Publisher is the useful and powerful WordPress Newspaper , Magazine and Blog theme with great attention to details, incredible features...

చంద్రబాబు హత్యకు జగన్‍ రెడ్డి కుట్ర…?

మా నేతను ఏదో ఒక కారణం చూపి.. కేసును నమోదు చేయించి జైలుకు పంపాలని.. సిఎం జగన్‍ రెడ్డి భావిస్తున్నారు. కానీ ఐదేళ్ల ప్రభుత్వంలో చంద్రబాబు ఎలాంటి తప్పు జరగకపోవటంతో.. చంద్రబాబు సిఎం జగన్‍ రెడ్డిపై ఆదారాలు లేని విమర్శలు, ఆరోపణలు చేస్తున్నారే వంకతో కేసు నమోదు చేయించాలని.. జగన్‍ ఆశపడుతున్నా ఆ పప్పులు ఉడకటం లేదని.. నిన్న మొన్నటి వరకు టిడిపి నేతలు చెప్పేవారు.

చంద్రబాబును అరెస్టు చేసి జైలుకు పంపటం అనుకున్నంత సులువు కాదని.. అక్రమ కేసులు బనాయించి జైలుకు పంపాలన్నా.. న్యాయస్థానాలున్నాయన్న విషయం టిడిపియేతర విపక్షాల నేతలు అనేక సందర్భాలలో అభిప్రాయం వ్యక్తం చేశారు. చంద్రబాబును అరెస్టు చేసేందుకు సిఎం జగన్‍ రెడ్డి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఇంకా ఏ మార్గాన అయినా.. చంద్రబాబుకు ఇబ్బంది పె ట్టాలని.. ఏ పధకాలు పన్నుతున్నారో.. కానీ తాజాగా కడప జిల్లాకు చెందిన టిడిపి నేత సిఎం జగన్‍రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

- Advertisement -

తెలుగుదేశం పార్టీ నేత మాజీముఖ్యమంత్రి చంద్రబాబును ఏదో ఒక కేసులో ఇరికించి జైలుకు పంపించాలనే తాపత్రయంతో ఇప్పటికీ అనేక కేసులు పెట్టించారు.. ఇంకా పెట్టిస్తున్నారు అని మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, టిడిపి నేతలు విమర్శలు చేసిన నేపధ్యంలో.. తాజాగా టిడిపి ఎమ్మెల్సీ బిటెక్‍.రవి సోమవారం నాడు మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. చంద్రబాబు హత్యకు సిఎం జగన్‍ రెడ్డి కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు.

చంద్రబాబు కరోనాపై మాట్లాడితే.. కేసులు పెట్టి నోటీసులు ఇవ్వటంలో మర్మం ఏమిటి..? అరెస్టుల పేరుతో చంద్రబాబును ఆసుపత్రుల చుట్టూ తిప్పి.. కరోనా వ్యాది తగిలించి ఆయనను చంపాలని సిఎం జగన్‍ రెడ్డి చూస్తున్నారని.. రవి దుయ్యబట్టారు. సిఎం జగన్‍రెడ్డిపై 120 బి, 307 సెక్షన్ల కింద కేసు నమోదు చేయాలని.. బిటెక్‍.రవి అన్నారు.

Leave A Reply

Your email address will not be published.