Publisher is the useful and powerful WordPress Newspaper , Magazine and Blog theme with great attention to details, incredible features...

జగన్‍ రెడ్డికు మూడు రోజులే గడువు..?

మూడు రోజుల గడువు జగన్‍ రెడ్డి కొంప ముంచుతుందా.. బయట పడేస్తుందా…?

ఇంకా మూడు రోజులు మాత్రమే గడువు ఉంది. సిఎం జగన్‍ రెడ్డి బెయిలు రద్దు చేయాలని ఎంపీ రఘురాంకృష్ణం రాజు వేసిన పిటిషన్‍పై కౌంటరు దాఖలు చేసేందుకు సిబిఐ న్యాయస్థానం ఆఖరి అవకాశం ఇచ్చిన నేపధ్యంలో సిబిఐ అధికారులు ఏ విధంగా కౌంటరు వేయబోతున్నారన్న విషయం బయట పడటంలేదు. ఈ విషయంలో కేంద్ర అధికార పెద్దల ఆలోచన ఎలా ఉంది. సిబిఐ అధికారుల నుండి క్రింది స్థాయి అధికారులకు ఇంతవరకు ఎలాంటి సంకేతికాలు అందలేదు. సిఎం జగన్‍ రెడ్డి బెయిలును రద్దు చేయవద్దని తప్పనిసరిగా కౌంటరు వేస్తారు.

ముఖ్యమంత్రి జగన్‍ రెడ్డి బెయిలును రద్దు చేయాలని ఎంపీ రఘురాంకృష్ణంరాజు సిబిఐ కోర్టులో వేసిన పిటిషన్‍కు కౌంటరు దాఖలు చేయకుండా.. కాలయాపన చేస్తుండటంతో.. జూన్‍ 1వ తేదీన కౌంటరు వేయకుంటే.. ఆరోజు నుండే విచారణ జరుపుతానని సిబిఐ జడ్జి హెచ్చరించిన నేపధ్యంలో కేంద్ర అధికార పెద్దల నుండి ఎలాంటి సూచనలు రాకపోవటంతో.. ఇంత వరకు సిబిఐ అధికారులు కౌంటరు వేయలేదని.. జూన్‍ 1వ తేదీన తప్పనిసరిగా కౌంటరు వేయాలని సిబిఐ జడ్జి ఆదేశించటంతో.. అటు ప్రధాన మంత్రి నరేంద్ర మోడి ఇటు కేంద్ర హోంమంత్రి సిఎం జగన్‍ రెడ్డికి మద్దతుగా నిలిచి ఆయనకు అనుకూలంగా సిబిఐ అధికారులతో కౌంటరు వేయిస్తారా.. అసలు కౌంటరు వేయకుండా మౌనం వహించేట్లు చేస్తారా.. అసలు వారిద్దరి మనసులో ఏముందో బయట పడటంలేదని.. సిబిఐ అధికారుల ద్వారా బయటకు పొక్కింది

- Advertisement -

. నిన్నటి వరకు సిఎంజగన్‍ రెడ్డికి నరేంద్రమోడీ, అమిత్‍షాల ఆశీస్సులున్నాయని.. ప్రచారం జరుగుతున్న నేపధ్యంలో.. ఏపీలో బిజెపి పూర్తిగా తుడిచి పెట్టుకుపోయింది. తిరుపతి లోక్‍సభ ఉప ఎన్నికలో పవన్‍ కళ్యాణ్‍ మద్దతిచ్చినా కూడా డిపాజిట్‍కూడా దక్కకపోవటమే అందుకు నిదర్శనమని బిజెపి నేతలే తెర వెనుక అంటున్నారు.

ఇప్పటికే జాతీయ స్థాయిలో నరేంద్రమోడీ ప్రతిష్ట మసకబారిన నేపధ్యంలో జగన్‍కు అనుకూలంగా సిబిఐ అధికారులు కౌంటరు వేస్తే.. ఆ ప్రభావం ఆయనపై పడి ఆయన ప్రతిష్ట పూర్తిగా మసకబారటం ఖాయమంటున్నారు రాజకీయ విశ్లేషకులు. తన బెయిలు రద్దు చేయకూడదని.. సిఎం జగన్‍ రెడ్డి కౌంటరు వేయటం ఖాయం. సిబిఐ అధికారులు ఏ విధంగా కౌంటరు వేయబోతున్నారన్న విషయం ఇప్పటికీ బయట పడటం లేదు.

పైనుండి మాకు ఆదేశాలు రాలేదని.. క్రింది స్థాయి సిబిఐ అధికారులు తెర వెనుక చెబుతున్నారు. తాజాగా సిబిఐ డైరెక్టరుగా సీనియర్‍ పోలీసు అధికారిని నియమించటంతో.. సిఎం జగన్‍ రెడ్డిపై కౌంటరు వేయటంలో ఆయన నిర్ణయం ఎలా ఉండబోతుందో అని జగన్‍ పార్టీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.