Publisher is the useful and powerful WordPress Newspaper , Magazine and Blog theme with great attention to details, incredible features...

ఆర్‍ఆర్‍ఆర్‍ను కట్టడి చేయలేని జగన్‍రెడ్డి..!

ఆయన అధికార పార్టీ ఎంపీ.. అయినా సరే సిఎం జగన్‍ రెడ్డిపై విమర్శలు, ఆరోపణలు చేస్తూనే ఉంటారు. అదేమిటి సార్‍ మీ ముఖ్యమంత్రిపై విమర్శలు, ఆరోపణలు చేస్తుంటారు అని ఎవరైనా అడిగితే.. మాముఖ్యమంత్రి క్షేమంకోసమే అని లౌక్యంగా ఆ ఎంపీ సమాదానం చెబుతారు. గత వారం పది రోజుల నుండి ఆ ఎంపీ సిఎం జగన్‍ రెడ్డికి చుక్కలు చూపిస్తున్నారు. చివరకు సిబిఐ కోర్టు ఇచ్చిన బెయిల్‍ కూడా రద్దు చేయాలని సిబిఐ కోర్టులో ఆ ఎంపీ పిటిషన్‍ వేసి సంచలనం రేపారు.

ఆ ఎంపీని పార్టీ నుండి సస్పెండ్‍ చేస్తే.. మరింత బరి తెగించి బయట పడి.. తెగిస్తారని సిఎం జగన్‍ రెడ్డికి తెలుసు. అందుకే ఆ ఎంపీ ఎన్నెన్ని విమర్శలు, ఆరోపణలు చేస్తున్నా.. తేలు కుట్టిన చందంగా మౌనంగానే బరిస్తున్నారు. విపక్షాల నేతల విమర్శలు, ఆరోపణల కన్నా.. ఆ ఎంపీ విమర్శలలో పదును, పస ఉండటంతో అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, అమాత్యులు కూడా బయట పడి ఎదురు దాడి చేయలేకపోతున్నారు. ఆ ఎంపీ విమర్శలను, ఆరోపణలను పట్టించుకోవద్దని సిఎం జగన్‍ రెడ్డి మంత్రులకు, ఎమ్మెల్యేలకు చెప్పి ఉంటారని ప్రచారం జరుగుతోంది.

ముఖ్యమంత్రి జగన్‍ రెడ్డి ఇమేజ్‍ను ఆ ఎంపి డ్యామేజ్‍ చేస్తున్నా.. కళ్లున్న గుడ్డివాని వలె వినపడే చెవులు ఉన్నా.. చెవిటి వాని వలె మౌనంగా భరిస్తూ.. ఎలా ముందుకు వెళ్లాలో తెలియక… ముందు ముందు ఏం జరగబోతుందో అనే విషయం తెలియక సిఎం జగన్‍ రెడ్డి కొట్టుమిట్టాడుతున్నారట. అటు చంద్రబాబు ఇటు జనసేనాదిపతి పవన్‍ కళ్యాణ్‍లతో పాటు ఇతర విపక్షాల ముఖ్యనేతలు కూడా సిఎం జగన్‍ రెడ్డిని ఇరుకున పెట్టలేకపోతున్నారు. రాజకీయంగా దెబ్బ కొట్టలేకపోతున్నారు.

- Advertisement -

ప్రభుత్వ యంత్రాంగం అంతా అధికార పార్టీ నేతల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా.. ఏమీ చేయలేని నిస్సయతతో మౌనం వహిస్తున్నారు. కానీ ఆ అధికార ఎంపీ వాడి వేడి విమర్శలు, ఆరోపణలకు సిఎం జగన్‍ రెడ్డి ధీటుగా సమాధానం చెప్పలేకపోతున్నారు. అధికార ప్రజాప్రతినిధులు, అధికార నేతలు కుడితిలో పడ్డ బల్లిలా గిల గిల కొట్టుకున్నారు. అటు రాజకీయంగా విమర్శలు, ఆరోపణలు చేస్తూనే.. ఇటు న్యాయస్థానంలో కూడా ఆ ఎంపీ కేసు దాఖలు చేయటంతో ఇంకెన్నాళ్లు ఆ ఎంపీని బరించాలి అని అమాత్యులు, అధికార ప్రజాప్రతినిధులు పార్టీ ముఖ్యనేతలను నిలదీస్తున్నారట.

సిఎం జగన్‍ రెడ్డికి కంటిపై కునుకు పట్టకుండా చేయటంలో ఆ ఎంపీ చేస్తున్న హడావిడిపై అధికార వర్గాలు ఆశ్చర్యపోతున్నాయి. ఎక్కడో ఏదో జరుగుతోంది. కేంద్ర బిజెపి పెద్దల ఆశీస్సులు ఆ ఎంపీకి ఉండి ఉంటాయని.. బిజెపి నేతలు తెర వెనుకచెబుతున్నారు. రేపో మాపో ఆ ఎంపీపై ఏదో ఒక చర్య తీసుకోకుంటే పరిస్థితి మరింత భయంకరంగా ఉంటుందని.. ఇప్పటికైనా సిఎం జగన్‍ రెడ్డి కళ్లు తెరిచి ఆ ఎంపీని పార్టీ నుండి సస్పెండ్‍ చేయాలని అమాత్యులు, అధికార ప్రజాప్రతినిదులు కోరతున్నట్లు తెలిసింది.

ఆ అధికార ఎంపీ పేరు అందరికీ తెలుసు. ఆయనే నరసాపురం లోక్‍సభ సభ్యుడు రఘురాంకృష్ణం రాజు అలియాస్‍ ఆర్‍ఆర్‍ఆర్‍.ఆయన విమర్శలను ఓర్పుగా, ఓపిగ్గా బరిస్తున్న ముఖ్యమంత్రి జగన్‍ రెడ్డిని అభినందించవచ్చునంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

Leave A Reply

Your email address will not be published.