Publisher is the useful and powerful WordPress Newspaper , Magazine and Blog theme with great attention to details, incredible features...

ఐఎఎస్‍ వ్యవస్థపై జగన్‍ రెడ్డికి అవగాహన లేదా..?

ఐఎఎస్‍ అధికారి సబ్‍ కలెక్టర్‍ హోదాతో బాధ్యతలు నిర్వహిస్తూ.. ముఖ్య కార్యదర్శి లేదా ప్రత్యేక ప్రధాన కార్యదర్శి హోదాకు చేరుకుని రిటైర్డు అవుతారు. ఈ మధ్య కాలంలో జాయింట్‍ కలెక్టర్‍, కలెక్టర్‍, కార్యదర్శి హోదాలో ఐఎఎస్‍ అధికారులు బాధ్యతలు నిర్వహిస్తారు. ఒక ఐఎఎస్‍ అధికారి 25ఏళ్లు పైగా సర్వీసు గడిస్తే.. ఆయన ముఖ్యకార్యదర్శి హోదాకు చేరుకుంటారు. అదే విధంగా 30ఏళ్లు పైగా సర్వీసు చేస్తే.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హోదాకు చేరుకుంటారు. దానర్ధం ఏమిటంటే.. వారి సర్వీసు బట్టి కాకుండా వారి వయసును బట్టి (పదవీ కాలాన్ని బట్టి)ఒకొక్కరు ఆహోదాకు చేరుకుంటారు. ఈ ఐఎఎస్‍ వ్యవస్థపై ముఖ్యమంత్రి జగన్‍ రెడ్డి అసలు అవగాహనే లేదన్నట్లుగా ఆయన తీసుకునే నిర్ణయాలు, వ్యవహార శైలిని బట్టి స్పష్టమవుతోంది. ఐఎఎస్‍కు ఎంపిక అయిన అధికారులు శిక్షణ కాలం పూర్తయ్యాక వారిని ముందుగా సబ్‍ కలెక్టర్‍గా నియమిస్తారు. ఆ తరువాత అంచెలంచెలుగా సబ్‍కలెక్టర్‍, జాయింట్‍ కలెక్టర్‍, కలెక్టర్‍, కార్యదర్శి, ముఖ్యకార్యదర్శి, చివరకు ప్రత్యేక ప్రధాన కార్యదర్శి స్థాయి వరకు వారికున్న సర్వీసును బట్టి చేరుకుంటారు. ఈ విషయాలు ముఖ్యమంత్రి జగన్‍ రెడ్డికి తెలిసినట్లుగా లేదు.

- Advertisement -

ఐఎఎస్‍ అధికారులందరినీ.. అంటే జూనియర్‍, సీనియర్లందరూ ఒకటే అని వారందరూ తన కింద పనిచేస్తున్నారని.. సిఎం జగన్‍ రెడ్డి నమ్మకం. సచివాలయంలో శాఖాదిపతిగా ఐఎఎస్‍ అధికారిని నియమించాలంటే.. ఆ అధికారి కార్యదర్శి హోదాలో ఉండాల్సి ఉంటుంది. అంతే కానీ సబ్‍ కలెక్టర్‍, జాయింట్‍ కలెక్టర్‍, కలెక్టర్లను (కార్యదర్శి స్థాయికిచేరుకోకుంటే..) శాఖాదిపతిగా నియమించటం నిబందనల ప్రకారం సాధ్యపడదు. అంతే కాకుండా సచివాలయంలో కొన్ని శాఖాదిపతులుగా నియమించాలంటే.. వారు ముఖ్య కార్యదర్శి హోదాలో కానీ.. ప్రత్యేక ప్రధాన కార్యదర్శి హోదాలో కానీ ఉండాల్సిందే. గతంలో రవాణ,రోడ్లు,భవనాలు, అడవులు,పర్యావరణం, మునిసిపల్‍, పంచాయితీరాజ్‍మరియు గ్రామీణాభివృద్ది, రెవిన్యూ, ఎక్సైజ్‍, కమర్షియల్‍ టాక్స్, రిజిస్ట్రేషన్‍ స్టాంపుల శాఖాదిపతిగా ప్రత్యేక ప్రధాన కార్యదర్శి హోదా లేదా సీనియర్‍ ముఖ్యకార్యదర్శిని నియమించే సంప్రదాయం ఉండేది.ఆ సంద్రాయాన్ని సిఎం జగన్‍ రెడ్డి పాటించటం లేదు. ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, సీనియర్‍ ముఖ్య కార్యదర్శి బాధ్యతలు నిర్వహించాల్సిన శాఖలలో జూనియర్‍ ఐఎఎస్‍లను నియమిస్తున్నారు. ఇది సంప్రదాయం కాదు.. సీనియార్టీని తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది.

ముఖ్యమంత్రి జగన్‍ రెడ్డికి సిఎంవో అధికారులు చెబుతున్నారా లేదా అనే విషయం బయట పడటంలేదు. గతంలో అటవీ శాఖాదిపతిగా ప్రత్యేక కార్యదర్శి లేదా ముఖ్యకార్యదర్శి హోదాకు చేరుకున్న ఐఎఎస్‍లనే నియమించేవారు. తాజాగా కార్యదర్శి హోదాకు చేరుకున్న విజయ్‍కుమార్‍ను అటవీ శాఖాదిపతిగా నియమించారు. అదే విధంగా రెవిన్యూ, మునిసిపల్‍, పంచాయితీరాజ్‍, మరియు గ్రామీణాభివృద్ది సోషల్‍ వెల్ఫేర్‍ శాఖాదిపతిగా సీనియర్‍ ఐఎఎస్‍లను నియమించకుండా.. జూనియర్‍ ఐఎఎస్‍లను నియమించటంతో గత సంప్రదాయాలను జగన్‍ రెడ్డి పాటించటం లేదని స్పష్టం అవుతోంది.

Leave A Reply

Your email address will not be published.