర్డు ఐఎఎస్‍ అధికారులతో రహస్య సమావేశాలు జరిపి చంద్రబాబుకు వ్యతిరేకంగా ప్రచారం చేయాలని ఆ రిటైర్డు ఐఎఎస్‍ అధికారి కోరినట్లు కూడా బయటకు పొక్కింది. ఆ రిటైర్డు ఐఎఎస్‍ అధికారి పేరు ఐవైఆర్‍.కృష్ణారావు. చంద్రబాబు హయాంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించి రిటైర్డు అయ్యాక బ్రాహ్మణ కార్పోరేషన్‍ ఛైర్మన్‍గా నియమితులై.. అప్పటి సిఎం కార్యాలయ అధికారులతో వచ్చిన విభేదాలతో ఛైర్మన్‍ పదవికి రాజీనామా చేశారు. అప్పటి నుండి చంద్రబాబుపై వ్యతిరేకతతోనే సిఎం జగన్‍ రెడ్డికి అనుకూలంగా మారారు.

- Advertisement -

అప్పట్లో సిఎంవోలో పనిచేస్తున్న ఒకరిద్దరి అధికారుల పనితీరును ఐవైఆర్‍ తప్పుబట్టారే తప్ప ముఖ్యమంత్రి కార్యాలయాన్ని ఆయన తప్పుబట్టలేదు. తాజాగా ఐవైఆర్‍ కృష్ణారావు సిఎం జగన్‍ రెడ్డి కార్యాలయంపై ఏ విధమైన వ్యాఖ్యలు చేశారంటే.. తన 35ఏళ్ల అధికార అనుభవంలో తాజా ముఖ్యమంత్రి కార్యాలయాన్ని కానీ.. ఆ కార్యాలయంలో పనిచేస్తున్న అధికారులను కానీ ఇంతకు ముందు ఎన్నడూ చూడలేదని.. అలాంటి దౌర్భాగ్య పరిస్థితిలో ముఖ్యమంత్రి కార్యాలయం ఉందని.. రిటైర్డు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్‍.కృష్ణారావు బాహాటంగా వ్యాఖ్యానించటం సంచలనం సృష్టించింది.

ఇంతకు ముందు ముఖ్యమంత్రుల కార్యాలయాలలో వివిధ హోదాలలో పనిచేసిన అధికారుల పనితీరుపై విమర్శలు,ఆరోపణలు వచ్చాయే కానీ ముఖ్యమంత్రుల కార్యాలయాలను ఏ ఒక్కరూ విమర్శించలేదు.. తప్పుబట్టలేదు.. అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేయలేదు.

ఏయే కారణాలతో సిఎం జగన్‍ రెడ్డి కార్యాలయాన్ని ఐవైఆర్‍.కృష్ణారావు తప్పుబట్టారనే విషయం బయటపడనప్పటికీ.. తాజా ముఖ్యమంత్రి కార్యాలయ అదికారులపై మెజార్టీ మంత్రులు, మెజార్టీ అధికార ప్రతినిధులు, అధికార పార్టీ నేతలు అనేక సందర్భాలలో తెర వెనుకుండి పత్రికలలో ప్రచురించలేని వ్యాఖ్యలు చేశారని బయటకు పొక్కింది. ఆ ఆధారాలతోనే ఐవైఆర్‍.కృష్ణారావు తాజాగా ముఖ్యమంత్రి కార్యాలయ అధికారుల పనితీరును తప్పుబట్టినట్లు స్పష్టమవుతోందంటున్నారు అధికారులు.

Leave A Reply

Your email address will not be published.